పెరుగుతో పాటూ వీటిని తింటే... ఎంత మంచిదో భారతీయులకు పెరుగు ముద్ద దిగనిదే భోజనం పూర్తయినట్టు కాదు. పెరుగుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు తెలుగుప్రజలు. పెరుగులో కాస్త తేనె కలుపుకుని అప్పుడప్పుడూ తింటే చాలా మంచిది. అల్సర్ల సమస్య రాకుండా ఉంటుంది. నల్ల మిరియాల పొడిని రోజూ పెరుగులో కలిపి తింటే జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. మలబద్ధకం దరిచేరదు. తాజా పండ్ల ముక్కలను పెరుగులో కలుపుకుని తింటూ ఉండాలి. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఓట్స్ ను పెరుగులో నానబెట్టి, కాస్త తేనె కలుపుకుని తింటే చాలా మంచిది. నోటిపూత, దంతాలు, చిగుళ్ల సమస్యలు రాకుండా ఉండాలంటే పెరుగులో వాము పొడి కలుపుకుని తినాలి. బరువు తగ్గాలనుకునేవారు కప్పు పెరుగులో అరస్పూను జీలకర్ర పొడిని కలుపుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది. కప్పు పెరుగులో చిటికెడు పసుపు, అరస్పూను అల్లం రసం కలిపి తింటే గర్భిణిలకు చాలా మేలు. పిల్లలకు అప్పుడప్పుడు పెరుగులో కాస్త చక్కెర కలిపి ఇస్తే మంచిది. ఈ మిశ్రమం తక్షణ శక్తినిస్తుంది.