Guppedanta Manasu December 25th Episode:వసుధార, అనుపమలను కాపాడిన అజ్ఙాత వ్యక్తి – రిషి డెడ్ బాడీ హాస్పిటల్లో ఉందని ఫోన్ చేసిన వార్డు బాయ్
Guppedanta Manasu Serial Today Episode: ఓ డెడ్ బాడీ పక్కన ఈ ఫోన్ దొరికిందని మీరు వెంటనే రావాలని వసుధారకు రిషి ఫోన్ నుంచి హాస్పిటల్ వార్డు బాయ్ కాల్ చేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఆసక్తికరంగా జరిగింది.
Guppedanta Manasu Telugu Serial Today Episode: వసుధార, అనుపమ కారులో వెళ్తుంటే కొందరు కిరాయి రౌడీలు వచ్చి కారును అడ్డగించి వసుధారను కత్తితో పొడిచి చంపాలనుకుంటారు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి కిరాయి రౌడీలతో ఫైట్ చేసి వసుధార, అనుపమలను సేవ్ చేస్తాడు. వసుధార ఆ వ్యక్తికి థాంక్స్ చెప్తుంది. అనుపమ కూడా మీరు చేసిన సాయానికి మీ రుణం ఎలా తీర్చుకోవాలో మాకు తెలియడం లేదంటుంది. దీంతో ఆ వ్యక్తి వంద రూపాయలు ఇవ్వండి అని వంద ఇవ్వగానే తీసుకుని వెళ్లిపోతూ.. వాళ్ల కారు టైర్ పంక్చర్ అయ్యిందని చూసి స్టెపినీ మారుస్తాడు. అనుపమ, వసుధార ఈ అటాక్ ఆ శైలేంద్రనే చేసి ఉంటాడని మాట్లాడుకుంటారు. శైలేంద్రకు వసుధార ఫోన్ చేస్తుంది. నెంబర్ చూసిన శైలేంద్ర ఇదేంటి వసుధార ఫోన్ నుంచి కాల్ వస్తుంది అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేస్తాడు. వసుధార కోపంగా హలో అంటుంది. అదేంటి వసుధార బతికే ఉందా? అంటూ షాక్ అవుతాడు శైలేంద్ర.
వసుధార: ఏం ఆలోచిస్తున్నావ్. ఈ టైంకి చనిపోయి ఉండాల్సింది ఎలా మాట్లాడుతుంది అని అనుకుంటున్నావా?
శైలేంద్ర: అయ్యో నేనెందుకు అలా అనుకుంటాను.
వసుధార: అలానే అనుకుంటావు. ఎందుకంటే మా మీద అటాక్ చేయించావు కదా?
శైలేంద్ర: అటాకా? మీ మీద అటాక్ జరిగిందా? అయ్యో ఎలా ఉన్నారు వసుధార. మీకేం కాలేదు కదా? బాగానే ఉన్నారు కదా?
అనగానే వసుధార సీరియస్‌గా శైలేంద్రకు వార్నింగ్ ఇస్తుంది. నా సంగతి తెలుసు కదా మొన్న చెంపదెబ్బతో వదిలేశాను. ఈ సారి మామూలుగా ఉండదు అంటూ ఫోన్ పెట్టేస్తుంది. వసుధార. దీంతో షాకింగ్‌గా శైలేంద్ర అటాక్ ఎలా మిస్సయ్యింది అంటూ ఆలోచిస్తుంటాడు. ఇంతలో కారు రెడీ అయ్యిందని అతను చెప్పగానే కారు ఎక్కడానికి వెళ్లబోతుంటే రిషి ఫోన్ నుంచి కాల్ వస్తుంది. ఎగ్జయిటింగ్ గా ఫోన్ లిఫ్ట్ చేసిన వసుధారకు షాక్ ఫోన్‌లో హాస్పిటల్ బాయ్ మాట్లాడతాడు. ప్రీతి హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తున్నామని ఈ ఫోన్ వ్యక్తి ఇక్కడే ఉన్నారని మీరు అర్జంట్‌గా రావాలని చెప్పడంతో కంగారుగా అనుపమ మహేంద్రకు ఫోన్ చేసి చెప్తుంది. అందరూ హాస్పిటల్‌కు వెళ్తారు.
మహేంద్ర: అనుపమ రిషి నెంబర్ నుంచి ఫోన్ రావడం ఏంటి? మరి రిషి ఏమయ్యాడు.
అనుపమ: అదే అర్థం కావడం లేదు మహేంద్ర. ఏదో ఐడెంటిఫికేషన్ అంటున్నారు.
వసుధార: మేడం అక్కడ అడుగుదాం. అంటూ అందరూ వెళ్లి రిసెప్షన్‌లో ఎంక్వైరీ చేస్తుంటే అక్కడకు పోలీసులు వచ్చి వసుధారను పేరు అడిగి ఈ ఫోన్ మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా చూశారా అని వసుధారకు ఇస్తారు.
వసుధార ఫోన్ తీసుకుని ఏడుస్తుండగా మహేంద్ర ఇది రిషి ఫోన్ అంటాడు. వసుధార కూడా ఇది నా భర్త ఫోన్ అని చెప్తుంది. దీంతో పోలీసులు ఈ ఫోన్ ఒక డెడ్ బాడీ దగ్గర దొరికింది. ఆ డెడ్ బాడీని మీరు ఐడెంటీఫై చేయాలి. అనగానే వసుధార గట్టిగా ఏడుస్తూ నేను చూడను అది నా భర్త డెడ్ బాడీ కాదు అంటుంది. పోలీసులు వారిని ఒప్పించి లోపలికి తీసుకెళ్తారు. భయం భయంగా లోపలికి వెళ్లిన వసుధార, మహేంద్ర, అనుపమ అక్కడ వేరే వాళ్ల డెడ్ బాడీ ఉండటంతో హ్యాపీగా ఊపిరి పీల్చుకుంటారు.
ఇంతలో వార్డు బాయ్ మరో బాంబ్ పేలుస్తాడు. ఆ ఫోన్ ఈ డెడ్ బాడీ దగ్గర దొరకలేదని ఆ డెడ్ బాడీ దగ్గర దొరికిందని మరో శవాన్ని చూపించడంతో అందరూ షాక్ అవుతారు. పోలీసులు వెళ్లి ఆ డెడ్ బాడీని కూడా చూడటంతో అది కూడా రిషి కాదని చెప్తారు. వసుధార ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతూ మరి రిషి ఎక్కడున్నాడో అనుకుంటుంది. అయితే పోలీసులు ఈ ఫోన్ అతని దగ్గరకు ఎలా వచ్చిందని అనుమానిస్తారు. ఇంతలో ఆ డెడ్ బాడీని మహేంద్ర ఎవ్వరూ చూడకుండా ఫోటో తీసుకుంటాడు. అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరోవైపు ఎక్కడో ఒక దగ్గర ఇద్దరు వృద్దులు రిషికి ప్రకృతి వైద్యం చేస్తుంటారు. ఉన్నటుండి రిషి వసుధార అని కలవరించడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.