బొప్పాయి గింజలు పడేస్తున్నారా? పొడి చేసుకుని తింటే ఎన్ని లాభాలో...
బొప్పాయి పండు వల్ల ఎన్ని లాభాలో అందరికీ తెలిసిందే. తింటే ఆరోగ్యమే కాదు, అందం కూడా మెరుగవుతుంది. చర్మాన్ని మెరిపించడంలో బొప్పాయి పండుకు సాటేది లేదు.
బొప్పాయి పండే కాదు, వాటి గింజలు కూడా ఎంతో ఆరోగ్యాన్నిస్తాయి. కానీ చాలా మంది పండు తిని గింజల్ని పడేస్తుంటారు. కానీ పొడి చేసుకుని దాచుకుని తింటే చాలా మంచిది.
బొప్పాయి గింజల్ని పడేయకుండా బాగా ఎండబెట్టి పొడి చేసి ఓ డబ్బాలో దాచుకోవాలి. ఆ పొడి ఎన్ని నెలలైనా పాడవ్వకుండా ఉంటుంది.
బొప్పాయి గింజల పొడిని నీటిలో కలుపుకుని రోజూ తాగితే చాలా మంచిది. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి.
బొప్పాయి గింజల పొడిని నీటిలో కలుపుకుని రోజూ తాగితే చాలా మంచిది. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి.
శరీరంలో అదనపు కొవ్వులు, చక్కెర చేరకుండా నియంత్రించడంలో వీటి పాత్ర విశేషం.
మూత్రపిండాల పనితీరు మెరుగు పడేందుకు బొప్పాయి గింజల పొడి సహాయపడుతుందని ఇప్పటికే అనేక అధ్యయనాల్లో తేలింది.
ఇతర గింజల్లో ఉన్నట్టే ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. అధిక బరువను నియంత్రిస్తుంది.
వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో చేరే ఫ్రీరాడికల్స్ పనిపట్టడంలో ఇవి ముందుంటాయి.
రోజూ ఒక స్పూను బొప్పాయి గింజల పొడి తినడం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చు. కాబట్టి ఈసారి బొప్పాయి గింజలు పడేయకుండా పొడి చేసుకుని తినండి.