అన్వేషించండి

Guppedantha Manasu December 19th Episode: రిషిని కిడ్నాప్ చేసింది సాక్షినా, శైలేంద్ర-దేవయానిని బయటకి గెంటేసిన వసుధార!

Guppedantha Manasu Today Episode: శైలేంద్ర కుట్రలకు పాల్పడుతున్నాడని ఆడియో టేప్ విని రిషికి క్లారిటీ వచ్చేసింది...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Guppedantha Manasu December 19th Episode (గుప్పెడంతమనసు డిసెంబరు 19 ఎపిసోడ్)

కాలేజీకి వెళ్లేందుకు శైలేంద్ర రెడీ అవుతుంటాడు..అప్పుడే అవసరమా ఆరోగ్యం బాలేదుకదా అంటుంది దేవయాని. ఇంట్లో ఉంటే బాబాయ్ వచ్చి రచ్చ రచ్చ చేశాడు కదా..అయినా కాలేజీలో ఏం జరుగుతుందో నాకు తెలియాలి అందుకే వెళుతున్నాను అంటాడు. ఇంతలో ధరణి ఎంట్రీ ఇచ్చి కాలేజీకి వెళతారా అని అడుగుతుంది. 
దేవయాని: నా కొడుక్కి పని ముఖ్యం
ధరణి: అవునా..ఇంతకీ కాలేజీకి వెళ్లి అక్కడేం పని చేస్తారు
దేవయాని: ఫైల్స్ చెక్ చేస్తాడు..అయినా నీకు అవన్నీ తెలియదు కదా...
ధరణి: మావయ్యకి చెప్పి ఆ ఫైల్స్ ఏవో ఇక్కడకి తెప్పిస్తాను...ఆ పెట్టే సంతకాలేవో ఇక్కడే పెట్టమనండి..నేను ఏమీ అనుకోను
దేవయాని: నువ్వు రోజు రోజుకీ చాలా మారిపోతున్నావ్..కొంచెం కూడా భయం లేకుండా పోతోంది
శైలేంద్ర: నేను కాలేజీకి వెళతాను...రిషి గురించి నాకు తెలియదని చెప్పినా నమ్మడం లేదు..దానికి కారణం నేనని నన్ను అనుమానిస్తున్నారు. ఈ రోజు బాబాయ్ అనుమానించినట్టే పది మందీ అనుమానిస్తారు.అందుకే నేను కాలేజీకి వెళ్లి రిషి గురించి సమాచారం కలెక్ట్ చేసి రిషిని వెతికే పనిలో ఉంటాను..
ధరణి: అయితే మీతోపాటూ నేనూ వస్తాను..ఆయన్ని ఒంటరిగా పంపించడం అవసరమా
దేవయాని: అలా అయితే నేనే వెళతాను..నువ్వు పక్కనే ఉన్నప్పుడే కదా దాడి జరిగింది..ఏదైనా ప్రమాదం జరిగితే ఆపగలవా..అందుకే నేను వెళతాను. నువ్వు ఇక్కడే ఉండి ఇంటిపని, వంటపని చేసుకో నీకే మంచిది కాదు.. 
దేవయాని, శైలేంద్ర ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు...
ధరణి: రిషి ఎక్కడున్నాడో ఏమో...వీళ్ల రాక్షసత్వం ఎప్పుడు బయటపడుతుందో ఏమో అనుకుంటుంది ధరణి..

Also Read: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: అనుపమను కాల్చేస్తానన్న మహేంద్ర - రిషి విషయంలో అబద్దం చెప్పిన వసుధార

కాలేజీలో నోటీస్ చూస్తూ నిల్చుంటుంది వసు..ఇంతలో అక్కడకు వచ్చిన అనుపమ కూడా ఆ నోటీస్ చూసి ఏంటిలా నోటీస్ ఇచ్చావ్ అని అడుగుతుంది.
వసు: తప్పలేదు మేడం..అందుకే అలా చేయాల్సి వచ్చింది. జగతి మేడం కూడా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని కాలేజీ నడిపించారు. ఆవిడ ప్రాణం కోల్పోయారు. రిషి సార్ మాటని కాదనలేక, జగతి మేడం స్ఫూర్తిని వదల్లేక ఆ ఎండీ సీటులో కూర్చున్నాను..చుట్టూ చాలా కుట్రలు జరుగుతున్నాయి. మళ్లీ కన్నీళ్లపర్వం మొదలైంది మేడం..
అనుపమ: వసుధారా....
వసు: అసలు ఎందుకిలా జరుగుతోంది.కనిపించకుండా పోవడం అనేది నాకే జరిగితే పోయేది కదా..
అనుపమ: జగతి స్ఫూర్తి అన్నావ్..నువ్వు ధైర్యంగా ఉండాలి..రిషికి ఏం కాదు..తను తిరిగొస్తాడు..నా సిక్త్ సెన్స్ చెబుతోంది...రిషి త్వరలోనే వస్తాడని..అందుకే నేను ఇంత బలంగా చెబుతున్నా అంటూ ధైర్యం చెబుతుంది..
మహేంద్ర: రిషి తప్పకుండా తిరిగొస్తాడు...మీ ప్రేమే మిమ్మల్ని ఒక్కటి చేస్తుంది ధైర్యంగా ఉండు...

Also Read: రిషి ఉన్నాడా లేడా - శైలేంద్రకి షాకిచ్చిన ఫణీంద్ర!

