By: ABP Desam | Updated at : 17 Aug 2022 09:47 AM (IST)
Edited By: RamaLakshmibai
Guppedantha Manasu August 17 Episode 531 (Image Credit: Star Maa/Hot Star)
గుప్పెడంతమనసు ఆగస్టు 17 బుధవారం ఎపిసోడ్ (Guppedantha Manasu August 17 Episode 531)
వదినా మంచి స్వీట్ కావాలని ధరణిని అడుగుతాడు గౌతమ్. ఈ అకేషన్ కోసం స్వీట్స్ ఉన్నాయికదా అంటుంది జగతి. ఇంతలో అక్కడకు వచ్చిన దేవయాని.. నిశ్చితార్థం తప్పిపోయిందని స్వీట్స్ చేయమంటున్నావా అని మండిపడుతుంది. మీరంతా కోరుకున్నదే జరిగిందికదా..అందరి కళ్లూ చల్లబడ్డాయా..గౌతమ్ స్వీట్స్ అడిగితే..ఇంట్లో శుభకార్యం జరగకుండా ఆగిపోయింది దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం తప్పని చెప్పాలికదా..నువ్వే తగుదునమ్మా అని అందర్నీ పురికొల్పి స్వీట్లు, పార్టీలంటే ఎలా. ఇలాంటప్పుడే ఎవరి బుద్ధి ఏంటన్నది బయటపడుతుంది
జగతి: చాలా బాగా చెప్పారు..మీ బుద్ధి గురించి మాట్లాడేంత బుద్ధి నాకు లేదనుకుంటాను. మీరు పెద్దవారు..ఏ విషయంలో అయినా గొప్పవారని నమ్ముతున్నాను..
( ధరణి, గౌతమ్ నవ్వుకుంటారు)
గౌతమ్: సాక్షి వచ్చి మిమ్మల్ని బెదిరించింది..కోర్టుకు లాగుతానంది..అలాంటి సాక్షితో రిషి పెళ్లి తప్పిపోయినందుకు మీరు సంతోషించాలి..ఆ సాక్షి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు మాకు అదే సంతోషం...
ఇంతలో ఏంట్రా అంటూ ఎంట్రీ ఇస్తాడు రిషి..నేను ఉండగా పెద్దమ్మని ఎవరూ ఏం చేయలేరు..పెద్దమ్మని ఓ మాట అనాలంటే ఫస్ట్ నన్ను దాటి వెళ్లాలి అంటాడు..
దేవయాని: నవ్వాలో ఏడవాలో అర్థంకావడం లేదనుకుంటుంది దేవయాని... నాపై నీకున్న ప్రేమ కొత్తగా ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు..నేనేంటో నీకు తెలుసు, నువ్వేంటో నాకు తెలుసు కదా నాన్నా..
రిషి: మీరేం బాధపడకండి..
గౌతమ్: పెద్దమ్మకేం బాధలేదురా..పెద్దమ్మ చాలా హ్యాపీగా ఉంది..ఈ పెళ్లి తప్పిపోయినందుకు స్వీట్ పార్టీ చేసుకుందాం అంటున్నారు..
దేవయాని: వీళ్ల సంగతి సరే కానీ నువ్వు బాగానే ఉన్నావు కదా నాన్నా...అనేసి వెళ్లిపోతుంది..
రిషి కూడా అందరి ముఖాలూ ఓసారి చూసి వెళ్లిపోతాడు..
అటు వసుధార ఆటోలో వెళుతూ..జరిగినవన్నీ గుర్తుచేసుకుంటుంది. అప్పుడు గిఫ్ట్ ఇచ్చి ఐలవ్ యూ చెప్పారు, ఇప్పుడు ఉంగరంపై వి అని రాసి నాపై ప్రేమను చూపిస్తున్నారా అనుకునేలోగా కాల్ చేసిన రిషి..ఆటోలోంచి దిగు అంటాడు. ఎక్కడున్నారు సార్ అని వసు అడిగితే ముందు కిందకు దిగు అంటాడు. వసు ఆటోలోంచి దిగిన వెంటనే రిషి వస్తాడు. వసుధార అరచేతిలో ఉన్న 'V' రింగు చూసుకుంటూ కార్లో కూర్చుంటుంది.
కంగ్రాట్స్ జగతి , అమ్మా ధరణి కంగ్రాట్స్ అంటూ మహేంద్ర ఆనందానికి అవధులుండవు. సాక్షి ఈ పెళ్లొద్దని వెళ్లిపోయింది.. ఇంతకన్నా సంతోషకరమైన వార్త ఉండదు..అలసు నాకు డాన్స్ చేయాలని ఉంది అంటాడు
జగతి: ఎమోషన్స్ ని అదుపులో పెట్టుకోవాలి మహేంద్ర..
మహేంద్ర: మనిషి అంటే ఎలా ఉండాలో తెలుసా..దేవయాని వదినగారిలా ఉండాలి...
