అన్వేషించండి

Guppedantha Manasu December 15th Episode:శైలేంద్రని షూట్ చేసిన మహేంద్ర, వసుధార బాధ్యత ఇకపై అనుపమదే!

Guppedantha Manasu Today Episode: శైలేంద్ర కుట్రలకు పాల్పడుతున్నాడని ఆడియో టేప్ విని రిషికి క్లారిటీ వచ్చేసింది...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Guppedantha Manasu December 15th Episode (గుప్పెడంతమనసు డిసెంబరు 15 ఎపిసోడ్)

మహేంద్ర ఓ దగ్గర నిల్చుని బాధపడుతుంటాడు..ఇంటికి వెళుతూ అనుపమ ఆగుతుంది.. ఏంటి ఇక్కడ ఉండిపోయావ్..
మహేంద్ర: శైలేంద్ర దారుణాల్ని చూస్తూ చేత‌కానివాడిలా ఉండిపోయాన‌ు. రిషిని మాకు దూరంగా చేశాడ‌ని తెలిసిన రోజే వాడిని చంపి ఉండాల్సింది. మేము వేసే ఎత్తుకు పై ఎత్తు వేసి మాదే త‌ప్పు అని నిరూపిస్తున్నాడ‌ు. రాక్ష‌సుడిలా రోజురోజుకు వాడి ప్ర‌వ‌ర్త‌న మితిమీరిపోతుంది. నాప్రాణానికి ప్రాణ‌మైన జ‌గ‌తిని చంపేసిన శైలేంద్ర‌ను సాక్ష్యాల‌తో రిషి ముందు నిల‌బెట్టాల‌ని అనుకున్నాన‌ు కానీ త‌న ఆశ ఫ‌లించేలా లేద‌ు. రిషికి ఏమైనా  అయితే నేను త‌ట్టుకోలేన‌ు. 
అనుపమ: రిషికి ఏం కాద‌ు ధైర్యంగా ఉండ‌ు..నువ్వు అధైర్య ప‌డితే వ‌సుధార‌ ఏమవుతుంది...
మహేంద్ర: వ‌సుధార‌ను కంటికి రెప్ప‌లా చూసుకుంటావా..త‌న బాధ్య‌త నువ్వు తీసుకోవాలి
అనుపమ: మామ‌య్య‌వు నువ్వు ఉండ‌గా త‌న బాధ్య‌త నాకు ఎందుకు అప్ప‌గిస్తున్నావు..మ‌హేంద్ర మాట‌లు కొత్త‌గా ఉండ‌టంతో అనుప‌మ కంగారు ప‌డుతుంది.
మహేంద్ర: నేను మంచి వాడానా చెడ్డవాడినా..నేను చేసేఏ  పనికైనా నీ సపోర్ట్ ఉంటుందా
అనుపమ: నువ్వు ఏదైనా పిచ్చి ప‌ని చేయ‌బోతున్నావా . 
మహేంద్ర: జ‌రిగేది, జ‌ర‌గ‌బోయేది చూస్తూ ఉండ‌టం త‌ప్పితే నేను ఏం చేయ‌లేన‌ు. నువ్వు నాకు స‌పోర్ట్ చేసినా చేయ‌క‌పోయినా వ‌సుధార‌కు మాత్రం అండ‌గా ఉండాల‌ి
అనుపమ: నువ్వేంటి కొత్త గా ప్రవర్తిస్తున్నావ్..ఏదో దాస్తున్నావ్...రిషిపై బెంగ‌తో ఆవేశంలో ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకోవ‌ద్ద‌ు. 
అలా ఏం ఉండదు అని మహేంద్ర చెప్పిన తర్వాత..అక్కడి నుంచి అనుపమ వెళుతుంటుంది...వసుధార జాగ్రత్త అని మళ్లీ చెబుతాడు..
అనుపమ అక్కడి నుంచి వెళ్లిపోతుంది... మహేంద్ర..ఆలోచనలో పడతాడు

Also Read: రిషి మిస్సింగ్ పై క్లారిటీ వచ్చేసింది - శైలేంద్రని కన్నీళ్లతో వేడుకున్న వసుధార!

