ఈ ఏడాది వినాయక చవితి ఆగస్టు 31 బుధవారం
ఈ రోజు పూజ ఏ సమయంలో చేయాలంటే!



శ్లోకం
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే!



ఏటా వినాయక చవితి భాద్రపద మాసం శుక్లపక్షంలో నాలుగో తిథి అయిన చవితి రోజు వస్తుంది.



ఆగస్టు 30 మంగళవారం మధ్యాహ్నం దాదాపు 2 గంటల 29 నిముషాలకు చవితి ఘడియలు ప్రారంభమయ్యాయి



ఆగస్టు 31 బుధవారం మధ్యాహ్నం 2 గంటలవరకూ చవితి ఉంది..తదుపతి పంచమి ప్రారంభమవుతుంది



సాధారణంగా సూర్యోదయమే లెక్క కాబట్టి..వినాయకచవితి ఎప్పుడు జరుపుకోవాలన్నది ఎలాంటి సందేహం లేదు.



ఆగస్టు 31 బుధవారం రోజు వర్జ్యం ఉదయం 7.55 నుంచి 9.31 వరకు ఉంది . ఇదే రోజు దుర్ముహూర్త కూడా ఉదయం 11.35 నుంచి 12.23 వరకు ఉంది



బుధవారం వినాయకపూజ చేసేవారు వర్జ్యం,దుర్ముహూర్తం ఘడియలు లేకుండా చూసుకోవాలి.



ఉదయం 7.55 లోపు లేదంటే... తొమ్మిదిన్నర దాటిన తర్వాత పూజ చేసుకోవడం మంచిది



మళ్లీ పదకొండున్నర నుంచి పన్నెండున్నర మధ్య కూడా ( దుర్ముహూర్తం సమయం) పూజ ప్రారంభించవద్దు



మీరు పూజ ప్రారంభించిన తర్వాత వర్జ్యం, దుర్ముహూర్తం ఉన్నా పర్వాలేదు...ప్రారంభసమయమే పరిగణలోకి తీసుకోవాలి.



(Images Credit: Pinterest)