చాణక్య నీతి: సక్సెస్ అవ్వాలంటే ఈ మూడింటికి దూరంగా ఉండాలి



జీవితంలో ఉన్నత స్థానంలో ఉండాలని, గౌరవప్రదమైన జీవితం గడపాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. ఇది సాధ్యం అవ్వాలంటే ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలి.



ఆచార్య చాణక్య ప్రకారం ఓ వ్యక్తి విజయానికి యవ్వనంలోనే పునాది పడుతుంది. ఆ సమయంలో మంచి నడవడిక, కష్టపడే తత్వం, నిజాయితీని అలవరుచుకుంటే జీవితంలో అనుకున్నది సాధించగలుగుతారు.



ఒక మనిషి తన జీవితంలో లేదా కెరీర్‌లో విజయం సాధించాలంటే మూడింటికి దూరంగా ఉండాలన్నాడు చాణక్యుడు.



1.వ్యసనం
వ్యసనం మనిషిని ఎంత పాళాతానికైనా తొక్కేస్తుంది. మందు, మత్తుపదార్థాలు, జూదం, అక్రమ సంబంధం..ఏదైనా వ్యసనమే. ఈ వ్యసనం మనిషిని మానసికంగా, శారీరకంగా దెబ్బతీస్తుంది.



వ్యసనం కారణంగా కెరీర్ పై దృష్టి సారించలేరు. అనుకున్న పనుల్లో విజయం సాధించకపోగా అపకీర్తి, అవమానం వెంటాడుతుంది. అందుకే వ్యసనాలను త్యజిస్తేనే జీవితంలో సక్సెస్ అవుతారు.



2.సోమరితనం
సోమరితనం ఎంత మనిషిని అయినా ముంచేస్తుంది. ఎంత ప్రతిభ ఉన్నా సోమరితనం దాన్ని మరుగున పడేస్తుంది. ముఖ్యంగా కష్టపడాల్సిన వయసులో సోమరితనాన్ని జయించకపోతే కోల్పోయిన క్షణాలను మళ్లీ తిరిగి తెచ్చుకోలేరు.



3.చెడు సహవాసాలు
నువ్వు బాగుపడతావో, చెడిపోతావో నీ చుట్టూ ఉన్న స్నేహితులను చూస్తే చెప్పేయొచ్చంటాడు చాణక్యుడు.



చెడు సహవాసాలు దారి తప్పేలా చేస్తాయి..లక్ష్యం నుంచి దూరం జరిగేలా చేస్తాయి. మీ విలువైన సమయాన్ని వృధా చేస్తాయి.



ఎంతదూరమైనా వెళ్లి మంచి సంపాదించాలి..అంటిపెట్టుకుని ఉన్న చెడుని విడిచిపెట్టాలంటాడు చాణక్యుడు.



వ్యసనం, సోమరితనం, చెడు సహవాసాలు వదిలేస్తేనే లైఫ్ లో బాగా సక్సెస్ అవుతారన్నతి చాణక్య నీతి.