కాలేజీ లోకి ఎంట్రీ ఇస్తారు శైలేంద్ర, దేవయాని...
శైలేంద్ర: ఈ కాలేజీని ఇలా చూస్తుంటే నాకేం అనిపిస్తోందో తెలుసా....
దేవయాని: ఇది నువ్వు ఏలాల్సిన సామ్రాజ్యం..ఆ ఎండీసీట్లో కూర్చోవాలని అనుకుంటున్నావ్...
శైలేంద్ర: నా మనసులో ఏముందో కరెక్టుగా తెలుసుకున్నావ్..నీ కోరిక కూడా అదే కదా..కచ్చితంగా నీ కోరిక నెరవేరుస్తాను...ఆ ఎండీసీట్లో ఎప్పుడు కూర్చుంటానా అని ఎదురుచూస్తున్నా
దేవయాని: ఇప్పుడే కూర్చో..రిషి కూడా లేడు కదా..పద కూర్చుందిగానివి అని దేవయాని తీసుకెళ్తుంది.. వసుధార అడ్డుపడుతుందేమో అని శైలేంద్ర అంటే..నువ్వు తన గురించి ఆలోచించకు నాన్నా అంటుంది దేవయాని..
అటుగా వెళుతున్న ప్యూన్ ని పిలిచి వసుధార ఎక్కడుందని అడిగితే..నోటీస్ బోర్డు దగ్గరుందని చెబుతాడు...
అప్పుడు దేవయాని, శైలేంద్ర ఎండీ రూమ్ లోకి వెళతారు... శైలేంద్ర ఆ కుర్చిని చూసి మురిసిపోతుంటాడు..
శైలేంద్ర: డీబీఎస్టీ ఎండీ శైలేంద్ర భూషణ్ అనే పేరు టేబుల్ పైకి రావాలి కదా...ఈ ఎండీ సీటు నన్ను ఐస్కాంతం లాగినట్టు లాగుతోంది.. అయినా ఇక్కడ మరో సీట్ వేసిందేంటి
దేవయాని: తన భర్త మాత్రమే అక్కడ కూర్చోవాలంట...
శైలేంద్ర: ఇదేమైనా రిజర్వేన్ చేయించుకున్నారా ఏంటి..నేను కూర్చుంటాను అని శైలేంద్ర కూర్చోబోతుంటాడు....
ఇంతలో ఆగు అని వసుధార అరుపు వినిపిస్తుంది....
వసుధార: ఎండీని నేనే కూర్చోలేదు..అది రిషి సార్ సీట్..రిజర్వ్ చేసి పెట్టాను.అందులో కూర్చోవాలంటే అర్హత ఉండాలి
దేవయాని: నా కొడుకు ఫారెన్ లో చదువుకుని వచ్చాడు
వసు: డిగ్రీ ఉంటే సరిపోదు..నాయకత్వ లక్షణాలు ఉండాలి..ఓ మాట చెబితే లెక్చరర్స్ మారుమాట్లాడకుండా మాట వినాలి. ఆ చరిష్మా ఉండాలి.. ఇవన్నీ రిషి సార్ కి మాత్రమే ఉన్నాయి 
శైలేంద్ర: అవన్నీ ఎందుకిప్పుడు..నేను పేషెంట్ ని అసలే..కాసేపు కూర్చుని వెళ్లిపోతాను...
వసు: అంతగా అవసరం అయితే వీల్ ఛైర్ తెప్పిస్తాను..అంతేకానీ మీరు ఈ సీట్లో కూర్చునేందుకు అర్హులు మాత్రం కాదు... ఆ చెయి తీయండి
దేవయాని: ఇది మా సామ్రాజ్యం...నువ్వు వాడిని చేయి తీయమంటారేంటి..
వసు: మీ కొడుకు అయితే మీ ఇంట్లో టెర్రస్ మీద కుర్చీవేసి కూర్చోబెట్టండి నాకేం అభ్యంతరం లేదు... మీ రాచరికాలు, పెత్తనాలు ఇంట్లో చూపించుకోండి ఇక్కడ కాదు..ఇది కాలేజ్
దేవయాని: నువ్వు ఏమైనా చేసుకో..కానీ ఈ కాలేజీ మాది..ఇందులో మేం బోర్డు మెంబర్స్ అన్న విషయం అన్న మర్చిపోయావా
వసు: మీకు ఆ గర్వం తప్ప ఇంకేం తెలియదు కదా..వేలమంది స్టూడెంట్స్ భవిష్యత్ ఈ కాలేజీతో ముడిపడి ఉన్నాయి..ఎవరు పడితే వాళ్లు కూర్చుంటానంటే చూస్తూ ఊరుకోను..ఈ సీట్ ముట్టుకునేందుకు మీ కొడుకు పనికిరాడు... 
శైలేంద్ర: నువ్వు వేసే ప్రతి అడుగు ప్రమాదానికి దగ్గర చేస్తుందని గుర్తుపెట్టుకో...
స్టాపిట్ అని అరుస్తుంది వసుధార... ఇంతలో ప్యూన్ అక్కడకు వస్తాడు...ప్రమాదాలు నాకు కొత్తేం కాదు..మీ బెదిరింపులకు బయటపడే కుందేళ్లు బయట షాపులో దొరుకుతాయి వెళ్లి భయపెట్టుకోండి..ఇక్కడ భయపడేవాళ్లు లేరు...ముందు మీరు ఇక్కడి నుంచి వెళతారా లేదంటే గెంటించాలా అంటుంది...
దేవయాని: నీకు అంత సీన్ ఉందా 
ప్యూన్ ని ఉద్దేశించి వసుధార ఫైర్ అవుతుంది.. నువ్వేం చేస్తున్నావక్కడ...ఎవరు పడితే వాళ్లు క్యాబిన్లోకి వస్తుంటే చూస్తూ ఊరుకుంటావా అని అడుగుతుంది..వీళ్లని మెడపట్టి బయటకి గెంటెయ్ అంటుంది..నీకు ఎలాంటి సమస్య ఉన్నా నేను చూసుకుంటాను అని ప్యూన్ కి హామీ ఇస్తుంది వసుధార... శైలేంద్ర వెళ్లిపోదాం పద అంటాడు..
ఎపిసోడ్ ముగిసింది....

 

2024 మేషరాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

2024 వృషభ రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

2024 మిథున రాశిఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Bigg Boss 8 Telugu Finale LIVE: బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
Chandrababu About NTR: మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
Embed widget