ఒక కంపెనీ షేర్లు కొంటున్నామంటే ఆ వ్యాపారం మనమే చేస్తున్నట్టు లెక్క! అందుకే సుదీర్ఘ కాలం అందులోనే పెట్టుబడి కొనసాగిస్తే మంచి రాబడి వస్తుంది.
భారత్ రసాయన్‌లో 20 ఏళ్ల క్రితం రూ.20,000 పెట్టుబడి పెట్టుంటే ఇప్పుడవి రూ.కోటి అయ్యేవి. ఈ రెండు దశాబ్దాల్లో ఈ కంపెనీ షేర్ల ధర 500 రెట్లు పెరిగింది మరి! 20 ఏళ్ల క్రితం రూ.20గా ఉన్న షేరు ఇప్పుడు రూ.9895కు చేరుకుంది.
షేరు చరిత్ర ఇదీ
గత ఏడాది కాలంలో భారత్ రసాయన్ షేరు రూ.8710 నుంచి రూ.9985కు చేరుకుంది.
చివరి ఐదేళ్ల కాలంలో రూ.1910 నుంచి రూ.9985కు చేరుకుంది. అంటే 425 శాతం అన్నమాట.
అలాగే గత పదేళ్లలో రూ.110 నుంచి రూ.9985కు చేరింది. ఇక 20 ఏళ్లలో రూ.20 నుంచి రూ.9985కు వచ్చింది.
ఎప్పుడు కొంటే ఎంత అందేది?
భారత్ రసాయన్‌లో 6 నెలల క్రితం రూ.20వేలు పెట్టుంటే ఇప్పుడు రూ.16,000 అందుకొనేవారు.
ఏడాది క్రితం రూ.20,000 పెట్టుంటే ఇప్పుడు రూ.23,000 అయ్యేది.
ఐదేళ్ల క్రితం రూ.20,000 పెట్టుంటే ఇప్పుడు రూ.1.05 లక్షలు అందేవి.
పదేళ్ల క్రితం షేరుకు రూ.110 పెట్టుంటే ఇప్పుడు రూ.18.15 లక్షలు అందుకొనేవారు.
ఇక రూ.20 వద్ద 20 ఏళ్ల క్రితం రూ.20,000 పెట్టుంటే అక్షరాలా రూ.కోటి అందేవి.