అన్వేషించండి

Guppedantha Manasu December 16th Episode: రిషి ఉన్నాడా లేడా - శైలేంద్రకి షాకిచ్చిన ఫణీంద్ర!

Guppedantha Manasu Today Episode: శైలేంద్ర కుట్రలకు పాల్పడుతున్నాడని ఆడియో టేప్ విని రిషికి క్లారిటీ వచ్చేసింది...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Guppedantha Manasu December 16th Episode (గుప్పెడంతమనసు డిసెంబరు 16 ఎపిసోడ్)
రిషి ఎక్కడున్నాడో చెప్పమంటూ శైలేంద్రని చంపేందుకు సిద్ధమయ్యాడు మహేంద్ర. శైలేంద్రను వెంటాడుతూ హాల్లోకి వచ్చిన మహేంద్ర చంపేస్తానని అంటాడు. ధరణి, దేవయాని అడ్డు పడితే పక్కకు తోసేస్తాడు. ఇంతలో గన్ పేలిన సౌండ్ వస్తుంది. దీంతో ధరణి, దేవయాని గట్టిగా అరుస్తారు. కానీ అనుపమ, వసుధార.. శైలేంద్రను కాల్చకుండా మహేంద్ర గన్‌ను పక్కకు తోసేస్తారు. దాంతో శైలేంద్రకు ఏం కాదు. నన్ను ఆపకండి. శైలేంద్రను ఇవాళ చంపేస్తానని మహేంద్ర ఆవేశంగా అంటాడు. తనని చంపి దోషి అవుతావా అని అనుపమ అంటే.. పర్వాలేదు. వీడివల్ల నా జీవితం చీకటిగా మారింది. ఇప్పుడు దోషిని అయినా, జైలుపాలు అయిన నాకు ఏం అభ్యంతరం లేదు అని మహేంద్ర అంటాడు. ఎలాగోలా నచ్చజెప్పి బలవంతంగా మహేంద్రను బయటకు తీసుకెళ్తారు వసుధార, అనుపమ. ఈరోజు తప్పించుకోవచ్చు. కానీ, ఏదో ఒక రోజు నేను నిన్ను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు మహేంద్ర. ఇంతలో అక్కడికి ఫణీంద్ర వస్తాడు. వసుధార గన్ చీరకొంగుతో దాచేస్తుంది. ఫణీంద్రను చూసి అన్నయ్య అంటూ కౌగిలించుకుంటాడు మహేంద్ర. 

కార్ సౌండ్ విని డాడ్ వచ్చినట్లు ఉన్నారు అని బయటకు వస్తారు శైలేంద్ర, దేవయాని. రిషి జాడ ఇంకా తెలియలేదా. రిషికి ఇలా ఎవరు చేశారో తెలిస్తే చాలు. అది ఎవరో తెలిసిన రోజు నేను వాళ్లను మట్టుపెడతాను. నువ్ ఏం కంగారు పడకు అని ఫణీంద్ర అంటాడు. నేను కూడా బాబాయ్‌కు అదే చెబుతున్నాను. రిషి ఎక్కడున్నా క్షేమంగానే ఉంటాడు అని అన్నాను. అయినా కానీ బాబాయ్ భయపడుతున్నారు అంటూ డ్రామా మొదలెడతాడు  శైలేంద్ర. దేవయాని నాటకం మొదలెడుతుంది. కొడుకు కనిపించకుంటే ఏ తండ్రి మనసు మనసులో ఉండదు. ఇలాగే ఉంటుందని ఫణీంద్ర అంటాడు. మేము వెళ్లొస్తామని చెప్పి వెళ్లిపోతారు మహేంద్ర, అనుపమ, వసుధార. 

Also Read: శైలేంద్రని షూట్ చేసిన మహేంద్ర, వసుధార బాధ్యత ఇకపై అనుపమదే!

