అన్వేషించండి

'గుప్పెడంతమనసు' ఆగస్టు 26 ఎపిసోడ్ : మెల్లగా కరిగిన రెండు మనస్సుల దూరం, పంచభూతాల సాక్షిగా ఒక్కటైన రిషిధార!

Guppedantha Manasu August 26 Episode 539: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఎట్టకేలకు వసుధార తన మనసులో మాట రిషికి చెప్పేసింది...

గుప్పెడంతమనసు ఆగస్టు 26 శుక్రవారం ఎపిసోడ్ (Guppedantha Manasu August 26 Episode 539)

నన్ను క్షమించండి..నా ప్రేమను అంగీకరించండి అంటూ రిషికి ఐ లవ్ యూ చెప్పి ఆ గిఫ్ట్ చేతికందిస్తుంది వసుధార.  ఈ మాటను తక్కువ పదాల్లో చెప్పడం నాకు నచ్చలేదు కానీ చెప్పకుండా ఇంకా ఎక్కువ సేపు ఉండలేను..ఈ రోజు కాకపోతే ఇంకెప్పుడూ చెప్పలేనేమో..ఈ మాట చెప్పాక నేను మళ్లీ కొత్తగా పుట్టాను అనిపిస్తోందన్న వసుధార మరోసారి ఐ లవ్ యూ అంటుంది. అప్పటికీ అయోమయంలో ఉన్న రిషి..వెనక్కు తిరిగి నువ్వు నువ్వేనా అని అడుగుతాడు..
వసు: నేను నేను కాదు సార్..నేను వసుధార నుంచి రిషిధారనయ్యాను..మీరు నా నీడ..నేను మీ నిజం సార్ అని గిఫ్ట్ చేతిలో పెడుతుంది..
రిషి: సంతోషంగా తీసుకున్న రిషి..ఇప్పటినుంచి ఈ బొమ్మని నిన్ను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది అంటాడు. 

మహేంద్ర కంగారుపడుతుంటాడు.. ఇందాక అమ్మవారితో వసు మాట్లాడిన మాటలు చూస్తే ఈరోజు తన మనసులో మాట రిషికి చెప్పేస్తుంది అనుకుంటున్నాను. అలా జరిగితే మంచిదే ఒకవేళ అలా జరగకపోతే పరీక్షల తర్వాత వీళ్ళకి ఇంక కలవడానికి అవకాశం ఉండదు. ఇంక వాళ్ళు ఒకటి అవ్వడానికి అవకాశం ఉండదు.వీళ్ళు కలిసి ఉంటే బాగుండును అంటాడు
జగతి: రిషి తన మనసులో మాట చెప్పలేనంతవరకు మనం ఇబ్బంది పడ్డాం. తీరా తన మనసులో మాట చెప్పేసరికి వసు ఎందుకు వద్దన్నాదో కూడా తెలియడం లేదు. చాలాసార్లు అడిగినా సరే చెప్పలేదు.ఇంక తన వ్యక్తిత్వాన్ని ప్రశ్నించడం నాకు నచ్చదు అని చెప్పి వదిలేసా.అయినా వాళ్ళిద్దరి పర్సనల్స్ లోని మనం దూరడం మంచిది కాదు 
మహేంద్ర: వాళ్ళిద్దరి వ్యక్తిగత జీవితంలోకి మనం ఇన్వాల్వ్ అవడం మంచిది కాదుకానీ  వాళ్ళ మంచి కోసమే కదా వాళ్ళు కలిసి ఉండడం కోసమే అని అంటాడు

Also Read: కార్తీక్ కి మోనిత గోరుముద్దలు, నువ్వు నా భార్యని కాదంటూ దీపని గుర్తుచేసుకున్న డాక్టర్ బాబు!