ఎండీ సీట్‌  నాకు అప్పగించాలనే కండిషన్ కు వ‌సుధార త‌ప్ప‌కుండా ఒప్పుకుంటుంది..ఇక ఇంట్లోనూ, కాలేజీలోనూ నేను ఆడిందే ఆట పాడిందే పాట అని సంతోషంగా ఉంటాడు... ధరణి కాఫీ తీసుకురా అని గట్టిగా అరుస్తాడు...ఇంతలో మహేంద్ర వస్తాడు...
శైలేంద్ర: డాడ్ ఇంట్లో లేరుకదా  మీరెందుకొచ్చార‌ు..కాఫీ కావాలా టీ కావాలా అని అడుగుతాడు
మహేంద్ర: ప్రేమ నటించకు నీకు సెట్ కాదు
శైలేంద్ర: మ‌హేంద్ర కోపం చూసి వ‌సుధార మొత్తం చెప్పేసింద‌ని శైలేంద్ర భ‌య‌ప‌తాడు. ధ‌ర‌ణిని పిలుస్తాడు. 
శైలేంద్ర రూమ్ నుంచి వెళ్లిపోకుండా రూమ్ డోర్ క్లోజ్ చేస్తాడు మ‌హేంద్ర‌. రిషి గురించి అడిగితే తెలియదని తప్పించుకోవాలని ప్రయత్నిస్తాడు. ఆవేశంతో శైలేంద్ర చెంపపై కొడతాడు..
శైలేంద్ర: ఏ అధికారంతో కొడుతున్నారు..మర్యాదగా ఉండదు..
మహేంద్ర: నీకు నాకు బంధం, మ‌ర్యాద ఎప్పుడో మ‌ట్టిలో క‌లిసిపోయాయి. నీలాంటి వాడికి మ‌ర్యాద ఇవ్వ‌డ‌మే త‌ప్పు అంటూ మ‌రో దెబ్బ కొడ‌తాడు . అప్పటికీ శైలేంద్ర నోరు విప్పకపోవడంతో మహేంద్ర గన్ తీసి బెదిరిస్తాడు
మహేంద్ర తనను ఏం చేస్తాడో భయపడి దేవయాని, ధరణిని పిలుస్తాడు...బాబాయ్ తనని చంపేస్తున్నాడని కేకలేస్తాడు.. దేవయాని కంగారుగా రూమ్ దగ్గరకు వస్తుంది కానీ డోర్ మూసి ఉండడం చూసి తన కొడుకుని వదిలేయమని అడుగుతుంది...
మహేంద్ర: నీకు ఎండీసీట్‌ను అప్ప‌గించి రిషిని తీసుకెళ్ల‌మ‌ని వ‌సుధార‌ని బెదిరిస్తావా . నువ్వు ఇంట్లో అడుగుపెట్టిన‌ప్ప‌టి నుంచే ఇంటికి శ‌ని దాప‌రించింది.  నీ నిజ‌స్వ‌రూపం తెలిసిన రోజే చంపేయాల్సింది. కానీ అన్న‌య్య ముఖం చూసి వ‌దిలేసి త‌ప్పుచేశాన‌ు. ప‌ద‌వి కోసం త‌ప్పుల మీద త‌ప్పులు చేస్తున్నావు. 
దేవయాని: నా ‌కొడుకు మారిపోయాడ‌ు 
మహేంద్ర: మీ మాట‌లు న‌మ్మ‌న‌ు మీరిద్ద‌రు మారిపోయారంటే సృష్టి అల్ల‌క‌ల్లోలం అవుతుంది. జ‌గ‌తిని త‌న‌కు ఇర‌వై ఏళ్లు మీ అమ్మ దూరం చేసింద‌ని, నువ్వు నాకు శాశ్వ‌తంగా దూరం చేశావ‌ని గ‌న్‌ను శైలేంద్రకు మ‌రింత ద‌గ్గ‌ర‌గా గురిపెడ‌గాడు మ‌హేంద్ర‌. 
త‌న కొడుకును కాపాడ‌మ‌ని ధ‌ర‌ణిని బ‌తిమిలాడుతుంది దేవ‌యాని. 
ధరణి -దేవయాని: రిషి ఎక్క‌డున్నాడో చెబితే శైలేంద్ర‌ను ఏం చేయ‌కుండా మ‌హేంద్ర‌ను అడ్డుకుంటానంటుంది ధరణి..రిషిని ఎక్క‌డున్నాడో శైలేంద్ర‌కు తెలియ‌ద‌ని ధ‌ర‌ణికి బ‌దులిస్తుంది దేవ‌యాని. రిషి ఎక్క‌డున్నాడో మీ కొడుకుకు తెలియ‌క‌పోతే మీకు తెలుసా అంటూ దేవ‌యానికి షాకిస్తుంది ధ‌ర‌ణి. నాకు తెలియ‌ద‌ని దేవ‌యాని త‌డ‌బ‌డుతూ స‌మాధానం చెబుతుంది. అయితే ఈ విష‌యంలో నేను ఏం చేయ‌లేను అనేస్తుంది ధరణి..

Also Read: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: రిషిని కిడ్నాప్ చేసిన శైలేంద్ర, ఎమ్‌డి సీట్‌ వదిలేయనున్న వసుధార!

