Guppedanta Manasu Serial Today April 12th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: బోర్డు మీటింగ్‌లో వసును అవమానించిన దేవయాని – విశ్వాన్ని ఎందుకు కలిశావని మనును తిట్టిన అనుపమ
Guppedanta Manasu Today Episode: బోర్డు మీటింగ్ లో మనును కాకుండా వసును అవమానిస్తుంది దేవయాని దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది.
Guppedanta Manasu Serial Today Episode: శైలేంద్ర, రాజీవ్, దేవయానికి కాన్ఫరెన్స్ కాల్ చేసి మను కాలేజీకి వచ్చాడని చెప్తాడు. నువ్వు అడిగినప్పుడు రానన్నాడని చెప్పావు అని రాజీవ్ అడగ్గానే అవును నేను అడిగినప్పుడు రాను అన్నాడు మళ్లీ ఇప్పుడు వచ్చాడు అని శైలేంద్ర చెప్తాడు. దీంతో అయితే ఇప్పుడు మళ్లీ కాలేజీలో ఏం చేయబోతున్నారు అని దేవయాని అడుగుతుంది. బోర్డు మీటింగ్ పెడతారేమో అని శైలేంద్ర చెప్పడంతో అయితే పేరేంట్స్ మీటింగ్ కూడా పెడతారు అని దేవయాని అనడంతో అయితే వాడు మరోసారి అవమానం ఎదుర్కొంటున్నాడన్నమాట అని రాజీవ్ అంటాడు. అయితే చూడండి ఇంకొన్ని రోజుల్లో ఆ మను గాడిని ఇక్కణ్నుంచి తరిమేస్తాను అంటాడు శైలేంద్ర. నువ్వేమైనా చెయ్ భయ్యా నాకు మాత్రం నా మరదలు కావాలి అంటాడు. దేవయాని కూడా కాలేజీకి వస్తున్నాను అని చెప్తుంది. కాలేజీలో వసు, మను మాట్లాడుకుంటుంటారు.
వసు: కాలేజీకి వచ్చినందుకు చాలా థాంక్స్ మను గారు.
మను: రానని ఎందుకు అనుకున్నారు?
వసు: లాస్ట్ టైం బోర్డు మీటింగ్ లో కొంచెం ఇష్యూ అయ్యింది కదండి. మీరు చాలా హర్ట్ అయ్యి ఉంటారు కదా?
మను: నేను హర్ట్ అయిన మాట వాస్తవమే.. కానీ మనం దారిలో వస్తుంటే ఎన్నో కుక్కుల మొరుగుతుంటాయి. ఇంతకీ మీరు పిలిపించిన పర్పస్ పేరెంట్స్ మీటింగ్ గురించేనా?
వసు: అవునండి పేరెంట్స్ అందరికీ ఫోన్ చేసి వాళ్లు ఏ టైంలో అందుబాటులో ఉంటారో తెలుసుకుని అప్పుడు మీటింగ్ ఏర్పాటు చేద్దామనుకుంటున్నాను. మీరు కొంచెం హెల్ప్ చేయాలి.
మను: తప్పకుండా అన్నీ విషయాలు నేను చూసుకుంటాను. మీటింగ్ సక్సెస్ చేసే బాధ్యత నాది.
అంటూ మను వెళ్లిపోతాడు. తర్వాత బోర్డు మీటింగ్ జరుగుతుంది. దేవయాని మీటింగ్‌కు వస్తుంది. ఎందుకొచ్చావని ఫణీంద్ర అడుగుతాడు. ఇంట్లో బోర్ కొడుతుందని వచ్చానని చెప్తుంది. దీంతో ఫణీంద్ర తలపట్టుకుంటాడు.
వసు: ఈ కంప్యూటర్ డిపార్ట్ మెంట్ నుంచి ఎక్కువ మందికి అటెండెన్స్ తక్కువగా ఉంది కదా?
దేవయాని: అటెండెన్స్ తక్కువైందని మీటింగ్ పెట్టారా? ఏంటో నువ్వు ఎండీవి అయినప్పటి నుంచి అన్నీ విడ్డూరాలే జరుగుతున్నాయి. రిషి ఎండీగా ఉన్నప్పుడు ఇలాంటి సమస్య వచ్చిందా?
ఫణీంద్ర: దేవయాని ఇప్పుడవన్నీ ఎందుకు? ఇప్పుడు జరిగే మీటింగ్ గురించి మాట్లాడు.
అనగానే రిషి కాలేజీకి ఏ ప్రాబ్లమ్ రానివ్వలేదు అంటూ మన కాలేజ్‌ని టాప్‌లో నిలబెట్టేవాడని దేవయాని చెప్తుంది. ఫణీంద్ర ఇప్పుడు రిషి మాటర్ ఎందుకు అనగానే శైలేంద్ర కూడా రిషి గురించి వసుధారే పట్టించుకోవడం లేదని నువ్వెందుకు పట్టించుకుంటున్నావు అనగానే మను శైలేంద్రకు వార్నింగ్ ఇస్తాడు. దీంతో దేవయాని మనును తిడుతుంది. దీంతో ఫణీంద్ర, దేవయాని, శైలేంద్రను బటయకు వెళ్లండని పంపిస్తాడు. మీటింగ్ అయిపోయిన తర్వాత వసుధార నీకు దేవయాని, శైలేంద్ర గురించి తెలుసు కదా వాళ్లు ఏమన్నా పట్టించుకోకు అని చెప్తాడు ఫణీంద్ర. తర్వాత అనుపమ ఆలోచిస్తూ ఉంటుంది. వసు, మహేంద్ర, మనుని తీసుకుని ఇంటికి వస్తారు. అనుపమ కోపంగా చూస్తుంది.
మహేంద్ర: ఎంటి అనుపమ అలా చూస్తున్నావు. ఎవరో రాకూడని వ్యక్తి వచ్చినట్లు, తను నా కోసం వచ్చాడు. ఇంకో విషయం ఇవాళ కాలేజీకి కూడా వచ్చాడు. కొంత మంది లాగా పారిపోయే వ్యక్తి కాదు. అవును మను నువ్వేదే అనుపమను అడగాలనుకున్నావు.
మను: గాయం ఎలా ఉంది మేడం..
అనుపమ: తగ్గిపోయింది.
అనగానే వసు భోజనం రెడీ చేస్తానని లోపలికి వెళ్తుంది. మహేంద్ర కూడా డైనింగ్ టేబుల్ దగ్గర ఏదైనా అవసరం ఉంటే హెల్ఫ్ చేస్తానని లోపలికి వెళ్తాడు. వాళ్లిద్దరూ వెళ్లాక అనుపమ మా నాన్ను కలిశావంట అని మనును అడుగుతుంది. అనుకోకుండా కలిశానని మను చెప్తాడు. ఇంతలో వసు బోజనం చేయడానికి రమ్మని పిలుస్తుంది. అందరూ భోజనం చేస్తుంటారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మనిషి చనిపోయాక అలా మాట్లాడడం కరెక్ట్ కాదు - నటి జ్యోతిపై ఏవీఎస్ కుమారుడు ఆగ్రహం