Guppedantha Manasu November 23rd Episode:ఆనందంలో రిషిధార, అయోమయంలో అనుపమ, దేవయానికి షాకిచ్చిన ఫణీంద్ర!
Guppedantha Manasu Today Episode: రిషి-వసుధార మధ్య బంధం బలపడింది...మరోవైపు శైలేంద్ర కుట్రలు సాగుతూనే ఉన్నాయి..ఇంకోవైపు అనుపమ ఎంట్రీ ఇచ్చింది...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
Guppedantha Manasu November 23nd Episode (గుప్పెడంతమనసు నవంబరు 23 ఎపిసోడ్)
అనుపమ మాటలు తలుచుకుని వసుధార బాధపడుతుంది. దేవయాని మేడం ఆవిడ ఆలోచనలు పొల్యూట్ చేసినట్టున్నారు..నేను అప్రమత్తంగా లేకపోతే ఆమె ఆలోచనలు పొల్యూట్ అయిపోతాయని బాధపడుతుంది. ఇంతలో రిషి వచ్చి.. అనుపమ-మహేంద్ర గురించి మాట్లాడి సంతోషిస్తాడు.
రిషి: డాడ్ ఒంటరితనం చూడలేక అమ్మ ఆమెను ఇక్కడికి పంపించినట్లుగా ఉంది. భోజనం చేస్తున్న టైమ్‌లో ఇద్దరి మధ్య స్నేహం బయటపడింది
చాలా రోజుల తర్వాత డాడ్ యాక్టివ్‌గా కనిపించారు
వసు:ఇదే మార్పు కంటిన్యూ అయితే మావయ్యలో తొందరగా మార్పు వస్తుంది.. అనుపమ తరచూ వస్తూ ఉంటే మామయ్య పూర్తిగా మారిపోతారు
రిషి: అందుకే తనని తరచూ రమ్మని అడిగాను...తను వస్తుంటే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి
వసు: తను పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఎందుకు ఉందో తెలియడం లేదు
రిషి: తన జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు ఉన్నాయో ఎవరికి తెలుసు. ఆ దేవుడు ఒక్కొక్కరి తలరాతను ఒక్కోలా రాస్తాడు . హ్యాపీగా ఉంటామని అనుకున్న మన జీవితంలోనే దేవుడు ఎన్నో ఒడిదుడుకులను సృష్టించాడు
వసు: ఎన్ని అడ్డంకులు ఎదురైనా చివరకు కలిసిపోయాం కదా...
ఇద్దరూ లోపలకు వెళతారు..మహేంద్ర ఫోన్లో ఏదో చూస్తూ నవ్వుతూ ఉంటాడు...
రిషి: ఏంటి ఈ రోజు కొత్తగా కనిపిస్తున్నారు..ఏంటి స్పెషల్
మహేంద్ర: నేను ఎప్పటిలానే ఉన్నాను
వసు: నాక్కూడా ఛేంజ్ కనిపిస్తోంది సార్
మహేంద్ర: ఏం లేదని చెబుతున్నా కదా
రిషి:మాకు తెలియనిది మీకు తెలిసినది ఏదో ఉంది..మీరు ఇలా చిరునవ్వుతో ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. దేని గురించి ఎక్కువగా ఆలోచించకుండా మనసులో ఏం పెట్టుకోకుండా ప్రశాంతంగా పడుకోండి
కొడుకు తనపై చూపిస్తున్న ప్రేమ చూసి మహేంద్ర పొంగిపోతాడు. ఒక తల్లి తన బిడ్డను ఎలా చూసుకుంటుందో రిషి అలా తనను చూసుకుంటున్నాడని ఆనందపడతాడు.
Also Read: శైలేంద్రలో ఈ యాంగిల్ కూడా ఉందా - మహేంద్ర అనుపమ అల్లరి చూసి మరిసిన రిషిధార!
