అన్వేషించండి

Guppedanta Manasu Serial Today August 7th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: ఇంటికి వెళ్లిపోతానన్న మహేంద్ర – కాలేజీకి వెళ్లిన రిషి, వసుధార

Guppedanta Manasu Today Episode: ఎండీ సీటు కోసం దేవయాని కొత్త ప్లాన్ చెప్పడంతో ఇప్పుడే కాలేజీకి వెళ్లి ప్లాన్ అమలు చేస్తానని శైలేంద్ర వెళ్లిపోవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Guppedanta Manasu  Serial Today Episode:  మహేంద్ర తన ఇంటికి వెళ్లిపోతానని ఫణీంద్ర చెప్తాడు. అయితే నీకేం ప్రాబ్లమ్‌ ఉంది ఇక్కడ అందరం కలిసే ఉందామని చెప్తాడు ఫణీంద్ర. మీరు వెళ్లిపోతే ఈ ఇంటి కళ పోతుంది. ఇంట్లో సందడి ఉండదు. అంటాడు. దేవయాని కూడా ఇక్కడే ఉండండి మహేంద్ర అంటుంది. దీంతో మహేంద్ర లేదు వదిన గారు మీరు ఎంత చెప్పినా నా మనసు ఇక్కడ ఉండటానికి ఓప్పుకోవడం లేదంటాడు. శైలేంద్ర మాత్రం అక్కడికి వెళ్తే రంగా పరిస్థితి ఏంటని మనసులో అనుకుంటాడు. ఇంతలో రిషి, వసుధార వస్తారు.

మహేంద్ర: అమ్మా వసుధార అన్నయ్య వాళ్లు మనల్ని ఇక్కడే ఉండమంటున్నారు. ఉందామా?

వసుధార: మీరు ఏమనుకుంటున్నారు మామయ్యా..

మహేంద్ర: నీ ఇష్టం వసుధార. నువ్వు ఎక్కడికి వెళ్దాం అంటే అక్కడికి వెళ్దాం

వసుధార: నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు మావయ్య. కాలేజీ నుంచి వచ్చాకా సాయంత్రం ఇక్కడి నుంచి వెళ్లిపోదాం

 అని చెప్పి వసుధార, రిషి వెళ్లిపోతారు. సారీ అన్నయ్యా. వసుధార ఇష్టాన్ని నేను కాదనలేను. ఏ విషయంలో అయినా తన ఇష్టప్రకారమే నడుచుకుంటాను అని మహేంద్ర చెప్పి వెళ్లిపోతాడు. మీరు మౌనంగా ఉంటారేంటీ. ఆర్డర్ వేస్తే ఇక్కడే ఉంటారు కదా అని దేవయాని అంటుంది. మరోవైపు రిషి, వసుధార తిరిగి వచ్చారని ఎంజేల్‌ సంతోషిస్తుంది. మను, అనుపమను కాలేజీకి వెళ్దామని అడుగుతుంది. నేను, నా కొడుకు ఆ కాలేజీకి రాలేమని.. కావాలంటే నువ్వు  వెళ్లు అని అనుపమ చెప్తుంది. మరోవైపు శైలేంద్ర బీపీ చెక్ చేసుకుంటాడు.

దేవయాని: శైలేంద్ర  ఏమైంది అలా ఉన్నావు.

శైలేంద్ర: నేను ఎండీ కాకుండానే చనిపోతానని అనిపిస్తుంది మామ్‌. నాకు ఇంతకుముందు వచ్చిన పీడకలలు అన్ని నిజమయ్యాయి. ఇది కూడా నిజమైపోతుందని భయమేస్తుంది. గుండె పట్టేసినట్లు అవుతుంది.

దేవయాని: అదంతా పక్కన పెట్టి ఆ రంగా గాడు ఏం చేయాలి ఎలా చేయాలి అనేది ఆలోచించు.

శైలేంద్ర: నా మైండ్ బ్లాక్ అయింది. నువ్వే ఆలోచించు మామ్‌.

అనగానే శైలేంద్రకు దేవయాని కొత్త ప్లాన్ చెబుతుంది. వావ్.. చాలా మంచి పాయింట్ పట్టావ్ మమ్మీ. ఇక చూడు నేను కాలేజీలో రెచ్చిపోతాను అంటాడు శైలేంద్ర. ఇప్పుడే కాలేజీకి వెళ్లి మన ప్లాన్ అమలు చేస్తాను. దెబ్బకు అంతా మన దగ్గరికి రావాల్సిందే. ఎండీ సీటు మనకు కట్టబెట్టాల్సిందేనని శైలేంద్ర వెళ్లిపోతాడు.  మరోవైపు కాలేజీలో తమ క్యాబిన్‌లోకి వెళ్తారు రిషి, వసుధార.

రిషి: ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. నువ్వు నా మాట కాదనవని నాకు తెలుసు.. ఇది చూస్తేంటే ఎన్నో జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి వసుధార.

వసుధార: నేను బాధలో ఉన్నప్పుడు దీన్నే చూసుకుంటూ గడిపేదాన్ని సర్

అని వసుధార చెప్పగానే ఇద్దరు మొదటిసారి కలిసింది. డ్యాన్స్ చేసింది. రిషి ప్రపోజ్ చేసింది. ఇద్దరూ కలిసి ప్రేమించుకుంది. గుర్తు చేసుకుంటారు. మొదటి నుంచే నీపై కోపం, ద్వేషం ఉండేది. అది ప్రేమతో ఉన్న కోపమేనేమో. నువ్ ఒక్కరోజు కనిపించకపోయినా నాకు మనశ్శాంతిగా ఉండేది కాదు. నువ్ కనిపిస్తే ఏదో ఒక ఎమోషన్ చూపించేవాన్ని. చివరికి అది ప్రేమ అని అర్థం చేసుకున్నాను. అప్పటికీ అమ్మ నాతో అంది నీ మీద నాకు ఉన్నది ప్రేమ అని. నేనే వినిపించుకోలేదు అని రిషి చెబుతాడు. తర్వాత నువ్వు వర్క్ చూసుకో నేను కాలేజీ చూసి వస్తాను. చాలా రోజులు అయింది కదా అని రిషి వెళ్లిపోతాడు. దీంతో ఇవాళ్టీ  ఎపిసోడ్ అయిపోతుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Jio Airtel Best Plans: కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
Embed widget