Gruhalakshmi November 27th Episode: తులసి కాళ్లు మొక్కిన నందగోపాల్ - బసవయ్య దొంగతనాన్ని బయటపెట్టిన దివ్య
Gruhalakshmi Serial Today Episode: తులసి మాటలకు బాధపడి ఫుల్‌గా తాగి వచ్చిన నందగోపాల్, తులసి కాళ్లు మొక్కి క్షమించమని అడగడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా జరిగింది.
![Gruhalakshmi November 27th Episode: తులసి కాళ్లు మొక్కిన నందగోపాల్ - బసవయ్య దొంగతనాన్ని బయటపెట్టిన దివ్య Gruhalakshmi serial today november 27th episode written update Gruhalakshmi November 27th Episode: తులసి కాళ్లు మొక్కిన నందగోపాల్ - బసవయ్య దొంగతనాన్ని బయటపెట్టిన దివ్య](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/27/885b2af868f9492e576dc834f11ffa2d1701057450270879_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gruhalakshmi Telugu Serial Today Episode: నందగోపాల్ ఆఫీసు నుంచి మధ్యాహ్నం వెళ్లిపోయాడని ఇంతవరకు తిరిగి రాలేదని తులసి వాళ్ల అత్తయ్య మామయ్యలకు చెప్తుంది. ఫోన్ చేస్తే ఎక్కడున్నాడో తెలుస్తుందిగా ఎందుకంత కంగారు పడటం అని అత్తయ్య చెప్తుంది. ఒక్కసారి కాదు ఆఫీసు నుంచి చాలాసార్లు ఫోన్ చేశామని లిఫ్ట్ చేయడం లేదని తులసి చెప్తుంది. ఎందుకు టెన్షన్ పడతావు వాడే ఫోన్ చేస్తాడులే కాఫీ తీసుకొస్తాను కాస్త రిలీఫ్ అవ్వు అంటూ వాళ్ల అత్తయ్య చెప్పడంతో తులసి కోపంగా..
తులసి: అర్జెంట్ మీటింగ్ ఉంది. దానికి సంబంధించిన ముఖ్యమైన ఫైల్స్ మీ అబ్బాయి దగ్గర ఉన్నాయి. తన అల్మారాలో పెట్టుకుని లాక్ చేసుకుని వెళ్లారు.
అంటూ చిరాకుగా తులసి లోపలికి వెళ్తుంది. బార్‌లో మందు తాగుతూ నందగోపాల్ ఉదయం ఆఫీసులో తులసి అన్న మాటలను గుర్తు చేసుకుంటూ బాధపడుతుంటాడు. కొంతమంది అక్కడికి వచ్చి నందగోపాల్‌తో గొడవ పెట్టుకుంటారు. నందను చితక్కొట్టి అక్కడి నుంచి బయటికి గెంటివేస్తారు. రోడ్డు మీద తాగి తూలుతూ వెళుతున్న నందగోపాల్‌ను లాస్య వచ్చి కారులో తీసుకెళ్తుంది.
లాస్య: నందు లేవటానికే నీవల్ల కావడం లేదు. ఈ టైంలో గొడవలు అవసరమా? ఏంటి నందు ఇది.. ఎలా ఉండే వాడివి ఎలా అయిపోయావు. రోడ్డు మీద కూర్చోవడం ఏంటి? నీకు ఈ ఆవమానాలు ఏంటి? ఇదంతా తులసి వల్లే కదా?
అంటూ నందగోపాల్‌కు తులసి మీద కోపం వచ్చేలా మాటలు చెప్తుంది లాస్య.
ఇంట్లో నందగోపాల్ ఇంకా రాలేదని వాళ్ల అమ్మా నాన్న కంగారుగా ఎదురుచూస్తుంటారు. తులసి వర్క్ చేసకుంటూ ఉంటుంది. ఆఫీసులో మీకు ఏదైనా గొడవ అయిందా అంటూ తులసి వాళ్ల మామయ్యా అడుగుతారు. ఇంతలోనే లాస్య కారులో నందను ఇంటికి తీసుకువస్తుంది. కారులోంచి తూలుతూ దిగిన నందను చూసిన వాళ్ల అమ్మానాన్నలు షాక్ అవుతారు. తులసి కోపంగా చూస్తుండిపోతుంది. లాస్య నందను లోపలికి తీసుకురాగానే నందగోపాల్ లాస్యను వెళ్లమని చెప్తాడు.
లాస్య: ఎంటి వెళ్లేది. ఇంట్లో అందరూ నిన్ను వదిలేసినట్లున్నారు. చూడు ఎవ్వరూ నిన్ను పట్టుకోవడానికి రావడం లేదు. నేను కూడా వదిలేశాననుకో కిందపడిపోతావ్. అవును ఉన్నటుండి ఇంట్లో నీ రేంజ్ మారిపోయిందేంటి?
నందగోపాల్ లాస్యను తిట్టి అక్కడి నుంచి వెల్లగొడతాడు. తులసి కోపంగా నందగోపాల్‌ను చూస్తుంటే
నంద: ఎంటలా చూస్తున్నావ్.. చెంప పగులగొట్టాలని ఉందా? పీక పిసికేయాలని ఉందా? కానీ నీ ఇష్టం. నువ్వు తిట్టినా కొట్టినా చంపినా అస్సలు ఆపను. ఎందుకో తెలుసా? నువ్వంటే నాకు ఇష్టం. నా మనసు క్లియర్ చేసుకుంటే కానీ ప్రశాంతంగా నిదురపట్టదు. లేకపోతే రోజు ఇలాగే తాగాలనిపిస్తుంది.
మీ అమ్మగారి విషయంలో నేను తప్పు చేశాను అంటూ నందు తులసిని క్షమించమని అడుగుతాడు. నా మనసులో ఉన్న మాట చెప్పేందుకు ఫోన్ స్విచ్చాప్ చేశాను కానీ ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదని కావాలని నేను ఏ తప్పు చేయలేదని తులసి కాళ్లపై పడి క్షమాపణ అడుగుతాడు నందు. తులసి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
దివ్య ప్లాన్ బాగుందని వాళ్ల మామయ్య చెప్తాడు. అయితే ప్లాన్ ఫెయిల్ అయితే మీకే ప్రమాదం అంటూ హెచ్చరిస్తాడు. ఇంతలో దివ్య పురమాయించిన వ్యక్తి బసవయ్య రూంలోకి వెళ్తాడు. ఇంట్లో వాళ్లందరు ఆ వ్యక్తిని పట్టుకుంటారు. అందరూ కలిసి కొడుతుంటే నేను దొంగను కాదు మా ఆవిడ కోసం గోల్డ్ చైన్ తీసుకుని వెళ్తుంటే దొంగలు వెంటపడ్డారు. వారి నుంచి తప్పించుకోవడానికి మీ ఇంట్లో దూరానని చెప్తాడు. అయితే గోల్డ్ చెయిన్ ఎక్కడ ఉందో చూపించమని దివ్య అడుగుతుంది. ఆ చైన్ బసవయ్య రూంలో దాచానని చెప్తాడు. దొంగ మాటలకు బసవయ్య షాక్ అవుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆
*T&C Apply
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)