(Source: ECI/ABP News/ABP Majha)
Guppedantha Manasu ఆగస్టు 29ఎపిసోడ్: పరధ్యానంలో రిషి - రిషి ధ్యానంలో వసు, ప్రేమ పిచ్చి ముదిరింది!
Guppedantha Manasu August 29 Episode 541: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఎట్టకేలకు రిషి- వసుధార క్కటయ్యారు
గుప్పెడంతమనసు ఆగస్టు 29 సోమవారం ఎపిసోడ్ (Guppedantha Manasu August 29 Episode 541)
రిషి నిద్రపోతుండగా..మహేంద్ర, గౌతమ్ ఇద్దరూ చెరోవైపు కూర్చుంటారు. నిద్రలేచి ఉలిక్కిపడిన రిషి..ఏంటిది మీరు కూడా ఇదే గదిలో నిద్రపోయారా అని అడుగుతాడు. నువ్వెప్పుడు లేస్తావా అని వెయిటింగ్ అంటాడు గౌతమ్.. నిన్న నువ్వు వసుధారని కలిశావ్ కదా ఏదైనా సయోధ్య కుదిరిందా అని అడుగుతాడు మహేంద్ర..
గౌతమ్: అరెయ్..వసుధారతో నీకు అండర్ స్టాండింగ్ అయిందా లేదా
రిషి: అయింది..
ఎస్..ఎస్ అంటూ మహేంద్ర, గౌతమ్ ఇద్దరూ మురిసిపోతారు.. రిషి స్వీట్ బాయ్ అంటూ ఇద్దరూ పొగిడేస్తారు..
మహేంద్ర: మనం ఇంతకన్నా ఎక్కువ అడిగితే బాగోదు..వసుధార చెప్పిందానికి నువ్వు ఏకీభవించావా...
రిషి: నేను చెప్పిందానికే వసుధార ఓకే అంది..
గౌతమ్: ఏం జరిగిందో కొంచెం పేపర్ లీక్ చేయి..
వసు ఐ లవ్ యూ చెప్పడం..పరీక్షలు అయ్యేవరకూ కలవకూడదు అనుకున్న విషయాలు గుర్తుచేసుకుని మురిసిపోతాడు రిషి.
రిషి: వసుధార డీబీఎస్టీ కాలేజీకి దొరికిన వజ్రం..తనని ఎలా వదిలిపెడతాను..అందుకే వసుకి అర్థమయ్యేలా చెప్పాను.. నా స్టైల్లో
మహేంద్ర: అదే ఏం చెప్పావు...
రిషి: వసుధారకి ఓ లక్ష్యం ఉంది..దానిని సక్సెస్ చేసుకోమని చెప్పాను.. జీవితంలో ఈ పరీక్షలు ముఖ్యం కష్టపడమని చెప్పాను. పరీక్షలు అయ్యేవరకూ ఎలాంటి డిస్ట్రబెన్స్ లేకుండా ఉండమని చెప్పాను..
గౌతమ్: ఇదేనా చెప్పావ్..
మహేంద్ర: పరీక్షలు, చదువు తప్ప ఇంకా ఏం చెప్పలేదా..
రిషి: ఇంకేం చెబుతాను డాడ్..జీవితంలో గొప్ప ఆనందం ఏంటో తెలుసా..మనం విజయం సాధించడం కాదు మన అనుకున్న విజయం సాధించడం...
గౌతమ్: బై అంకుల్ అనేసి వెళ్లిపోతాడు గౌతమ్..
మహేంద్ర: నువ్వు చాలా గొప్పగా ఆలోచించావ్ కానీ మేమే చాలా ఎక్కువ ఆలోచించాం..
రిషి: మీరు ఏం ఊహించారో నాకు తెలుసు డాడ్..కానీ వసుధార ఓ వజ్రం..తనని సానబెట్టాలి..తన గెలుపు చూసి మనం సంతోషించాలి
మహేంద్ర: నువ్వు గ్రేట్ రా..లవ్ యూ...అనేసి వెళ్లిపోతాడు..
వసుధారా నువ్వు గెలవాలి అనుకుంటాడు...
Also Read: కార్తీక్ కి దీప గతం గుర్తొచ్చేలా చేయగలదా, మోనితపై సౌందర్యలో మొదలైన అనుమానం!
వసుధార, పుష్ప నడిచి వెళుతుంటారు. రిషి చెప్పిన మాటలు తల్చుకుంటుంది వసుధార..
పుష్ప: ఏంటి వసు అలా ఉన్నావ్...ఫైనల్ ఎగ్జామ్స్ వస్తున్నాయ్ కదా చాలా సలహాలు చెబుతావ్ అనుకున్నాను.. నువ్వేం మాట్లాడవేంటి
వసు: బుద్ధిగా చదివితే మార్కులొస్తాయి..లేదంటే లేదు.. ఎగ్జామ్స్ తర్వాత కాలేజీకి రాము, ఎవరికి వాళ్లే విడిపోతాం.. మళ్లీ ఎవ్వర్నీ కలవం కదా..
