News
News
X

కార్తీకదీపం ఆగస్టు 26 ఎపిసోడ్: కార్తీక్ కి మోనిత గోరుముద్దలు, నువ్వు నా భార్యని కాదంటూ దీపని గుర్తుచేసుకున్న డాక్టర్ బాబు!

Karthika Deepam August 26 Episode 1441: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ ని హాస్పిటల్ నుంచి తీసుకెళ్లిపోయింది మోనిత అని క్లారిటీ వచ్చింది.

FOLLOW US: 

కార్తీకదీపం ఆగస్టు 26 శుక్రవారం ఎపిసోడ్ (Karthika Deepam August 26 Episode 1441)

మోనిత గురించి డాక్టర్ అమ్మకి చెప్పి బాధపడుతుంది దీప. దాని గురించి మీ ఆయనకు తెలిసిపోయింది కదా అది ఏం చేసినా నీ మొగుడ్ని నీ నుంచి మాత్రం తీసుకోలేదు అది నిజం కదా..ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది మోనిత గురించి కాదు.. నీ భర్త గురించి అని క్లారిటీ ఇస్తుంది. నీ భర్తే అయితే ఆయన్ను తీసుకెళ్లింది ఎవరు...ఈ విషయాలపై దృష్టి పెడితే సమస్య పరిష్కారం అవుతుందని చెబుతుంది. 

కార్తీక్ ఒక బోటిక్ లో కూర్చుని ఆలోచిస్తుంటాడు. అప్పుడు అక్కడ పనిచేస్తున్న వాళ్లంతా సార్ ఏం చేస్తున్నారు? అలాగే చూస్తూ కూర్చున్నారు అని అనుకుంటూ ఉంటారు. ఈ లోగా కొంతమంది కస్టమర్స్ వచ్చి డబ్బులు ఎంతఇవ్వాలని అడుగుతారు. ఏదో చెప్పి కొంత డబ్బులు తీసుకుంటాడు. ఇంత  మతిమరుపు ఉన్నవాళ్లని మేడమ్ ఎలా భరిస్తున్నారు రా బాబు  అనుకుంటారు. కట్ చేస్తే కారుడ్రైవర్ శివ..రోడ్డు మీద ఐస్ క్రీం తింటూ ఉంటాడు. అప్పుడే దీప మళ్లీ కార్తీక్ ఫొటోతో ఎంట్రీ ఇస్తుంది. దీపని చూసి పారిపోయేందుకు శివ ప్రయత్నించడంతో..వాడిని పట్టుకున్న దీప..ఎవడ్రా నువ్వు? మొన్న ఫోటోలో చూపిస్తే తెలీదన్నావు అంటుంది. మీరెవరు మేడం అని అడగడంతో నువ్వు ఎవరని రివర్స్ లో క్వశ్చన్ చేసిన దీప..నిజం చెప్పకపోతే పోలీసులకు పట్టిస్తానని బెదిరిస్తుంది. నిజం చెప్పేస్తానని శివ అనడంతో..నిజంగా నా కార్తీక్ ఎక్కడున్నాడో నీకు తెలుసా అయితే చెప్పు అనడంతో..దీపని తోసేసి శివ అని శివని కార్లోకి తోసేస్తుంది.  అప్పుడు నిజం చెప్పేస్తాను అని శివ అంటాడు. ఇంతట్లో మోనిత అక్కడికి వచ్చి నిజంగా నా కార్తీక్ ఎక్కడున్నాడో నీకు తెలుసా అయితే చెప్పు అని దీపని తోసేసి శివని కారులోకి లాకెళ్లిపోతుంది. 
Also Read:  మోనితకు ఇక దబిడి దిబిడే, డాక్టర్ బాబు ఎక్కడున్నాడో దీపకు తెలిసిపోయింది!

డాక్టర్ బాబుకి మోనిత గోరు ముద్దలు
 కార్తీక్ కి అన్నం తినిపిస్తూ ఉంటుంది మోనిత. అప్పుడు కార్తీక్ నీ పేరేంటి అని అడుగుతాడు దానికి మొనిత నువ్వు ఎన్ని మర్చిపోయిన నేను నీకు మళ్ళీ గుర్తు చేస్తూనే ఉంటాను కార్తీక్. నా పేరు మొనిత అంటుంది. 
కార్తీక్: అసలు నువ్వు నిజంగానే నా భార్యవా? నువ్వేమో ఇంట్లో కట్టిపడేస్తున్నావ్..ఆవిడెవరో డాక్టర్ బాబు అని పిలుస్తోంది. ఇంట్లో ఉన్న ఒక ఫోటో తప్ప నాకు ఇంకేమీ గుర్తురావడం లేదు. మనం నిజంగానే బోటిక్ చాలా ఏళ్ల నుంచి నడుపుతున్నామా? నాకు చిన్న గుర్తు కూడా రావడం లేదంటాడు. నువ్వు నా భార్యవేనా..వేరే కారణం వల్ల నన్నిక్కడ కట్టిపడేశావా..
మోనిత: పరాయి మగాడిని ఇంటికి తెచ్చుకుని భర్తని చెప్పడానికి నాకేంటి అవసరం కార్తీక్. పోని నీ దగ్గర ఆస్తిపాస్తులున్నాయా అంటే నీకు ఏవి గుర్తు లేవు మరి నాకేంటి అవసరం. నేను నిన్ను దక్కించుకోవడానికి చాలా కష్టాలు పడ్డాను. నాలో ప్రేమ నీకు కనిపించట్లేదా అని ఎప్పటిలా యాక్షన్ చేస్తుంటుంది. 
కార్తీక్: నన్ను ఎందుకు బయటకు పంపించడం లేదు అని అనగా నువ్వు బయటికి వెళ్తే తిరిగి ఇంటిదారిని మర్చిపోయి  ఎక్కడ నాకు దూరం అవుతావని భయం కార్తీక్ అంతే అంతకుమించి ఇంకేం లేదు. కోపం వస్తే తిట్టు, కొట్టు కానీ నీ భార్యను కాను అనిమాత్రం అనొద్దు తట్టుకోలేనని చెప్పి.. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మోనిత. 
Also Read:  తరగతి గది దాటి తరలిన కథ , ఐ లవ్ యూ రిషి సార్ నన్ను క్షమించండి నా ప్రేమని అంగీకరించండని చెప్పేసిన వసు

ఆ తర్వాత సీన్లో ఆనందరావు, సౌందర్య, హిమ, శౌర్య ఇంటి ఎదురుగా వస్తారు. శౌర్య తినడం చూసి ఎలాంటి గతి పట్టిందే శౌర్యకి అని అనుకుంటారు. మనం వెళ్లొద్దు నానమ్మ మళ్లీ శౌర్య కోప్పడుతుంది. ఓ మూలనుంచి చూసి సరిపెట్టుకుందాం అనుకుంటారు. ఆనందరావు మాత్రం శౌర్య దగ్గరకు వెళతాడు. అందరూ వచ్చారా అని శౌర్య అడిగితే లేదమ్మా నేనే వచ్చానంటాడు. అప్పుడు శౌర్య మీ మీద ఇష్టం లేకపోవడం కాదు తాతయ్య హిమ అంటే ఇష్టం లేదంటుంది శౌర్య. కోపం ఎలా పోతుందమ్మా అని ఆనందరావు అంటే..అమ్మ నాన్నలు తిరిగి వస్తే పోతుందేమో తాతయ్య..తెలీదంటుంది. వాళ్ళురారని ఆనందరావు అనడంతో..లేదు తాతయ్యా అమ్మ నాన్నలు ఇక్కడే ఎక్కడో ఉన్నారు కచ్చితంగా తిరిగి వస్తారు అంటుంది శౌర్య. 
ఎపిసోడ్ ముగిసింది

రేపటి(శనివారం) ఎపిసోడ్
డ్రైవర్ శివని మోనిత లాక్కెళ్లిపోయిన విషయం గుర్తుచేసుకుంటూ ఆటోలో వెళుతుంది దీప. మరోవైపు కార్తీక్..దీపా దీపా అని మాట్లాడుతుంటే అది విని మోనిత షాక్ అవుతుంది..