ఇంట్లోకి ఫణీంద్ర వచ్చి చూసేసరికి వస్తువులు అన్ని చిందరవందరగా పడి ఉంటాయి. ఏం జరిగిందని ధరణిని అడుగుతాడు. దాంతో రిషి విషయంలో చిన్న మావయ్య ఆయనను అనుమానిస్తున్నారు అని గన్ పట్టుకుని బెదిరించింది అంతా చెబుతుంది ధరణి. 
దేవయాని: జగతి విషయంలో అనుమానించారు. ఇప్పుడు రిషి విషయంలో ఇలాగే చేస్తున్నారు. వీళ్లంతా నా కొడుకుపై పడ్డారేంటండి అని దేవయాని అంటుంది. ఏదో మీ తమ్ముడు అని ఊరుకున్నాను
ఫణీంద్ర: లేకుంటే ఏం చేసేదానివి. నాకు ఎందుకు అబద్ధం చెప్పాలని చూశావ్. ముందే నిజం చెప్పొచ్చు కదా. మహేంద్ర గన్ పట్టుకుని వచ్చాడంటే దీనికంటే ముందు మీకు చాలా చర్చలు జరిగి ఉంటాయి. ఒక చిన్న విషయానికి, అనుమానానికే గన్ పట్టుకుని రాడు కదా. అంటే నాకు తెలియకుండా చాలా జరుగుతున్నాయి
దేవయాని: వాడు పేషంట్ అయి హాస్పిటల్‌లో ఉంటే ఏం చేస్తాడండి.
ఫణీంద్ర: దానికంటే ముందే చేయొచ్చు కదా. ఏదైనా చేయాలని అనుకుంటే హాస్పిటల్‌లో ఏంటీ అండమాన్‌లో ఉన్న ప్లాన్ చేయొచ్చు 
దేవయాని: వాళ్లు ఏదో కావాలనే ఇలా చేస్తున్నారు. శైలేంద్రపై కోపంతో చేస్తున్నారు. అన్నదమ్ములు ఉన్న ఇల్లు కురుక్షేత్రమే కదా. మనసులో ఇంకేదైనా పెట్టుకున్నారేమో 
ఫణీంద్ర:  నోర్మూయ్.. మహేంద్ర, రిషి అలా ఆలోచించేవాళ్లు కాదు.  వీళ్లు అంటే అనుకుందాం. మరి ముకుల్ ఎందుకు అనుమానిస్తున్నాడు. జగతి విషయంలో వీడి వాయిస్ వచ్చింది. అది ఎలా వచ్చింది
శైలేంద్ర: ముకుల్ కంటే డాడ్ ఎక్కువ ఇన్వెస్టిగేట్ చేసేలా ఉన్నాడు. ఎస్కేప్ అవ్వాలని మనసులో అనుకున్న శైలేంద్ర కడుపు నొచ్చినట్లు నాటకం ఆడుతాడు. శైలేంద్రను దేవయాని తీసుకెళ్లుతుంది.

Also Read: రిషి మిస్సింగ్ పై క్లారిటీ వచ్చేసింది - శైలేంద్రని కన్నీళ్లతో వేడుకున్న వసుధార!

కాసేపటికీ జరిగినదంతా ఆలోచించిన శైలేంద్ర ధరణిని పిలుస్తాడు. 
శైలేంద్ర: థ్యాంక్స్ ధరణి. నువ్ నన్ను రెండు సార్లు కాపాడావు. నీకు ఏం కావాలో చెప్పు. పది నిమిషాల్లో నీ ముందు ఉంటుంది
ధరణి; డ్రామా ఆపండి. మీరు నాతో ప్రేమగా ఉన్నట్లు నటించారు. ఇంకా ఇలా మాట్లాడి ఎందుకు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తారు. మీరు లెక్కపెట్టలేనన్ని తప్పులు చేశారు 
అని ధరణి అంటుంది. అది గతం. ఇది ప్రస్తుతం. నేను మారిపోయాను. సరే రిషి విషయంలో నా గురించి ఏం అనుకుంటున్నావ్ అని శైలేంద్ర అడుగుతాడు.
ధరణి: మీరే చేశారని అనుకుంటున్నట్లుగా సైలెంట్‌గా ఉండిపోతుంది 
 ధరణి. దానికి నువ్ అనుకున్నది నిజమే. నువ్ ఏది అనుకుంటే అదే. కానీ, రిషి గురించి తెలిస్తే నాకు కచ్చితంగా చెప్పు. తల పట్టేసినట్లయింది. వెళ్లి కాఫీ తుసుకురా అని చెప్పి పంపిస్తాడు శైలేంద్ర. తర్వాత వసుధార నిన్ను ఏం చేస్తానో చూడు అని అనుకుంటాడు శైలేంద్ర.

Also Read: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: రిషిని కిడ్నాప్ చేసిన శైలేంద్ర, ఎమ్‌డి సీట్‌ వదిలేయనున్న వసుధార!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Rolls Royce: కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Embed widget