వర్షం పెరగడంతో ఓ షెడ్డుకింద నిల్చుంటారు వసుధార,రిషి...
వసు: నేను జీవితంలో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూశాను.కానీ మీతో సాగే ఈ ప్రయాణం నాకు ఆనందాన్ని ఇస్తుంది అని అనుకుంటుంది. 
రిషి: ఈ రోజు నుంచి మనిద్దరి మధ్య జ్ఞాపకాలు తప్ప దాపరికాలు ఉండకూడదు అనుకుంటున్నా...
వసు: ఉండవు సార్..మాటిస్తున్నాను
రిషి: ఆరోజు నువ్వు నన్ను కాదనడానికి ఎవరి నిన్ను బెదిరించారు? దాపరికాలు లేని ప్రేమ ఎప్పటికీ నిలబడుతుంది అంటారు..
వసు: సాక్షి..
రిషి: ఊహించాను కానీ..నువ్వు నేను ఒక్కటైన ఈ రోజుకి సాక్ష్యం  ఈ వర్షమే. మేఘాలు కరుగుతాయి, వర్షం కురుస్తుంది కానీ మనం మేఘాల్లా కరిగి వర్షంలా కురవొద్దు..ఆకాశంలా ఎప్పటికీ నిలిచిపోవాలి...ఎప్పటికీ నిలిచిపోదాం...ఎప్పటికీ ఒక్కటిగా ఉండిపోదాం. ఎప్పటికీ ఆగిపోని ప్రేమధారలా రిషిధారలా నిలిచిపోవాలంటూ వీఆర్ అని ఉన్న ఉంగరం వసు వేలికి తొడిగేందుకు సిద్ధమవుతాడు... వేలి వరకూ వెళ్లిన ఉంగరాన్ని వెనక్కు తీసుకుంటాడు..ఈ ఉంగరాన్ని నీ వేలికి తొడగాలంటే, ఒకరికి ఒకరుగా మిగలాలంటే ఓ పని చేయాలి...ఓ ప్రేమ గెలవాలంటే మనం ఓపని చేయాలి...ముఖ్యంగా నువ్వు త్యాగం చేయాలి..నీ ప్రేమని త్యాగం చేయాలి..
వసు: ఊహించని రిషి మాటలు విని..ఏం మాట్లాడుతున్నారు మీరు..ప్రేమను దక్కించుకోవడం కోసం నా ప్రేమని త్యాగం చేసి ప్రేమని పోగట్టుకోవాలా..అంతకన్నా ప్రాణం అడగండి వెంటనే ఇచేస్తాను
రిషి: నీ ప్రేమని పోగొట్టుకో అనడం లేదు..నీఆశయం కోసం కొన్నాళ్లు ప్రేమకి దూరంగా ఉండమంటున్నాను. ఎన్నో సార్లు అన్నావ్.. జీవితంలో అన్నిటికన్నా గొప్పది ఆశయం అని..నీ ఆశయం గోల్డ్ మెడల్..నీ లక్ష్యం యూనివర్శిటీ టాపర్.. నీ దృష్టంతా రాబోయే పరీక్షలపై ఉండాలి..ప్రేమమీద కాదు..అందుకే నీ పరీక్షలు అయ్యేవరకూ మనం కలవకూడదు, మాట్లాడకూడదు
వసు: మిమ్మల్ని చూడకుండా మీతో మాట్లాడకుండా ఎలా..నావల్ల కాదు సార్
రిషి: కావాలి వసుధారా..ఆశయం కోసం కుటుంబాన్ని వదిలేసి పెళ్లిపీటలపై నుంచి వచ్చావ్..అది మర్చిపోవద్దు..మన ప్రేమ నీ ఆశయాన్ని మార్చింది..నువ్వు అదంతా మర్చిపోయేలా చేసింది..అంటే అది మన ప్రేమకి అవమానం..
వసు: సార్..ఆ రింగ్ నాది..నా జీవితం..ఆ ఆనందం నాకు కావాలి..యూనివర్శిటీ టాపర్ స్థానం కన్నా ఈ రింగ్ మీతో తొడిగించుకోవడం చాలా గొప్ప..నేను ఆ అదృష్టాన్ని పోగొట్టుకోలేను..మీరన్నట్టే చేస్తాను కానీ మీరు నాకు మాటివ్వాలి. ఇది ఎప్పటికీ నాదే కదా..
రిషి: ఈ రిషీంద్ర భూషణ్ నీకు మాటిస్తున్నాడు..పంచభూతాల సాక్షిగా ఇది ఎప్పటికీ నీదే..కానీ నీ ఆశయం చదువు...నువ్వు నాకు మాటివ్వు..నేను చెప్పినట్టు నీ దృష్టంతా చదువుమీదే పెట్టు 
వసు: రిషి చేతిలో రింగ్ తీసుకుని తిరిగి చేతిలో పెట్టిన వసుధార..మీకోసం, మన ప్రేమ కోసం , నా ఆశయం కోసం మీ మాట వింటాను..మీరు చెప్పినట్టే పరీక్షలు పూర్తయ్యేవరకూ ప్రేమకోసం ఆలోచించను..ప్రామిస్..ఇంతలో మెరుపు రావడంతో ఉలిక్కిపడి రిషిని హగ్ చేసుకుంటుంది. 
రిషి: నింగి,నేల,వాన,గాలి,నిప్పు..అన్నీ మనచుట్టే ఉన్నాయి. ఓ మాట చెబుతున్నా..ఈ రాత్రి సాక్షిగా ఈ క్షణం నుంచి మన ప్రేమ కథమొదలు..ఇది మామూలు కథ కాదు.. ఒకరినొకరు తెలుసుకుని, కలుసుకున్న సమయం..ఇది జ్ఞాపకం కాదు..శాశ్వతం...ఆ తర్వాత ఇద్దరూ కార్లో బయలుదేరుతారు.. ఈ ప్రయాణంలో ఏదో కొత్తదనం ఎంత హాయిగా ఉందో కదా..ఎప్పుడూ ఇలా విశ్లేషించడం నీకు అలవాటు కదా అంటాడు..
ఎపిసోడ్ ముగిసింది...

Also Read:  తరగతి గది దాటి తరలిన కథ , ఐ లవ్ యూ రిషి సార్ నన్ను క్షమించండి నా ప్రేమని అంగీకరించండని చెప్పేసిన వసు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget