‘చంద్రముఖి’, ‘గజిని’ సినిమాల్లో కనిపించిన నయన తారకు.. ఇప్పటి నయన తారకు చాలా వ్యత్యాసం ఉంటుందనే సంగతి తెలిసిందే. అప్పట్లో బొద్దుగా ఉండే నయన తార స్లిమ్‌గా మారడమే కాదు.. ముఖంలో కూడా ఎంతో మార్పు వచ్చింది. నయన తార ఇప్పుడు అంత అందంగా మారడానికి కారణం.. ప్లాస్లిక్ సర్జరీ. నయన తార ముఖం అప్పట్లో గుండ్రంగా ఉండేది.. దవడల నుంచి మెడ వరకు ఉబ్బినట్లు ఉండేది. కొత్త లుక్ కోసం వైద్యులు లైపోసక్షన్ ద్వారా నయన తార దవడ, మెడ వద్ద కొవ్వును తొలగించారు. మరింత అందంగా కనిపించేందుకు కాస్మోటిక్ సర్జరీ కూడా చేశారు. ‘శ్రీరామ రాజ్యం’ సినిమా నుంచి నయన్ కొత్త లుక్‌తో కనిపించింది. నయన తార తన కొత్త లుక్‌తో మరిన్ని అవకాశాలను అందుకుంది. నయన్ కేవలం తన ముఖాన్నే కాకుండా శరీరాన్ని కూడా ఫిట్‌గా ఉంచుకుంటూ ‘లేడీ సూపర్ స్టార్’ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది.