Gunde Ninda Gudi Gantalu November 21st Episode: బంగారం దొంగతనంలో కీలక మలుపులు, మళ్లీ తప్పించుకున్న ప్రభావతి - గుండెనిండా గుడిగంటలు నవంబర్ 21ఎపిసోడ్!
Gundeninda GudiGantalu Today episode: బంగారం మాయం చేసిన ప్రభావతి...మీనాపై నింద వేసింది. దీంతో అసలు దొంగను పట్టుకునే పనిలో పడ్డారు బాలు మీనా.. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

గుండె నిండా గుడి గంటలు నవంబర్ 21 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2025 November 21th Episode
సగం ధరకే ఫర్నిచర్ అని రాజేష్ కాల్ చేస్తాడు.. ఎలాగూ మీ అన్నయ్య మనోజ్ డిస్కౌంట్ ఇవ్వడం లేదు కదా ..ఇక్కడ కొనుక్కుంటా నువ్వు రా అని పిలుస్తాడు. ఇప్పుడు రావడం కుదరదు అని బాలు చెబుతాడు. మనకు చాలా సహాయం చేశాడు..మీరు వెళ్లిరండి అంటుంది మీనా. సరే అని బాలు వెళతాడు.
ఫర్నిచర్ షాప్ బయటకు వచ్చినవారంతా..ఇంత తక్కువకు ఫర్నిచర్ దొరకడం చాలా బావుంది.. ఇంత తక్కువ ధరకు ఫర్నిచర్ దొరుకుతోందంటే ఎక్కడైనా అప్పుచేసి తీసుకొచ్చి అయినా కొనేవాడిని అనుకుంటారు. ఆ మాటలు విని లోపలకు వెళతారు రాజేష్, బాలు. అక్కడ ఫర్నిచర్ చూసి షాక్ అవుతారు. గతంలో మనోజ్ షాప్ లో చూసిన ఫర్నిచర్ అక్కడుంటుంది. ఆ సందేహం ఇద్దరికీ వస్తుంది కానీ ఏదో జరిగింది అనుకుంటారు. ఇంతలో పోలీసులు వచ్చి షాప్ లో ఉన్న అందర్నీ తీసుకెళ్లిపోతారు.
మోసపోయిన ఫర్నిచర్ షాప్ ఓనర్స్ కి కబురుపెట్టమని చెబుతారు పోలీసులు...ఆ లిస్ట్ లో మనోజ్ కూడా వస్తాడు. షాక్ అవుతాడు బాలు. మనోజ్-పోలీస్ మాట్లాడుకున్నదంతా వీడియో తీస్తాడు. ఇప్పుడు అర్థమైంది నాకు అనుకుంటాడు. తనను మోసం చేసింది ఎవరో క్లారిటీగా చెప్పేస్తాడు మనోజ్. ఇకనైనా జాగ్రత్తగా ఉండు అని పంపిస్తాడు పోలీస్. మనోజ్ వెళ్లిపోయిన తర్వాత...బాలు పోలీసులను రిక్వెస్ట్ చేస్తాడు... దొంగలు వాళ్లు అని చెప్పాడుగా మమ్మల్ని వదిలేయండి అంటాడు. పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా ఇంటికి వస్తాడు బాలు
ఇంటికి కోపంగా వచ్చి డోర్ లాక్ చేస్తాడు. అంతా అవాక్కై చూస్తుంటారు. ఇంతలో మీనా వచ్చి.. మీరు రాజేష్ కలసి బీరువా కొనేందుకు వెళ్లారు కదా అని అడుగుతుంది. అవును అందుకు వెళితేనే మన నగల గురించి బయటపడింది అంటాడు బాలు. 50శాతం డిస్కౌంట్ తో ఫర్నిచర్ అమ్మకం అనే బోర్డులు చూశావా అని ప్రభావతిని అడుగుతాడు బాలు. నేనేమైనా నీ పెళ్లాంలా బండిపై ఊరిమీద తిరుగుతున్నా అనుకుంటున్నావా అంటుంది. ఆయన అడిగితే సమాధానం చెప్పండి...తెలియకపోతే తెలియదు అని చెప్పండి..అంతేకానీ నా గురించి మీకెందుకు...నేను పార్కులో పల్లీలు తిన్నానా? గుడిముందు అడుక్కున్నానా? కష్టపడి పనిచేసుకుని బతుకుతున్నా అంటుంది.