పుష్ప: ఎగ్జామ్స్ వస్తే..నువ్వు నాకు చాలా చెబుతావ్ అనుకున్నాను..నువ్వేంటి వింతగా మాట్లాడుతున్నావ్..అసలేమైంది..
ఇంతలో అక్కడ రిషిని చూసి అలా నిల్చుండిపోతుంది వసుధార...వసుని చూస్తూ నిల్చుంటుంది పుష్ప.. అటు రిషి కూడా వసుని చూస్తాడు. వసుధార పరిగెత్తుకు వస్తుంది...ఏంటి సార్ ఇక్కడున్నారు..నాకోసమే వెయిటింగా అని అడిగి రిషి చేయందుకుని నాకు ఆల్ ద బెస్ట్ చెప్పండి సార్ అని అడుగుతుంది( ఇదంతా వసుధార ఊహ).రిషి అనుకుని పుష్ప చేసి పట్టుకుంటుంది... వసుధార ఏమైందని పుష్ప అడగడంతో ఉలిక్కిపడుతుంది..
మనం ఒకటనుకుంటాం..అది ఇంకొకటి అనుకుంటుంది పుష్ప అంటుంది
పుష్ప: ఏంటి వసుధారా ఇలా మాట్లాడుతున్నావ్... వసుకి ఈ రోజు ఏమైంది..
వసుధారతో మాట్లాడాలని ఉంది కానీ నేను ఏమీ మాట్లాడలేకపోతున్నానని రిషి... మాట్లాడితే మీ సొమ్మేం పోతుందని వసుధార అనుకుంటారు... ఇద్దరు మనసులోనే మాట్లాడుకుంటారు...మనసులో భావాలు మాటల రూపంలో చెబితే ఎంత బావుంటుందో ఇప్పుడే తెలుస్తోంది అనుకుంటాడు.
నువ్వేదో పరధ్యానంలో ఉన్నావని పుష్ప అంటే..పరధ్యానం కాదు సార్ ధ్యానం అనుకుంటుంది...
ఇక రిషి మాట్లాడకుండా ఉండలేక..మెసేజ్ చేస్తాడు.. క్యాబ్ బుక్ చేశానని... క్యాబ్ వస్తుంది.. వసు, పుష్ప వెళ్లిపోతారు.
Also Read: ప్రేమ ఊహల్లో విహరిస్తోన్న రిషిధార- ఏం జరిగిందో తెలుసుకునేందుకు మహేంద్ర, గౌతమ్ తిప్పలు
రిషి,గౌతమ్ మహేంద్ర హల్ లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతట్లో జగతి పుస్తకాలు తీసుకుని కిందకు వస్తుంది. మేడం ఎక్కడికి వెళుతున్నారని గౌతమ్ ని అడగుతాడు రిషి. వసుధారకి ఇంపార్టెంట్ నోట్స్ ప్రిపేర్ చేశాను ఇవ్వడానికి వెళుతున్నా అంటుంది జగతి. నువ్వెళ్లు గౌతమ్ అని మహేంద్ర అంటే..నేను వెళతానులే నువ్వు కూర్చో అంటాడు రిషి. బయటకు వెళుతూ...పరీక్షలు అయ్యేవరకూ మనం కలవకూడదనుకున్న విషయం గుర్తుచేసుకుని గౌతమ్ నువ్వెళ్లు అంటాడు. ఇంతలో మళ్లీ ఏమైందని అడుగుతారంతా...
అటు వసుధార చదువుతూనే రిషి గురించి ఆలోచిస్తుంది. ఇంతలో కారు సౌండ్ వినిపించడంతో రిషి వచ్చాడనుకుని డోర్ తీస్తుంది. రిషిసార్ రాలేదా అని అడుగుతుంది. మేం వచ్చాం కదా..ఈ సమయంలో నువ్వు ఇలాంటివేం పెట్టుకోవద్దు కేవలం చదువు మాత్రమే ఉండాలి అని అంటుంది జగతి. గౌతమ్ కూడా బాగా చదువుకో వసుధారా మీ మీదే అందరం ఆశలు పెట్టుకున్నాం అంటాడు.
రిషికి వసు కాఫీ ఇస్తున్నట్టు రిషి ఊహించుకుంటాడు. నువ్వు కాఫీ తెచ్చావేంటి వసుధార అంటే ఏం మాట్లాడుతున్నావ్ రా నేను వసుధార ను కాదు...మనసు ఎక్కడ పెట్టుకున్నావో అని అడుగుతాడు. అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి. అటు వసు కూడా రిషిని పక్కనే ఉన్నట్టు ఊహించుకుంటూ ఉంటుంది. ఎందుకు రిషి సార్ నాకు ఇలా గుర్తొస్తున్నారు అని అనుకుంటుంది.ఆ తర్వాత రిషి మెట్ల నుంచి కిందకు దిగుతున్నప్పుడు సోఫాలో వసుధార కూర్చొని ఉంటుంది. మీకోసమే ఎదురుచూస్తున్నాను సార్ అని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగిసింది...