విడాకులకు ప్రధాన కారణాలు ఇవే



ఆధునిక కాలంలో విడాకులు తీసుకుంటున్న జంటలు పెరిగిపోతున్నాయి. మనస్తత్వశాస్త్రవేత్తల చెప్పిన ప్రకారం విడాకులకు ప్రధాన కారణాలు ఇవే..



చిన్న చిన్న విషయాలకే వాదించుకోవడం. వాదనలో ఏ ఒక్కరూ వెనక్కి తగ్గకపోవడం.



భార్యాభర్తలు కష్టసుఖాల్లో ఒకరికొకరు అన్నట్టు ఉండాలి. కానీ ఒకరు సమస్యల్లో ఉన్నప్పుడు మరొకరు పెద్దగా పట్టించుకోకపోవడం, మద్దతుగా నిలవకపోవడం విడాకులకు దారి తీస్తుంది.



పిల్లలు కలగపోవడం కూడా ప్రధాన కారణంగానే ఉంది. సమస్య కేవలం భార్యది మాత్రమే అనుకుని ఎక్కువమంది భర్తలు విడాకులు ఇచ్చేస్తున్నారు.



వివాహేతర సంబంధాల వల్ల కూడా భార్యభర్తలు విడిపోతున్నారు.



భర్తకు మద్యపానం అలవాటు అధికంగా ఉండడం వల్ల కూడా ఇంట్లో సమస్యలు పెరిగి ఎడబాటుకు కారణం అవుతున్నాయి.



ఆర్థిక కష్టాలు వచ్చినప్పుడు ఒకేతాటిపై నిలిచి పోరాడకుండా, విడిపోవడానికి ఎక్కువజంటలు సిద్ధమవుతున్నాయి.



ఇద్దరిలో ఒకరికి లైంగిక అనాసక్తి కూడా కారణమవుతుంది. వారి రొమాంటిక్ లైఫ్ సరిగా లేకపోయినా విడాకులకు దారితీస్తుంది.