ముల్లంగి తింటే బీపీ కంట్రోల్ తప్పదా?

శీతాకాలంలో సీజనల్ గా పండే దుంప ముల్లంగి. చాలా మంది ముల్లంగిని తినడానికి ఇష్టపడరు. సాంబారులోనో, పప్పుచారులోనో వేసుకుని, తినేటప్పుడు మాత్రం పక్కన పెడతారు. దీన్ని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

రక్తపోటును అదుపులో ఉంచేందుకు ముల్లంగి ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ముల్లంగిని తినడం వల్ల శీతాకలంలో సీజనల్ గా వచ్చే జలుబు, జ్వరం, దగ్గు నుంచి ఉపశమనం పొందచ్చు.

వీటిలో యాంథోసియానిన్స్ ఉంటాయి. ఇవి గుండెకు బలాన్ని చేకూరుస్తాయి. రక్తంలో ఆక్సిజన్ స్థాయిని కూడా క్రమబద్ధీకరిస్తాయి.

తెల్ల ముల్లంగిలో కొల్లాజిన్ ఉంటుంది. ఇది రక్తనాళాలు సాగేందుకు ఉపయోగపడుతుంది. రక్తనాళాలు కుచించుకుపోతే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది.

పొట్టను ఆరోగ్యంగా ఉంచడంలో ముందుంటుంది. ముల్లంగిని తినడం వల్ల జీర్ణ వ్యవస్థ చక్కగా ఉంటుంది. ఎసిడిటీ, ఊబకాయం, వికారం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

ముల్లంగిని కూరలా వండుకుని తిన్నా, లేక పరాటా స్టఫ్ గా చేసుకున్నా బావుంటుంది. ఏదోలా ముల్లంగి పొట్టలోకి చేరేలా చూసుకోండి.