పార్లలమ్మా వీడు లాభం వచ్చిందని చెప్పాడు కదా..అదెలా వచ్చిందో తెలుసా అంటాడు. ఫర్నిచర్ అమ్మితే వచ్చిందని చెప్పాడు కదా అని రోహిణి అంటుంది. అయినా వాళ్లగురించి ఏం మాట్లాడుతున్నావ్ అని ప్రభావతి ఫైర్ అవుతుంది...నువ్వు షాప్ కి వెళ్లు అంటుంది ప్రభావతి. అదేంటి అత్తయ్యా ఏమైనా బయటపడుతుందని ఆయన్ని ఇల్లు దాటించాలని చూస్తున్నారా అని ఫైర్ అవతుంది... ప్రభావతి షాక్ అయి ఆగిపోతుంది.
ఇదిగో ప్రూఫ్ అంటూ బాలు వీడియో చూపిస్తాడు... వీడు నీతో నాలుగు లక్షలు సంపాదించడం గురించి చెప్పాడు కానీ 4 లక్షలు పోగొట్టడం గురించి చెప్పాడా? లేదు కదా అని రోహిణిని క్వశ్చన్ చేస్తాడు బాలు.
వెంటనే ఫోన్ తీసి వీడియో ఓపెన్ చేస్తాడు... పోలీస్ స్టేషన్లో ఫర్నిచర్ పోయిన విషయం గురించి మొత్తం అర్థమయ్యేలా చెప్పేస్తాడు బాలు.
నష్టపోతే లాభం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అంటుంది శ్రుతి
మా ఆయన లక్ష లాభం తెచ్చారంటూ రోహిణి మొహంపై కొట్టినట్టు నోట్ల కట్టలు చూపించింది..అవెక్కడి నుంచి వచ్చాయ్ చెప్పండి అంటుంది మీనా
ఆ డబ్బు ఎక్కడిది అని రవి అడుగుతాడు రవి
డబ్బులు తేగానే నోట్లకట్టలు ఊపుకుంటూ వచ్చావ్ కానీ అవెలా వచ్చాయో అడిగావా రోహిణి అంటుంది మీనా
ఆ డబ్బులు మీనా బంగారం అమ్మితే తీసుకొచ్చావా అని మీనా అడుగుతాడు...
సత్యం లాగిపెట్టి కొడతాడు.. ఆ తర్వాత తన మోసం బయటపడుతుందనే భయంతో ప్రభావతి ఆవేశంగా ఆ డబ్బులు అప్పుచేశావా అని హింట్ ఇస్తూ కొడుతుంది. అవును పార్కులో ఫ్రెండ్ దగ్గర అప్పు చేశాను అని మరో అబద్ధం చెప్పేస్తాడు. ఇది మాత్రం నిజం అని గ్యారంటీ ఏంటి అంటుంది మీనా..ఇది నిజం అని కవర్ చేస్తాడు మనోజ్. వీడిలా తయారవడానికి కారణం నువ్వే అని ప్రభావతిపై ఫైర్ అవుతాడు సత్యం.
మొత్తానికి మళ్లీ తప్పించుకున్నారు ప్రభావతి-మనోజ్
వారణాసి నుంచి శివుడి ప్రపంచ సంచారం, SSMB29 లో మహేష్ క్యారెక్టర్ పై క్లారిటీ! 'సంచారి' పాటలో శివతత్వం!
'వారణాసి' ఈ పేరెలా వచ్చింది? అక్కడ ప్రత్యేకతలు , వింతలు ఏంటి? రాజమౌళి - మహేష్ సినిమాకు ఈ టైటిల్ ఎందుకు?
'వారణాసి' సినిమా టీజర్లో కనిపించిన 'చినమస్తా దేవి' ఎవరు? రాజమౌళి ఆమె గురించి ఏం చెప్పబోతున్నారు?






