జగతి: అలా అంటున్నావేంటి...
మహేంద్ర: వదిన ఏం చేయాలి అనుకుంటే అది చేస్తుంది..ఏం సాధించాలనుకుంటే అది చేస్తుంది..మంచి చెడు పక్కనపెడితే తను నమ్మింది చేస్తుంది...
జగతి: ఇంతకీ దేవయాని అక్కయ్య ఎలా ఉన్నారో...
మహేంద్ర: నేను ఒకటి అనుకుంటున్నాను..అచ్చం అలానే ఉంటుంది..
అటు దేవయాని రూమ్ లో ఒంటరిగా ఆలోచిస్తూ..ఆంటీ మీకో దండం అంటూ వెళ్లిపోయిన విషయం గుర్తుచేసుకుంటుంది. ఇప్పుడు రిషి నా గుప్పిట్లోంచి జారిపోయాడు, మళ్లీ ఏం చేస్తే నా గుప్పిట్లోకి వస్తాడు.. రిషి నాపై ప్రేమతో సాక్షితో పెళ్లికి ఒప్పుకుంటే చివరికిసాక్షి ఇలా చేసింది. ఇప్పుడు నేను ఏం చేయాలి అంటూ చేతికి దొరికినవి విసిరి కొడుతుంటుంది..
ఈ హాడావుడి విన్న జగతి..అక్కయ్యని అలా వదిలేయకూడదు ఓసారి వెళ్లి చూడు ధరణి అంటుంది. ఇంకేం ఉంటుంది జగతి ఆవిడ కడుపుమంట ఇక్కడి వరకూ వాసన వస్తోంది అంటాడు మహేంద్ర.
Also Read: ఒకే బస్సులో దీప-శౌర్య ప్రయాణం, డాక్టర్ బాబు పిలుపువిని పరవశించిన వంటలక్క
దేవయాని రూమ్ కి వెళుతుంది ధరణి..అత్తయ్య గారూ అని పిలుస్తుంది..
దేవయాని: నేను ఎలా ఉన్నానో సర్వే చేయడానికి వచ్చావా..నువ్వెందుకు వచ్చావో..నిన్నెవరు పంపించారో తెలుసు..వెళ్లు అవతలకి అంటుంది
బయటకు వచ్చిన ధరణితో ఏమైందని జగతి అడుగుతుంది..అత్తయ్య చాలా చిరాగ్గా ఉన్నారు ఆవిడ ఆరోగ్యం ఏమవుతుందో అని టెన్షన్ గా ఉంది..డాక్టర్ ని పిలుద్దాం అనుకుంటారు. ఇంతలో కోపంగా బయటకు వస్తుంది దేవయాని..
దేవయాని: నన్ను మూలన పడేసి రోగిష్టి అని ప్రచారం చేసి తలుపుకి లాకేద్దాం అనుకుంటున్నావా..., రిషి పెళ్లి తప్పిపోయిందని సంతోష పడుతున్నారా... ఏం మహేంద్ర మాట్లాడవేంటి, సాక్షితో రిషి పెళ్లి అయినా కాకపోయినా బాధలేదు.. ప్రేమించిన వసుధార మోసం చేసింది,సాక్షి చివరి వరకూ ఉండి నచ్చలేదని చెప్పి వెళ్లిపోయింది..ఈ విషయంలో మీరంతా సంబరాలు చేసుకుంటున్నారు కానీ రిషి ఎంత బాధపడుతున్నాడో ఆలోచించారా...ఎంతసేపూ ఎవరిది గెలుపు, ఎవరిది ఓటమి అని ఆలోచిస్తున్నారు..మీరేదే గెలిచారని సంబరాలు చేసుకోకండి..నా మనసు బాధపడేది రిషి కోసం... అసలు మీ ఇద్దరి వల్లే రిషి కుమిలిపోతున్నాడు..ఇప్పుడు వసుధార వద్దంది, సాక్షి వద్దంది..తను ఏమైపోతాడో ఆలోచించారా... జగతి నువ్వు ఇంటికి వచ్చావని సంబరపడుతున్నావ్ కానీ రిషి గురించి ఎప్పుడైనా ఆలోచించావా అనేసి రూమ్ లోపలకు వెళ్లి తలుపేసుకుంటుంది...
జగతి: అక్కయ్య అన్నట్టు ఇందులో నా తప్పేమైనా ఉందా..
మహేంద్ర: వదిన గారి గురించి నీకు తెలియదా..ఆవిడ ఎప్పుడైనా ఇలాగే మాట్లాడుతుంది కదా..
ధరణి: రిషి దృష్టిలో దేవతలా నటించే ఆవిడ కుటిల ప్రయత్నాలు ఎప్పుడో అప్పుడు తెలుస్తాయి...అప్పటి వరకూ మనం ఎదురుచూడాలి..
