సోషల్ మీడియా ఖాతా ఉందా... తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే



ఇప్పుడు ప్రతి ఒక్కరికీ సోషల్ మీడియా ఖాతాలు ఉన్నాయి. ఎంతో మంది సోషల్ మీడియాలో మోసాలకు కూడా గురవుతున్నారు. సోషల్ మీడియాలో సేఫ్ గా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే.



పాస్ వర్డ్ స్ట్రాంగ్ గా పెట్టుకోవాలి. మీ ఖాతాకు మొదటి సెక్యూరిటీ గార్డు పాస్ వర్డే.



ఫేస్ బుక్, ఇన్ స్టా, ట్విట్టర్ ఇలా అన్ని సోషల్ మీడియాలో ఖాతాలు ఉండే, వాటికి వేరువేరుగా పాస్ వర్డ్ లు పెట్టుకోవాలి.



ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు యాక్సెప్ట్ చేసే ముందు ఆలోచించండి. తెలిసిన వారైతేనే యాక్సెప్ట్ చేయాలి.



ఏ ఖాతా నుంచైనా లింక్స్ వస్తే క్లిక్ చేయకండి. వాటి వల్ల ఒక్కోసారి ఖాతా హ్యాక్ కు గురయ్యే అవకాశం ఉంది.



వ్యక్తిగత విషయాలు బయటపెట్టకుండా ఉండడం మంచిది. మీ ఇంటి చిరునామాలు, ఫోన్ నెంబర్లు, ఆర్థిక పరిస్థితుల గురించి పబ్లిక్ గా షేర్ చేసుకోకూడదు.



ప్రైవసీ సెట్టింగ్స్ ను వాడుకుని ఖాతాను ఎవరు చూడొచ్చు, ఎవరు చూడకూడదు అనేది సెట్ చేసుకోవడం మంచిది.