Published at : 26 Aug 2022 08:11 AM (IST) Tags: karthika deepam latest episode karthika Deepam Serial Today Episode Amulya Gowda Kerthi Kesav Bhat amulya gowda Manoj kumar Manas Nagulapalli keerthi Karthika Deepam August 26 Episode 1441

సంబంధిత కథనాలు

Janaki Kalaganaledu September 27th: జెస్సిని చూసి పద్ధతికి పట్టు చీర కట్టినట్టుగా ఉందన్న ముత్తైదువులు- అంతలోనే పుల్ల పెట్టేసిన నీలావతి, పెట్రోల్ మల్లిక

Janaki Kalaganaledu September 27th: జెస్సిని చూసి పద్ధతికి పట్టు చీర కట్టినట్టుగా ఉందన్న ముత్తైదువులు- అంతలోనే పుల్ల పెట్టేసిన నీలావతి, పెట్రోల్ మల్లిక

Gruhalakshmi September 27th Update: సామ్రాట్ జీవితంలో పెను విషాదం- తులసిని దూరం పెట్టమని సామ్రాట్ కి తెగేసి చెప్పిన అనసూయ

Gruhalakshmi September 27th Update: సామ్రాట్  జీవితంలో పెను విషాదం- తులసిని దూరం పెట్టమని సామ్రాట్ కి తెగేసి చెప్పిన అనసూయ

Guppedantha Manasu September 27th Update:మాట వెనక్కు తీసుకునేది లేదన్న వసు, జగతిని ఆపిన రిషి - అవకాశంగా వాడుకున్న దేవయాని!

Guppedantha Manasu September 27th Update:మాట వెనక్కు తీసుకునేది లేదన్న వసు, జగతిని ఆపిన రిషి - అవకాశంగా వాడుకున్న దేవయాని!

Karthika Deepam September 27 Update: దీపని గుర్తుపట్టేసిన కార్తీక్, శౌర్యని తప్పుదారి పట్టించిన మోనిత

Karthika Deepam September 27 Update:  దీపని గుర్తుపట్టేసిన కార్తీక్, శౌర్యని తప్పుదారి పట్టించిన మోనిత

Devatha September 27th Update: దేవిని ఆదిత్యతో మాట్లాడమని ఒట్టు వేయించుకున్న చిన్మయి- షాక్లో మాధవ్, ఇల్లు విడిచి వెళ్ళనన్న రాధ

Devatha September 27th Update: దేవిని ఆదిత్యతో మాట్లాడమని ఒట్టు వేయించుకున్న చిన్మయి- షాక్లో మాధవ్, ఇల్లు విడిచి వెళ్ళనన్న రాధ

టాప్ స్టోరీస్

Vijayashanti: పండక్కి పైసలెట్ల? సర్కార్ ఉద్యోగులే కేసీఆర్‌ను పడగొడతరు - విజయశాంతి

Vijayashanti: పండక్కి పైసలెట్ల? సర్కార్ ఉద్యోగులే కేసీఆర్‌ను పడగొడతరు - విజయశాంతి

Supreme Court Live Streams: సుప్రీం కోర్టు విచారణలు లైవ్‌లో ఇలా చూడొచ్చు!

Supreme Court Live Streams: సుప్రీం కోర్టు విచారణలు లైవ్‌లో ఇలా చూడొచ్చు!

ఏవండీ ఆవిడ వద్దు! నెల్లూరు టిక్‌టాక్‌ మ్యారేజ్‌లో అదిరిపోయే ట్విస్ట్‌

ఏవండీ ఆవిడ వద్దు! నెల్లూరు టిక్‌టాక్‌ మ్యారేజ్‌లో అదిరిపోయే ట్విస్ట్‌

పద్దతి దాటితే కుల్లం కల్లం మాట్లాడతా, షర్మిల గురించి డెప్త్‌ విషయాలు చెప్తా: జగ్గారెడ్డి

పద్దతి దాటితే కుల్లం కల్లం మాట్లాడతా, షర్మిల గురించి డెప్త్‌ విషయాలు చెప్తా: జగ్గారెడ్డి