అన్వేషించండి

Gunde Ninda Gudi Gantalu November 20th Episode: వీడియోతో సహా మనోజ్ బాగోతం బయటపెట్టిన బాలు! ప్రభావతి రోహిణి ఇప్పుడు మాట్లాడండి - గుండెనిండా గుడిగంటలు నవంబర్ 20 ఎపిసోడ్!

Gundeninda GudiGantalu Today episode: బంగారం మాయం చేసిన ప్రభావతి...మీనాపై నింద వేసింది. దీంతో అసలు దొంగను పట్టుకునే పనిలో పడ్డారు బాలు మీనా..మనోజ్ దొరికేశాడు...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

గుండె నిండా గుడి గంటలు నవంబర్ 20 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2025 November 20th Episode

ఇంట్లోంచి మాయమైన బంగారం గుట్టు తేల్చాస్సిందే అని మీనా - బాలు పట్టుదలగా ఉంటారు. ఇద్దరూ కలసి శ్రుతికి కాల్ చేసి.. రవి పనిచేస్తున్న రెస్టారెంట్ దగ్గరకు రమ్మంటారు. నలుగురు అక్కడ కూర్చుని మీటింగ్ పెట్టుకుంటారు. ఆదివారం రోజే ఇదంతా జరిగి ఉండొచ్చు?  నా మొత్తం డౌట్ మనోజ్ పైనే అని బాలు తేల్చేస్తాడు. సాధారణంగా అత్తయ్యగారు ఇలాంటి తప్పుడుపనులు చేయరు కానీ.. పెద్ద కొడుక్కి సమస్య వచ్చిందంటే మాత్రం ఎంతకైనా తెగిస్తారని అంటుంది మీనా. ఆ గొడవంతా ఎందుకు అని రవి అనగానే..ఎందుకు వదిలేయాలి అని ఫైర్ అవుతుంది శ్రుతి. మీనా నగలు పోయాయి.. పైగా మీనా పుట్టింటివారిపై నిందవేశారు.. ముఖ్యంగా అవి మనింట్లోనే పోయాయ్ అంటుంది శ్రుతి. అయితే షాప్ కి కాల్ చేసి అడిగితే ఆ నగలు ఎవరు ఎప్పుడు కొన్నారో తెలుస్తుంది కదా అని బాలు అనడంతో...ఆ షాప్ ఏంటో మనోజ్ ద్వారానే చెప్పించాలని ఫిక్సవుతారు. 

కొడుకు కాల్ చేస్తే బయటకు వెళ్లి మాట్లాడుతుంటుంది రోహిణి.  వాడి పుట్టినరోజు ఉందని చెబుతుంది రోహిణి తల్లి. కుదిరితే వస్తాను లేదంటే డబ్బులు పంపిస్తాను అంటుంది. నీ డబ్బులు ఎవరికి కావాలి....వాడికి తల్లి కావాలి, నాకు కూతురు కావాలి ‌అని కాల్ కట్ చేస్తుంది. ఇంతలో మనోజ్ వచ్చి ఎవరు  అని అడిగితే...  ఏదో వేడుక ఉందని పిలిచేందుకు కాల్ చేశారని చెప్పేస్తుంది. 

మనోజ్ కి కాల్ చేస్తుంది శ్రుతి. సండే మీరు మా షాప్ లో కవరింగ్ నగలు కొన్నారు కదా...అందుకు మీకు బెనిఫిట్స్ ఇస్తున్నాం అంటుంది... వెంటనే స్పందించిన మనోజ్ నేను కొన్నానని మీకెలా తెలుసు అని అడుగుతాడు. ఎస్ సార్.. అంటూ మనోజ్ ఏమేం తీసుకున్నాడో లిస్ట్ చెబుతుంది. క్యాష్ రిటర్న్ బ్యాక్ చేస్తాం అంటుంది శ్రుతి. ఆఫర్ టెప్టింగ్ గా ఉంది.. కానీ ఏదో బుక్ చేసే వ్యవహారంలా ఉందే అని డౌట్ పడతాడు. గతంలో ఆశపడి డబ్బులు పోగొట్టుకున్నాను కానీ ఈసారి అలాంటి తప్పు చేయను అనుకుంటాడు. ఎవరు నువ్వు? ఆటలుగా ఉందా? అని ఫైర్ అవుతాడు రివర్స్ లో. ఇదేదో కొత్తరకం స్కామ్ లా ఉంది...మరోసారి కాల్ చేస్తే సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ ఇస్తా అని కాల్ కట్  చేస్తాడు. వాడు కొన్నాడు..కానీ నాటకాలు ఆడుతున్నాడు అంటాడు బాలు. ఇది మన గెస్ మాత్రమే అంటాడు రవి. వాడు అబద్ధం చెప్పాడు.. లేదంటే ఇదంతా మొదటే చెప్పేవాడు కదా అని ఫర్ అవుతాడు బాలు. వాడిని తంతా అనగానే..ప్రూఫ్ లేకుండా ఏమీ చేయకు అంటాడు రవి. 

 మీనా థ్యాంక్స్ చెబుతుంది... నీ నగలు అమ్మేసి ఆ ప్లేస్ లో గిల్ట్ నగలు పెట్టడం క్రైమ్..ఎప్పటికైనా క్రైమ్ బయటపడుతుంది అంటుంది శ్రుతి. ఇలాంటి కాల్స్ చేయకు అని రవి అనగానే...ప్రతి దానికి భయపడతావ్ ఎందుకు అని క్లాస్ వేస్తుంది. 

ఇంటికి కంగారుగా వచ్చిన మనోజ్... కాల్ వచ్చిన సంగతి, గిఫ్ట్ సంగతి ప్రభావతికి చెబుతాడు. బాలు మాట్లాడాడా? మీనా మాట్లాడిందా ? అని అడిగితే... ఇంగ్లీష్ లో మాట్లాడారు అంటాడు. అంటే వీళ్లిద్దరూ కలసి ఎవరితోనో కాల్ చేయించి ఉంటారు..నువ్వు నోరుజారకు...దొంగ దొరికేవరకూ వాడు వదలడు అంటుంది. నా మాట విని నువ్వు తొందరగా నగలు తీసుకొచ్చి ఇచ్చేయడం మంచిది...లేదంటే నిజం బయటపడితే ఈసారి ఊరంతా పరిగెత్తించి కొడతాడు అని వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి. వ్యాపారం సరిగా సాగడం లేదు...ఒకటీ అరా అమ్మినా వెంటనే రోహిణి లెక్కలు అడుగుతోందంటాడు. ఏం చేస్తావో తెలియదు..తొందరగా ఆ నగలు కొనే ప్రయత్నం చేయి ..ఈ విషయంలో నీతో చేతులు కలిపానని మీనాన్నకు తెలిస్తే నన్ను చంపేస్తారు అంటుంది. 

మన అనుమానమే నిజం...ఆ నిజం బయటపడేలా చేయాలి అంటాడు బాలు. వాడు ఏం చేసినా మా అమ్మ వెనకేసుకుని వస్తుంటుంది..ఈ సమస్యకు ముగింపు పెట్టాలి అనుకుంటారు. అమ్మ ఏం చేసినా అత్తకు చెబుతుంది..అందుకే  కామాక్షి అత్త ఏమైనా సాయం చేస్తుందేమో చూాడాలి అనుకుంటారు.  కామాక్షి ఇంటికి వెళతారు.. బామ్మ పుట్టినరోజుకి నువ్వు వచ్చావుకదా భోజనం చేశావా లేదా అని కుశలప్రశ్నలు వేస్తాడు. ఆ రోజు మీనా వంట చేసింది కదా తృప్తిగా తిన్నా అంటుంది.  టీవీ కూడా తెచ్చావ్ కదా అని అడిగితే...అవును తెచ్చాను అంటుంది. నువ్వు మీ నానమ్మకు ఇచ్చిన గిఫ్ట్ బాగా అనిపించిందని పొగుడుతుంది. నాకు ఆనందంగా లేదత్తా అంటాడు. ఈయన వాళ్ల నానమ్మకి బంగారం చైన్ కొనివ్వాలి అనుకున్నారు కానీ కుదర్లేదు అంటుంది మీనా....అవి కవరింగ్ వి కదా అని నోరు జారుతుంది  కామాక్షి. నీకెలా తెలుసు అంటే...మీ అమ్మ మాట్లాడతుంటే విన్నా అంటుంది. నిజం చెప్పబోయి కవర్ చేస్తుంది.  బాలు నిజం చెప్పించేందుకు ట్రై చేస్తాడు... ఇంతలో ప్రభావతి వస్తుంది...

మీరేంటి ఇక్కడున్నారని అడుగుతుంది... ఇంటికి వచ్చేదార్లో పళ్లు కొన్నాం ఇచ్చి వెళదాం అని వచ్చాం అంటుంది మీనా. తనేమైనా హాస్పిటల్లో ఉందా అని సెటైర్ వేస్తుంది. ఇంట్లో కొత్తకొత్తగా ఉంది కదా దాని గురించి మాట్లాడుతున్నా అంటాడు బాలు..దేని గురించి అనగానే...కవర్ చేస్తుంది మీనా. వాళ్లు ఎందుకు వచ్చారని  ప్రభావతి అడుగుతుంది. ఆ నగల గురించి తెలుసుకునేందుకు వచ్చారంటుంది. నిజం చెప్పేశావా అని అడిగితే చెప్పలేదు అంటుంది. 

అత్త నిజం చెప్పేసమయానికి అమ్మ అడ్డుపడింది అంటాడు బాలు. మన పాలిట ఇద్దరూ దొంగల ముఠాలా తయారయ్యారు అంటాడు బాలు. ఇంతలో బాలుకి రాజేష్ కాల్ చేసి.. మన కారు స్టాండ్ పక్కన 50% డిస్కౌంట్ ఆఫర్ తో ఫర్నిచర్ పెట్టారు...నువ్వు రా సెలెక్ట్ చేద్దుగానివి అంటాడు. వెళ్లమంటుంది మీనా.. మనకు పని ఉందని బాలు అంటే... తను మనకు సాయం చేశాడు...మీరు వెళ్లండి అంటుంది. అబద్ధం ఎంతోకాలం దాగదు...బయటపడుతుందిలే అంటుంది. 

వారణాసి నుంచి శివుడి ప్రపంచ సంచారం, SSMB29 లో మహేష్ క్యారెక్టర్ పై క్లారిటీ! 'సంచారి' పాటలో శివతత్వం!

 'వారణాసి' ఈ పేరెలా వచ్చింది? అక్కడ ప్రత్యేకతలు , వింతలు ఏంటి? రాజమౌళి - మహేష్ సినిమాకు ఈ టైటిల్ ఎందుకు?

 'వారణాసి' సినిమా టీజర్లో కనిపించిన 'చినమస్తా దేవి' ఎవరు? రాజమౌళి ఆమె గురించి ఏం చెప్పబోతున్నారు?

 

మీనాపై , మీనా పుట్టింటివారిపై నింద వేసిన ప్రభావతికి ఇక మాటల్లేవ్...మీనా సంధించే ఒక్కో బాణాన్ని ఎదుర్కోలేక బిక్కు బిక్కుమంటూ నిల్చుంది ప్రభావతి...

 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
Advertisement

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
Embed widget