Guppedanta Manasu Serial Today July 1st: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: శైలేంద్రకు వార్నింగ్ ఇచ్చిన మను – రంగాతో వసుధార చాలెంజ్
Guppedanta Manasu Today Episode: రంగా దగ్గరకు వచ్చి నువ్వే నా రిషి సార్ అని నీ నోటితోనే చెప్పేలా చేస్తానని వసుధార చాలెంజ్ చేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Guppedanta Manasu Serial Today Episode: రౌడీలు ఈపాటికే మను గాన్ని చంపి ఉంటారని శైలేంద్ర హ్యాపీగా ఫీలవుతుంటాడు. ఇంతలో మను అక్కడకు వస్తాడు. మనును చూసిన శైలేంద్ర షాక్ అవుతాడు. వీడు చనిపోలేదా? ఇంకా బతికే ఉన్నాడా? అని మనసులో అనుకుంటాడు. ఏంటి షాక్ అయ్యావా? ఇంకా బతికే ఉన్నాడని ఆశ్యర్యపోతున్నావా? నువ్వే కాదు.. నీ తల్లో జేజమ్మ దిగొచ్చినా కూడా నన్ను కాదు కదా నా కాలి గోటిని కూడా టచ్ చేయలేరు అంటాడు మను. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు బ్రదర్ నీకేమైనా మతి భ్రమించిందా? అని శైలేంద్ర అనగానే రౌడీలను చూపిస్తాడు మను. వాళ్లను పంపించింది నువ్వే కదా అనగానే..
శైలేంద్ర: నేనే పంపించాను అయితే ఏంటి ఇప్పుడు
మను: ఏం లేదు. నువ్వు చేయాల్సింది నువ్వు చేశావు. ఇప్పుడు నేను చేయాల్సింది నేను చేస్తాను.
శైలేంద్ర: నువ్వు నన్ను ఇక్కడ ఏం చేయలేవు బ్రదర్. నువ్వు నా దారికి అడ్డొస్తున్నావు. మర్యాదగా అడ్డు తప్పుకో.. ఈసారికి మిస్ అయ్యింది. ప్రతిసారి మిస్ అవ్వదు. ప్రాణాల మీద ఆశ ఉంటే నా మాట విను.
మను: నీలాగా దొంగదెబ్బ కొట్టే వాణ్ణి కాదు నేను ఏదైనా స్ట్రెయిట్‌గా ఫేస్ చేసే సత్తా ఉన్నోణ్ని .
ALSO READ: లంగా వోణి వేసిన ఆషికా రంగనాథ్ - చూస్తే మతిపోవాల్సిందే..!
అనగానే శైలేంద్ర అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా అని అడగ్గానే నువ్వు నా మీద అటాక్ చేయించావని ఫణీంద్ర సార్ కి కంప్లయింట్ ఇవ్వడానికి వచ్చానని చెప్పడంతో నువ్వు చెప్పగానే మా డాడ్ నమ్ముతాడా అని శైలేంద్ర అనగానే.. ఆ రౌడీలు చెప్పినా మీ నాన్న నమ్మరా అని మను అనగానే శైలేంద్ర షాక్ అవుతాడు. చెప్పొద్దని మనును బతిమాలుతాడు. చెబితే ఆయన నన్ను చంపేస్తాడని ఇక నేను నీ జోలికే రానని బతిమాలుతాడు. ఇంతలో ఫణీంద్ర మనును చూసి పలకరిస్తాడు. ఎందుకొచ్చావని అడగ్గానే క్యాజువల్‌గానే వచ్చానని చెప్పడంతో ఫణీంద్ర వెళ్లిపోతాడు. తర్వాత మను, శైలేంద్రకు వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. మరోవైపు రంగ ఆలోచిస్తూ ఉంటే వసుధార వస్తుంది.
రంగ: ఏంటి మేడం గారు ఇలా వచ్చారు. ఏదైనా మాట్లాడాలా? మరెందుకు మేడం ఈ చలిగాలిలో చక్కగా వెళ్లి పడుకోవచ్చుగా
వసుధార: పడుకుందామనే అనుకున్నాను. కానీ నిద్ర పట్టలేదు. మిమ్మల్ని ఇలా చూసి మీ దగ్గరకు రావాలనిపించింది.
రంగ: అదేంటి మేడం.
వసుధార: రిషి సార్ కూడా ఇలానే వెన్నెల్లో కూర్చోవడానికి ఇష్టపడేవారు. ఇలాగే చందమామను చూస్తూ తన ఫీల్సింగ్స్ చెప్తుండేవారు.
రంగ: నేను ఏం చేసినా మీ రిషి సార్ ఇలాగే చేస్తుంటారు అంటున్నారు. ఇంకా చెప్పండి మేడం మీ రిషి సార్ ఏం చేసేవారో
వసుధార: ఎందుకు సార్ అలా మాట్లాడతారు. నేను చెప్పింది కరెక్టు కాదా? ఆ విషయం మీకు తెలియదా?
రంగ: ఎందుకు మేడం గారు నేను మీకు రిషి సార్ అనిపిస్తుందేమో.. మీ మనసుకు అలా అనిపిస్తే నేనేం చేయలేను. కానీ నా ముందు మాత్రం అలా మాట్లాడకండి నాకు ఇబ్బందిగా ఉంటుంది. అసలు మీ రిషి సార్ ఏం చేస్తుంటారు.
అని రంగ అడగ్గానే రిషి గురించి చాలా గొప్పగా వసుధార చెప్తుంది. సర్ ఏం చేసినా నా కోసమే చేసేవారు. నా ముఖంలో చిన్న బాధ కనిపించినా కానీ రిషి సార్ విలవిలలాడిపోతారు. అని చెప్పగానే నన్ను మీ రిషి సార్‌తో పోల్చి ఆయనను తక్కువ చేయోద్దని రంగ చెప్తాడు. దీంతో మీరు రిషి సార్ అని మీ అంతటా మీరే చెప్పేలా చేస్తానని వసుధార అంటుంది. రంగ గుడ్‌నైట్ చెప్పి వెళ్లిపోతాడు. తర్వాత రంగ ఆటో తీసుకుని బయటకు వెళ్తుంటే వసుధార వచ్చి తనకు కొన్ని బట్టలు కావాలని షాపింగ్ చేద్దామని అడుగుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.