ఐసీసీ భవిష్య ప్రణాళికను వెలువరించింది. దశాబ్ద కాలంలో జరిగే మెగా టోర్నీలు, ఆతిథ్య దేశాల వివరాలను ప్రకటించింది. తెలుపు బంతి క్రికెట్‌కు సంబంధించి కొన్ని అనూహ్య నిర్ణయాలు వెల్లడించింది.

భారత్‌ ఐసీసీ వన్డే, టీ20, ఛాంపియన్స్‌ ట్రోఫీలకు వేదిక కానుంది.

2024 నుంచి 2031 వరకు జరిగే పరిమిత ఓవర్ల క్రికెట్‌ టోర్నీల గురించి ఐసీసీ వివరించింది. 8 కొత్త టోర్నీలు, 12 వేర్వేరు ఆతిథ్య దేశాలు, ఛాంపియన్స్‌ ట్రోఫీ అధికారికంగా పునరాగమనం చేసిందని వెల్లడించింది.

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌

వెస్టిండీస్‌, యూఎస్‌ఏ - 2024, జూన్‌

ఐసీసీ పురుషుల ఛాంపియన్స్‌ ట్రోఫీ

పాకిస్థాన్‌ - 2025, ఫిబ్రవరి

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌

భారత్‌, శ్రీలంక - 2026, ఫిబ్రవరి

ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్‌

దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా - అక్టోబర్‌/నవంబర్‌ 2027

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ - 2028, అక్టోబర్‌

ఐసీసీ పురుషుల ఛాంపియన్స్‌ ట్రోఫీ

భారత్‌ - 2029

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌

ఇంగ్లాండ్‌, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌ - 2030, జూన్‌