దీపం వెలిగించేటప్పుడు మీరు ఎంచుకునే ప్రమిద ఇంట్లో కొన్ని సమస్యలని పరిష్కరిస్తుందట..

మట్టిప్రమిదలో ఆవు నెయ్యి పోసి తులసి మొక్క వద్ద వెలిగిస్తే దుష్టశక్తుల నాశనమై, సకలపాపాలు నశిస్తాయని చెబుతారు.

కంచు / ఇత్తడి ప్రమిదను శనగపప్పుపై పెట్టి చుట్టూ పసుపురంగు పూలతో అలంకరించి, ఉత్తరాభిముఖంగా నువ్వుల నూనెతో వెలిగిస్తే ధనానిని స్థిరత్వం ఉంటుంది.

వెండి ప్రమిదను బియ్యంపై ఉంచి తెలుపు రంగు పూలతో అలంకరించి, ఆవునెయ్యితో తూర్పు ముఖంగా వెలిగిస్తే సంపద వృద్ధి చెందుతుంది.

బంగారు ప్రమిదను గోధుమలపై ఉంచి చుట్టూ ఎరుపు రంగు పూలు అలంకరించి, ఆవు నెయ్యితో తూర్పు ముఖంగా వెలిగించాలి. ఇలా చేస్తే ధనసమృద్ధి, విశేష బుద్ధి లభిస్తుంది.

అమావాస్య రోజు రాత్రి ఆవు నేతితో రావిచెట్టు కింద దీపం పెడితే పితృదేవతలు సంతోషిస్తారట

పిండి ప్రమిదలో దీపం వెలిగిస్తే నాలుగువిధాలా లాభం చేకూరుతుంది.

ఆవనూనెతో రావిచెట్టు క్రింద 41 రోజులు దీపం వెలిగిస్తే కోరికలు నెరవేరుతాయని అంటారు

నువ్వుల నూనెతో 41 రోజులు దీపం వెలిగిస్తే సమస్త రోగాలు నశించి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి

గురువారం అరటిచెట్టు దగ్గర ఆవునేతితో దీపం వెలిగిస్తే అవివాహితులకు వివాహం జరుగుతుంది.

బంగారం, వెండి, కంచు, మట్టి, పిండి ఇలా రకరకాల ప్రమిదలు ఉంటాయి. ఎవరి శక్తిని బట్టి వాళ్లు ఈ ప్రమిదలను ఉపయోగించి దీపం వెలిగిస్తారు.