Guppedanta Manasu Serial Today August 12th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: మహేంద్రకు నిజం చెప్పమన్న వసు – శైలేంద్రకు షాక్ ఇచ్చిన రిషి
Guppedanta Manasu Today Episode: మహేంద్ర ఇంటికి వచ్చిన అనుపమను సార్ కు ఇద్దరు కొడుకులు అన్న నిజం చెప్పమని వసుధార చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Guppedanta Manasu Serial Today Episode: రిషి, వసుధార తిరిగి వచ్చారని హ్యాపీగా ఫీలవుతూ మహేంద్ర, వసుధార రిజైన్ చేసి వెళ్లిపోయాక కాలేజీతో జరిగిన విషయాలు చెప్తుంటాడు. శైలేంద్ర చేసిన చిల్లర పనులు, దేవయాని పన్నిన కుట్రలు, మను వెళ్లిపోవడం అన్ని చెప్తూ ఇప్పుడు మీరిద్దరూ వచ్చారు ఇక అంతా హ్యాపీ అంటాడు. ఇక కాలేజీకి ఎలాంటి సమస్యలు రావని ఊపిరి పీల్చుకుంటాడు మహేంద్ర. అయితే వసుధార మాత్రం తాను ఎండీగా ఉండనని బాంబు పేలుస్తుంది. దీంతో మహేంద్ర షాక్ అవుతాడు. రిషి కూడా ఎందుకు అంత గట్టి నిర్ణయం తీసుకున్నావు అని అడుగుతాడు.
వసుధార: నేను ఓసారి ఎండీగా రిజైన్ చేశాను. నేను ఎండీగా ఉండను. ఇది నా నిర్ణయం.
రిషి: నీ నిర్ణయం మార్చుకోవా. నేను అడిగినా మార్చుకోవా?
వసుధార: క్షమించండి సార్. నేను నా నిర్ణయం మార్చుకోను. నా భయాలు నాకు ఉన్నాయి.
రిషి: ఏంటీ పొగరుకు కూడా భయమా? రాజీవ్ పెళ్లి విషయంలో ఎంత ధైర్యంగా ఉన్నావు. నేను చనిపోయానని అంతా నమ్మిన నువ్వు నమ్మలేదు. నేను రంగా అంటున్నా నీ కళ్లల్లో ఎలాంటి భయం, బెరుకు చూల్లేదు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా భయపడలేదు. ఇప్పుడు నీకేంటి భయం.
వసుధార: మీకోసమే ఎండీ పదవి వద్దంటున్నాను. నాకు పదవి ఇచ్చి మీరు వెళ్లిపోతారేమోనని భయంగా ఉంది.
రిషి: ఇకనుంచి నీ కళ్లలో ఒక్క కన్నీటి చుక్క రాకుండా చూసుకుంటాను.
వసుధార: మీరు నాకు ఒక మాట ఇవ్వండి. మీ విషయంలో నేను ఏ నిర్ణయం తీసుకున్నా మీరు కాదనని
అని అడగ్గానే రిషి సరేనని ఇంతకీ ఏ నిర్ణయం అని అడుగుతాడు. టైం వచ్చినప్పుడు చెప్తానని వెళ్తుంది వసుధార. మరోవైపు ధన్‌రాజ్‌కు సరోజ కాల్ చేస్తుంది. మీరు మా ఊరు చూశారు. నేను మీ ఊరు చూడొద్దా..? అంటుంది. దీంతో ధనరాజ్ నువ్వు హైదరాబాద్ వచ్చి ఫోన్ చేయ్ అంతా నేను చూసుకుంటాను అని ఫోన్ కట్ చేస్తాడు. హైదరాబాద్ వెళ్లి ఎలాగైనా బావను కలవాలి. లేకుంటే వసుధార బావను మాయం చేస్తుంది. అని మనసులో అనుకుంటుంది సరోజ. మరోవైపు రిషికి శైలేంద్ర కాల్ చేస్తాడు.
శైలేంద్ర: నువ్ నిజంగానే రంగావా. లేదంటే నిజంమైన రిషివా?
రిషి: క్యారెక్టర్‌లో ఉన్నాను కదా సార్ అందుకే రిషిలా మారిపోయాను.
శైలేంద్ర: ఇప్పుడు నువ్వెక్కడ ఉన్నావ్
రిషి: నీ భయం నాకు అర్థమవుతుంది అన్నయ్య. నేను ఇటు నుంచి ఇటే మా ఊరికి వెళ్లిపోతాను అనుకుంటున్నారు కదా. వీళ్లు నన్ను వదిలేలా లేరు.
శైలేంద్ర: నువ్ రిషిలా ఉందామని ఫిక్స్ అయిపోయావా?
రిషి: ఛీ ఛీ.. నాకు నా వాళ్లు ఉన్నారు. మా నానమ్మ నాకోసం బెంగపెట్టుకుందట. ఇంకా నటించడం నావల్ల కావట్లేదు. ఓపిక నశించింది.
శైలేంద్ర: ఇంక మూడు రోజులే. నీ పని అయిపోయాకా నిన్ను దగ్గరుండి పంపించేస్తాను.
రిషి: నీమీద నమ్మకం ఉంది కాబట్టే వీళ్లు నరకం చూపిస్తున్న భరిస్తున్నాను
శైలేంద్ర: ఇంతకీ రేపు ఏం చేస్తావ్..
అని శైలేంద్ర అడగ్గానే రేపు ఎండీని ప్రకటిస్తాను. అర్హత ఉన్నవాళ్లను ప్రకటిస్తాను అని రిషి అంటాడు. అర్హత ఏంట్రా అర్హత. నేను చెబుతుంది ఏంటీ.. నువ్ మాట్లాడేది ఏంటీ.. వసుధార వచ్చిందా. అందుకే నువ్ ఇలా మాట్లాడుతున్నావా? రేపు అర్హత ఉన్న నన్నే ఎండీగా ప్రకటిస్తున్నావు అని శైలేంద్ర ఫోన్ కట్ చేస్తాడు. మరోవైపు మహేంద్ర ఇంటికి అనుపమ వస్తుంది. అనుపమకు థాంక్స్ చెప్తాడు రిషి. మను గురించి అడుగుతాడు మహేంద్ర. పాత విషయాలు గుర్తు చేసుకుంటారు. ఇంతలో వసుధార వస్తుంది. అనుపమతో మెల్లిగా మావయ్యకు ఇద్దరు కొడుకులు అన్న నిజం తెలిసే సమయం వచ్చిందనిపిస్తుంది అంటుంది వసుధార. మీరేం మాట్లాడుకుంటున్నారో మాకు చెబితే మేము వింటాము కదా అని మహేంద్ర అడగడంతో అనుపమ, వసుధార కంగారు పడతారు. ఏం లేదని చెప్తారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.