దేవయాని: శైలేంద్ర నీ భ‌ర్త , మ‌హేంద్ర తనని చంపితే నీ ప‌సుపుకుంకుమ‌లు పోతాయి..మ‌హేంద్ర జైలుకు వెళ‌తాడ‌ు వ‌సుధార ఒంట‌రిదైపోతుంద‌ని సెంటిమెంట్ డైలాగ్స్‌ కొడుతుంది. ఆలోచనలో పడిన ధ‌ర‌ణి మ‌హేంద్ర నిజంగానే జైలుకు వెళ‌తాడ‌ని కంగారుప‌డుతుంది. శైలేంద్ర‌ను చంపొద్ద‌ని అంటుంది. 
మహేంద్ర: రిషి ఎక్క‌డున్నాడో చెప్ప‌మ‌ని శైలేంద్ర‌కు చివ‌రి అవ‌కాశం ఇస్తాడు . ఈ సారి చెప్ప‌క‌పోతే షూట్ చేసి తీరుతా అంటాడు. వ‌సుధార చెబితేనే మ‌హేంద్ర వింటాడ‌ని ఆమెకు ఫోన్ చేసి జ‌రుగుతున్న విష‌యం చెబుతుంది. ధ‌ర‌ణి మాట‌లు విని కంగారుగా మ‌హేంద్ర‌కు ఫోన్ చేస్తుంది. శైలేంద్ర‌ను చంపోద్ద‌ని మ‌హేంద్ర‌కు చెబుతుంది. వ‌సుధార మాట‌ల‌ను మ‌హేంద్ర విన‌డు. శైలేంద్ర‌ను చంపిన త‌ర్వాతే ఇక్క‌డి నుంచి క‌దులుతాన‌ని, శైలేంద్ర‌ను కాల్చిప‌డేస్తేనే అంద‌రి జీవితాలు బాగుప‌డ‌తాయ‌ని, ఈ విష‌యంలో ఎవ‌రి మాట వినేది లేద‌ని ఫోన్ క‌ట్ చేస్తాడు.
శైలేంద్ర: రిషి క‌నిపించ‌కుండాపోవ‌డానికి త‌న‌కు ఏ సంబంధం లేద‌ని, ఆ టైమ్‌లో తాను హాస్పిట‌ల్‌లో ఉన్నాన‌ని మ‌హేంద్ర‌ను బ‌తిమిలాడుతాడు. నీ వ‌ల్ల, నువ్వు చేసిన పాపాల తాను క్ష‌ణ‌క్ష‌ణం న‌ర‌కం అనుభ‌విస్తున్నాన‌ని, జ‌గ‌తిని చంని నా జీవితాన్ని శూన్యం చేశావు. ఇప్పుడు రిషిని మాయం చేశాన‌ని శైలేంద్ర‌పై సీరియ‌స్ అవుతాడు మ‌హేంద్ర‌. రిషి ఎక్క‌డున్నాడో చెప్ప‌క‌పోయినా నిన్ను మాత్రం క్ష‌మించ‌న‌ని, చంపి తీరుతాన‌ని అంటాడు. నా చేతిలో నీ ప్రాణాలు పోవాల‌ని దేవుడు రాసిపెట్టాడ‌ని శైలేంద్ర‌పై షూట్ చేయ‌డానికి గ‌న్ గురిపెడ‌తాడు. 
తెలివిగా గ‌న్‌ను కింద‌ప‌డేసి రూమ్ నుంచి పారిపోతాడు శైలేంద్ర‌. అయినా శైలేంద్ర‌ను ప‌ట్టుకున్న మ‌హేంద్ర షూట్ చేస్తాడు గ‌న్ సౌండ్‌కు దేవ‌యాని, ధ‌ర‌ణి భ‌య‌ప‌డిపోతారు.
ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది....

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Allu Arjun: వీడు పెద్దైతే ఎలా ఉంటాడో అని భయపడ్డాం... అల్లు అర్జున్ మదర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
వీడు పెద్దైతే ఎలా ఉంటాడో అని భయపడ్డాం... అల్లు అర్జున్ మదర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Sai Durga Tej : 'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desamఆర్టీసీ బస్సులో పంచారామాలు, ఒక్క రోజులో వెయ్యి కిలో మీటర్లుPamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Allu Arjun: వీడు పెద్దైతే ఎలా ఉంటాడో అని భయపడ్డాం... అల్లు అర్జున్ మదర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
వీడు పెద్దైతే ఎలా ఉంటాడో అని భయపడ్డాం... అల్లు అర్జున్ మదర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Sai Durga Tej : 'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
Meenaakshi Chaudhary : 'మట్కా'తో మీనాక్షి చౌదరిపై మళ్లీ అదే ట్యాగ్ పడిందా .. అయినా అమ్మడు చాలా బిజీ!
'మట్కా'తో మీనాక్షి చౌదరిపై మళ్లీ అదే ట్యాగ్ పడిందా .. అయినా అమ్మడు చాలా బిజీ!
Digital Real Estate: 'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!
'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!
Srikakulam Politics: సిక్కోలు పార్టీ ప్రక్షాళనపై జగన్ దృష్టి - తమ్మినేని సీతారామ్ అవుట్ - నెక్ట్స్ ఎవరో ?
సిక్కోలు పార్టీ ప్రక్షాళనపై జగన్ దృష్టి - తమ్మినేని సీతారామ్ అవుట్ - నెక్ట్స్ ఎవరో ?
Embed widget