చలికాలంలో... వీటిని తింటే బోలెడంత వెచ్చదనం రోజూ మనం తినే ఆహారంలో కొన్ని పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ఇవన్నీ కూడా శరీరానికి వెచ్చదనాన్ని అందించేవే. రోజుకో నువ్వుల లడ్డూ, లేదా నువ్వుల పచ్చడి... ఎలా తిన్నా మీ ఇష్టం. శ్వాసకోశ సమస్యలు రాకుండా అడ్డుకోవడంతో దీనికిదే సాటి. రాగులు, సజ్జలతో చేసిన వంటకాలు కూడా తినడం అలవాటు చేసుకోవాలి. చలిని శరీరం బయటే ఉంచేలా చేయడంలో ఇవి దిట్ట. రోజూ ఏదో ఒక సమయంలో చిన్న ముక్క బెల్లం తినడం అలవాటు చేసుకోవాలి. ఇది కేవలం వెచ్చదనం కోసమే కాదు, రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. రోజూ స్పూను తేనెను నేరుగా తినడమో, లేక పాలల్లో కలుపుకుని తినడమో చేయాలి. తేనెలో జలుబు వంటి సమస్యలతో పోరాడే గుణం ఉంది. చలికాలంలో ఉత్తమ ఆహారం డ్రై ఫ్రూట్స్. ఆప్రికాట్లు, అంజీర్లు, నట్స్ వంటివి తింటే శరీరానికి వెచ్చదనం కలుగుతుంది. అమ్మో లావైపోతాం అనుకోకుండా... రోజుకో స్పూను నెయ్యి వేడి వేడి అన్నంలో కలుపుకుని తినాలి. అంతేకాదు ఇది చెడు కొవ్వులను పేరుకుపోకుండా నిరోధిస్తుంది. వంటల్లో దీన్ని భాగం చేసుకోండి. ఇది జీర్ణ క్రియ రేటును పెంచుతుంది. చలి వాతావరణంలో శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది. రోజూ టీ తాగే అలవాటు ఉంటే, అందులో కాస్త తులసి రసం, అల్లం రసం కలుపుకుని తాగడం మొదలుపెట్టాలి. చలికాలంలో ఈ రెండింటి కాంబినేషన్ చక్కగా పనిచేస్తుంది. సాయంత్రవేళల్లో వేడి వేడి సూప్ లు తాగాలి. చికెన్ సూప్, కార్న్ సూప్, టమాటా సూప్... ఏదైనా. వెంటనే శరీరంపై ప్రభావం చూపిస్తాయివి.