ఏదైనా కేంద్ర ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఒక మంచి అవకాశం
ఇందులో నెలకు రూ.12,500 పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయానికి రూ.కోటి మీ చేతికి అందుతాయి.
ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టినా ఎక్కువ మందిని ఆకట్టుకున్నది మాత్రం ఇదే! ఎందుకంటే పెట్టుబడి సురక్షితం, మంచి వడ్డీరేటు లభిస్తుండటమే కారణాలు. ప్రభుత్వ రంగ బ్యాంకులు లేదా పోస్టాఫీసులో పీపీఎఫ్‌ను సులభంగా కట్టుకోవచ్చు.
నెలకు రూ.500 కనీస మొత్తంతో పీపీఎఫ్‌ను ఆరంభించొచ్చు. గరిష్ఠంగా నెలకు రూ.12,500 లేదా ఏడాదికి రూ.1.5 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చు.
ప్రస్తుతం పీపీఎఫ్ మీద వార్షిక వడ్డీరేటు 7.1 శాతంగా ఉంది. ప్రభుత్వం నెలవారీ వడ్డీని ఏటా మార్చి తర్వాత పీపీఎఫ్ ఖాతాలో జమ చేస్తుంది.
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఈ ఖాతా తెరవొచ్చు. పిల్లల పేరుతో పెద్దలూ పీపీఎఫ్ నిర్వహించొచ్చు.
ఈ పథకం ఆదాయపన్ను మినహాయింపు కిందకు వస్తుంది. సెక్షన్ 80సీ ప్రకారం పన్ను మినహాయింపు పొందొచ్చు.
ఈ పథకం ద్వారా మెచ్యూరిటీ సమయానికి కోటి రూపాయాలు పొందాలంటే గరిష్ఠంగా 25 ఏళ్ల వరకు ఖాతాను కొనసాగించాలి.
ఏడాదికి రూ.1.5 లక్షల చొప్పున మీరు రూ.37,50,000 జమ చేస్తారు. ఇక 7.1 శాతం వడ్డీరేటు ప్రకారం మీకు రూ.65,58,012 వడ్డీగా అందుతాయి. మొత్తం రూ.1,03,08,012 మీరు పొందుతారు
సాధారణంగా మెచ్యూరిటీ సమయం 15 ఏళ్లే అయినా ఐదేళ్ల పాటు రెండుసార్లు కాలపరిమితి పెంచుకోవచ్చు. అలా చేస్తేనే మీకు కోటి సొంతం అవుతుంది.