అది 1993, నవంబరు 15.. యావత్ సినీ పరిశ్రమ ఉలిక్కిపడిన రోజు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ మద్రాస్ నుంచి ఢిల్లీకి విమానంలో బయల్దేరారు. ఇంధనం తక్కువగా ఉండటంతో హైదరాబాద్‌లో ల్యాండ్ చేయాలనుకున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం మళ్లీ పైకెళ్లింది. ఇంధనం లేకపోవడంతో పైలట్లు నేరుగా వెంకటగిరి పొలాల్లో క్రాష్ ల్యాండ్ చేశారు. విమానం పొలాల్లో ల్యాండైన సమయంలో 272 మంది ప్రయాణికులు ఉన్నారు. 60 మంది పైగా తెలుగు, తమిళ సినీ ప్రముఖలు, వారి కుటుంబికులు ఉన్నారు. విజయశాంతి, మాలాశ్రీ, అల్లు రామలింగయ్య, సుధాకర్, బ్రహ్మానందం కూడా ఉన్నారు. బాపు, కోడి రామకృష్ణ, ఎస్‌వి కృష్ణారెడ్డి, ప్రభాస్ తండ్రి నారాయణరావు, పరుచూరి వెంకటేశ్వరరావు కూడా విమానంలో ఉన్నారు. కెప్టెన్ భల్లా, కో పైలెట్ వేల్‌రాజ్ సమయస్ఫూర్తి వల్ల అంతా ప్రాణాలతో బయటపడ్డారు. ఒకరకంగా ఇది టాలీవుడ్ ప్రముఖులకు పునర్జన్మ అని చెప్పుకోవచ్చు.