మహేంద్ర: మన ప్రమేయం లేకుండా సాక్షి పెళ్లి ఎలా తప్పిపోయిందో..వదిన గారి నిజస్వరూపం కూడా అలాగే తెలుస్తుందని ఆశిద్దాం...
Also Read: నిశ్చితార్థం పీటలపై వసుని పక్కన కూర్చోమన్న రిషి, సాక్షికి షాకుల మీద షాకులిచ్చిన ఈగో మాస్టర్
కారు ఓ చోట ఆపిన రిషి..వసుతో దిగు అంటాడు..
రిషి: జరిగినదానిగురించి ఏమనుకుంటున్నావ్
వసు: ప్రశ్నలేవీ లేవు..అన్నింటికీ సమాధానాలు దొరికాయ్..
రిషి: నీకు చెప్పకుండా నీ పేరు వాడుకుంటున్నా అనుకుంటున్నావా... దానికి
వసు: సారీ చెబుతారా..అలాంటివేమీ వద్దు..జరిగిన మంచి పనికి ఇన్ డైరెక్ట్ గా ఉపయోగపడ్డాను
రిషి: సాక్షి దగ్గర జరిగిన విషయాల్లో నేనేమీ కావాలని చేయలేదు
వసు: మీరు నాకు సంజాయిషీ ఇవ్వడం ఏంటి సార్..
రిషి: ఒక్కోసారి సంజాయిషీ ఇవ్వాల్సి వస్తుంది.. సాక్షి నాకు దూరమైందని ఆశ్చర్యం లేదు..తనునా దగ్గర ఎప్పుడుందని దూరమవడానికి..సాక్షి దూరమైంది కదా అని కొత్త ప్రశ్నలు వేసి నిన్ను ఇబ్బంది పెట్టను..జీవితంలో చాలామంది క్లారిటీ లేకుండా ఉంటారు..చాలా తక్కువ మంది క్లారిటీతో జీవిస్తుంటారు..వాళ్లని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది... ఏదేమైనా నేను గెలిచాను వసుధారా..
వసు: నేను కూడా సార్ అంటుంది..
రిషి: రెస్టారెంట్ కే కదా వెళ్లేది..పద వెళదాం..
జగతి అండ్ కో మొత్తం రెస్టారెంట్లో ఉంటారు. మహేంద్ర,గౌతమ్ సందడి చూసి జగతి కూడా హాయిగా నవ్వుతుంది. సాక్షి గొడవ పోయిందంటే ఇదింకా నేను నమ్మలేకపోతున్నా అంటాడు గౌతమ్. ఇంత చేసిన సాక్షి తనంతట తాను వద్దనుకుని వెళ్లడం నిజంగా ఆశ్చర్యమే..నాకైతే రెండు మూడు తీన్మార్ స్టెప్పులేయాలని ఉందంటాడు మహేంద్ర. కేక్ కట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకుందామా అని అడిగిన గౌతమ్..కేక్ కట్ చేసి అందరికీ పంచుదాం అంటాడు. ఎందుకీ కేక్ అని అడిగితే ఏం చెబుదాం అన్న జగతి..ఓ మంచి జరిగిందని చెప్పండి అని సలహా ఇస్తుంది... అప్పుడే ఎంట్రీ ఇస్తారు వసుధార,రిషి... వీళ్లిద్దరూ ఎప్పుడు కలిశారో అనుకుంటారు...
రేపటి( బుధవారం) ఎపిసోడ్ లో
వదినా కాఫీ కావాలని అడుగుతాడు రిషి..కాఫీ ఇమ్మంటారా సార్ అని అడుగుతుంది జగతి... మేడం ఇకనుంచి మీరు నన్ను రిషి సార్ అని పిలవకండి..రిషి అనే పిలవండి అంటాడు. కాఫీ అనగానే..ఇస్తాను రిషి అని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది జగతి...
Nindu Noorella Saavasam November 29th Episode: చిత్రగుప్తుడి మాటలకు కంటతడి పెట్టుకున్న అరుంధతి.. మనోహరికి చీవాట్లు పెట్టిన అమరేంద్ర!
Naga panchami November 28th Episode : నన్ను కాటేసి చంపేది నువ్వే.. పంచమికి షాక్ ఇచ్చిన మోక్ష!
Krishna Mukunda Murari promo: కృష్ణని పేరు పెట్టి పిలిచిన మురారి.. గతం గుర్తుకురావడంతో టెన్షన్ పడుతున్న ముకుంద!
Brahmamudi Promo: కావ్య రాజ్ ముందు అడ్డంగా బుక్కైనా రాహుల్.. రేపటి ఎపిసోడ్లో రుద్రాణికి చుక్కలే!
Guppedantha Manasu Promo: రిషిధార అభిమానులకు పండుగలాంటి ఎపిసోడ్.. రిషి వసు మధ్య సూపర్ సీన్!
Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!
Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్
Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి
/body>