Guppedanta Manasu Serial Today June 13th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: వసుధార కిడ్నాప్.. ఎంట్రీ ఇచ్చిన రిషి, రౌడీలకు దబిడి దిబిడి - గతం గుర్తుందా?
Guppedanta Manasu Today Episode: కాలేజీ విడిచి వెళ్లిన వసుధారను కొంత మంది రౌడీలు కిడ్నాప్ చేసి చంపబోతుంటే రిషి ఎంటర్ అవుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
Guppedanta Manasu Serial Today Episode: వసుధార రిజైన్ చేసి వెళ్లిపోవడంతో శైలేంద్ర హ్యాపీగా యండీ చాంబర్‌లోకి వెళ్లి చూస్తాడు. అక్కడ యండీ సీటు ఖాళీగా ఉంటుంది. లోపలికి వెళ్లి హ్యాపీగా ఫీలవుతాడు. నేను చూస్తుండగానే ఈ సీటులో ముగ్గురు కూర్చుని వెళ్లిపోయారు. అని చూస్తుండగానే అక్కడ టేబుల్ మీద ఒక లెటర్ కనిపిస్తుంది. అది తీసుకున్న శైలేంద్ర లెటర్ చదివి షాక్ అవుతాడు. ఈ లెటర్ నేను చూశాను కాబట్టి సరిపోయింది. లేకుంటేనా? అనుకుంటూ లెటర్ తీసి జేబులో పెట్టుకుంటాడు. మరోవైపు మహేంద్ర, అనుపమ, మను ముగ్గురు వసు కోసం కాలేజీలో వెతుకుతుంటారు. ఇంతలో వసు తాను దూరంగా వెళ్లిపోతున్నట్లు మహేంద్రకు వాయిస్ మెసెజ్ చేస్తుంది. ఆ మెసేజ్ విన్న మహేంద్ర బాధపడతాడు.
మహేంద్ర: అమ్మా వసుధార ఎందుకిలా చేశావు. వసుధార ఎందుకిలా చేసింది అనుపమ.
అనుపమ: కంగారుపడకు మహేంద్ర వసుధారకు ఏం కాదు.
మహేంద్ర: ఏం కాదు అంటావేం అనుపమ.. వాయిస్ మెసెజ్ ఏం పెట్టిందో తెలుసుగా..
శైలేంద్ర: వసుధార ఎంత పని చేసింది. కొంపదీసి ఏ అఘాయిత్యమో చేసుకోదు కదా?
మహేంద్ర: ఏయ్ నోరు మూయ్ అపశకునం మాటలు మాట్లాడతావేంటి?
శైలేంద్ర: నేను ఏమన్నాను బాబాయ్ తను చెప్పిందే కదా నేను అన్నాను.
మహేంద్ర: అపశకునం మాటలు మాట్లాడకు.. మను ఒకసారి వసుకు ఫోన్ చేయ్..
అని మహేంద్ర చెప్పగానే మను ఫోన్ చేస్తాడు. వసు ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో అక్కడే ఉన్న అటెండర్‌కు కాలేజీ సరౌండింగ్‌లో వెతకమని చెప్తాడు మహేంద్ర. అయితే పోలీస్ కేసు పెడదామని శైలేంద్ర చెప్పగానే మహేంద్ర అదేం వద్దని తిట్టి.. శైలేంద్రకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి ముగ్గురు వెళ్లిపోతారు. అయితే నాకు కావాల్సింది కూడా అదే బాబాయ్ మీరు కేసు పెడితే పోలీసులు ఆ వసుధారను వెతికి తీసుకొస్తారు. అది జరగకూడదు. కాబట్టి వసుధారను కూడా లేకుండా చేస్తే అయిపోతుంది అని శైలేంద్ర మనసులో అనుకుంటాడు. మరోవైపు ఒక చెట్టు దగ్గర ఉన్న దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ వసుధార, రిషిని గుర్తు చేసుకుంటుంది. రిషి సార్ ఎక్కడున్నాడు అని మొక్కుతుంది. ఇన్నాళ్లు అందరూ సర్ లేడని అంటున్నా నేను మాత్రం సర్ బతికే ఉన్నాడని నమ్మాను కానీ ఎక్కడ అమ్మా రిషి సార్ అని దేవుడిని వేడుకుంటుంది. ఇంతలో కొంతమంది రౌడీలు వసుధారను కిడ్నాప్ చేసి శైలేంద్రకు ఫోన్ చేసి కిడ్నాప్ చేసిన్నట్లు చెప్తారు. దీంతో శైలేంద్ర హ్యాపీగా ఫీలవుతాడు. వసుధారను చంపేయమని చెప్తాడు. సరేనని చెప్పి రౌడీలు వసుధారను తీసుకెళ్తారు. అక్కడ కొంతమంది రౌడీలు గుంత తీస్తుంటారు.
రౌడీబాస్: ఏరా అయిపోయిందా?
రౌడీ: అయిపోయింది అన్నా
రౌడీబాస్: ఈ దరిదాపుల్లో ఎవరూ లేరు కదా?
రౌడీ: లేరన్నా.. ఎవరూ రారు కూడా..
రౌడీ బాస్: వెళ్లి దాన్ని తీసుకురండి..
అని మాట్లాడుకుంటుడగా కారులోంచి వసుధార పారిపోతుంది. రౌడీలు వసుధారను పట్టుకోవడానికి వెనకాలే పరుగెత్తుతారు. చాలా దూరం పరిగెత్తిన తర్వాత రౌడీలు వసుధారను చుట్టుముడుతారు. రౌండప్ చేసి ఇంకెక్కడికి పారిపోతావని బెదిరిస్తారు. ఇంతలో వాళ్లను తోసేసి వసుధార పారిపోతుంది. ఇంతలో రిషి లాగే ఉన్న ఆటోడ్రైవర్ వచ్చి రౌడీలను కొడతాడు. అతన్ని చూసిన వసుధార షాక్ అవుతుంది. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. రిషి మాత్రం వసుధారను గుర్తుపట్టనట్టుగానే రౌడీలను కొడుతుంటాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: శివాజీకి వాళ్లు వార్నింగ్ ఇచ్చారా? ఎన్నికల ఫలితాలకు ముందే వైసీపీ ఓటమిపై వ్యాఖ్యలు, అవే నిజమయ్యాయిగా!