దేవయాని-అనుపమ
అనుపమకు కాల్ చేసిన దేవయాని ఎక్కడున్నావని అడుగుతుంది. నేను ఎక్కడ ఉన్నది తెలుసుకుని ఏం చేస్తారని దేవయానిపై సెటైర్ వేస్తుంది. భోజనానికి ఆహ్వానిస్తుంది దేవయాని. తాను మహేంద్ర ఇంటికి వెళ్లానని, అక్కడే భోజనం చేశానని దేవయానికి సమాధానమిస్తుంది అనుపమ.
మహేంద్రను కలిశావా...నువ్వేం అడిగావు. అతడు ఏం చెప్పాడు. వసుధార ఏమందని ఆత్రంగా అడుగుతుంది. వాళ్లు ఏం చెప్పారనేదాని గురించి మీరు ఎందుకు ఎగ్జైట్‌గా ఫీలువుతున్నారు. ఈ విషయాలు మీరు ఎందుకు తెలుసుకోవాలని అనుకుంటున్నారని దేవయానిని అంటుంది. అనుపమకు అనుమానం వచ్చిందంటూ దేవయాని కంగారు పడుతుంది. వసుధార క్యారెక్టర్ అర్థమైందా అంటే..అవును చాలా తెలివైన అమ్మాయి అని రిప్లై ఇస్తుంది. అదే తెలివైంది కాబట్టే జాగ్రత్తగా ఉండు..వసుధార మంచిదా, చెడ్డదా అన్నది ముందు ముందు నీకే తెలుస్తుంది అని అనుపమతో చెప్పి ఫోన్ కట్ చేస్తుంది దేవయాని. అనుపమ పదే పదే మహేంద్ర ఇంటికి వెళితే నిజాలు భయటపడే ప్రమాదం ఉందని దేవయాని భయపడుతుంది. మరోవైపు దేవయాని తనకు ఎందుకు ఫోన్ చేసిందో, పొంతన లేకుండా ఎందుకు మాట్లాడిందో అనుపమ ఆలోచనలో పడుతుంది.
ALso Read: అనుపమను దారి మళ్లించే ప్రయత్నంలో దేవయాని, రిషిధార ఎలా చెక్ పెడతారు!
ప్రేమ పంచాయతీ
డీబీఎస్‌టీ కాలేజీలో చిత్ర అనే స్టూడెంట్‌ను ఓ బయటి కాలేజీ స్టూడెంట్ వేధిస్తుంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రిషి, వసుధార క్లాస్ ఇస్తారు. తామిద్దరం ప్రేమికులమని, ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని నాతో మాట్లాడటం లేదని చెబుతాడు. ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశాననే కోపంతో ఫొటోలను మార్ఫింగ్ చేశాడని, వాటిని చూపిస్తూ ప్రేమించానని వెంటపడుతున్నాడని ఆ అమ్మాయి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ అబ్బాయికి రిషి క్లాస్ వేస్తాడు. ఆ అమ్మాయిని నిజంగా ప్రేమిస్తే ఆమెను వేదించకుండా నిజాయితీగా ఆ అమ్మాయి ప్రేమ కోసం ఎదురుచూడాలని చెప్పి వార్నింగ్ ఇస్తాడు రిషి.
Also Read: అష్టైశ్వర్యాలను ప్రసాదించే క్షీరాబ్ది ద్వాదశి పూజా విధానం!
కొత్త శైలేంద్ర
తండ్రి ముందు ధరణి ఇచ్చిన కాఫీని, వంటలని తెగ పొగిడేస్తాడు. మరోవైపు ఫణీంద్ర ఇంటి పనుల కోసం పనిమనిషిని నియమిస్తాడు. ధరణి ఉండగా పనిమనిషి ఎందుకని దేవయాని వాదనకు దిగుతుంది. ధరణి కొద్ది రోజులు ఇంట్లో ఉండడం లేదు...ధరణి, శైలేంద్ర కొద్ది రోజులు సంతోషంగా గడిపేందుకు ట్రిప్ ప్లాన్ చేశానని చెబుతాడు. దేవయానికి పెద్ద షాకే ఇది...
ఇవాల్టి ఎపిసోడ్ ముగిసింది...