Gruhalakshmi Serial Today January 3rd: ‘గృహలక్ష్మీ’ సీరియల్: తులసితో ఛాలెంజ్ చేసిన లాస్య - దెయ్యం బొమ్మను వేయించిన విక్రమ్
Gruhalakshmi Today Episode: ఆర్టిస్ట్ వేసిన దెయ్యం బొమ్మను చూసి దివ్య అచ్చం ఆ అమ్మాయిలాగానే ఉందని చెప్పడంతో రాజ్యలక్ష్మీ, బసవయ్య షాక్ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఇంట్రస్టింగ్ జరిగింది.
Gruhalakshmi Serial Today Episode: తనకు అవమానం జరిగిందని లాస్య దొంగ ఏడుపులు ఏడుస్తుంటే పరంధామయ్య లాస్యను ఓదారుస్తూ తులసిని తిడతాడు. ఈ ఇంటి కోడలునే అవమానిస్తావా? అంటూ నిలదీస్తాడు. మధ్యలో నంద పరంధామయ్యను ఊరుకోండని చెప్పినా వినకుండా తులసిని నిలదీస్తాడు పరంధామయ్య. దీంతో తులసి ఏడుస్తూ లోపలకి వెళ్తుంది. మిగతా వాళ్లందరూ లోపలికి వెళ్లడంతో లాస్య తాను తులసి వాళ్లు డాక్టర్ గురించి మాట్లాడుకున్న విషయాలు చాటుగా విన్నది గుర్తు చేసుకుని నన్నే దెబ్బ కొడదామనుకుంటావా? అని మనసులో అనుకుంటుంది. మరోవైపు హాల్లో దివ్య యాక్సిడెంట్ అమ్మాయి బొమ్మ గీస్తూ సరిగ్గా రాకపోవడంతో పేపర్ చింపి పడేస్తుంది. ఇంతలో విక్రమ్ వచ్చి..
విక్రమ్: ఏంటి దివ్య ఏం చేస్తున్నావు.
దివ్య: యాక్సిడెంట్ అమ్మాయి బొమ్మ వేద్దామని..
విక్రమ్: నీకు బొమ్మలు వేయడం వచ్చా?
దివ్య: పెద్దగా రాదు.. కానీ ఇంట్రస్ట్ ఉంది ట్రై చేస్తున్నాను. కానీ సరిగ్గా కుదరడం లేదు. మొదలు పెట్టాక తెలిసింది బొమ్మ వేయడం ఎంత కష్టమోనని.
విక్రమ్: ఎందుకంత కష్టం బొమ్మ వేయడానికి ఆర్టిస్ట్‌ను పిలుస్తానని చెప్పానుగా
దివ్య: చెప్పావు కానీ ఉత్సాహం రాలేదు. స్టార్ట్ చేశాను.
విక్రమ్: అంత ఉత్సాహం ఎందుకు?
దివ్య: యాక్సిడెంట్ జరిగింది అంటే ఎవ్వరూ నమ్మటం లేదు. చాలా డిసాపాయింట్ అయ్యాను. అంతకంటే ఎక్కువగా డిప్రెషన్‌గా అనిపించింది. ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిన అమ్మాయి బొమ్మ వేద్దామని నువ్వు చెప్పావో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. అందుకే ట్రై చేస్తున్నాను.
అంటూ దివ్య ఉత్సాహంగా విక్రమ్‌తో చెప్తుంటే చాటు నుంచి మొత్తం వింటున్న రాజ్యలక్ష్మీ, బసవయ్య ఆలోచనలో పడతారు. చందనని మళ్లీ మళ్లీ దివ్యకు కనిపించమని చెప్పడం తప్పైందేమో కదా అక్కయ్య అంటూ బసవయ్య అనుమానం వ్యక్తం చేయడంతో అలా కనిపిండంతోనే కదా దివ్య పిచ్చిపిచ్చిగా చేస్తుంది అంటుంది రాజ్యలక్ష్మీ. ఇంతలో ఆర్టిస్ట్ అక్కడకు వస్తాడు. దివ్య చెప్తుంటే ఆ ఆర్టిస్ట్ బొమ్మ గీయడం మొదలుపెడతాడు. బొమ్మ పూర్తి కాగానే దివ్య హ్యాపీగా ఎగ్జాక్లీ ఇదే ఫోటో.. అచ్చం ఆ అమ్మాయిలాగే ఉంది. అంటుంది దివ్య. అయితే ఈ ఫోటో పోలీసులకు చూపించి వెతికిద్దాం అంటాడు విక్రమ్. మరోవైపు తులసి ఏడుస్తూ పరంధామయ్య తిట్టిన తిట్లు గుర్తు చేసుకుంటుంది. ఇంతలో అనసూయ అక్కడకు వచ్చి..
అనసూయ: కన్నీళ్లు తుడిచేసుకుంటే మాయమైపోతాయి కానీ గుండెల్లో బాధ ఎలా తీరుతుంది తులసి. ఇంతవరకు ఆయనకు వచ్చిన జబ్బు మీద నాకు జాలీ ఉండేది. కానీ ఇప్పుడు ఆయన మాటలు వింటుంటే ఆయన మీద కోపంతో రగిలిపోతున్నాను.
తులసి: వద్దు అత్తయ్య మామయ్య మీద కోపం తెచ్చుకోవద్దు. ఆ జబ్బే ఆయనతో అలా మాట్లాడిస్తుంది. అవి ఆయన మనసులో మాటలు కాదత్తయ్య. ఇన్ని సంవత్సరాలు మామయ్య నన్ను ఎంత బాగా చూసుకున్నారు. ఇంట్లో వాళ్లందరూ ఏకమైన నన్ను ఆయన వెనకేసుకొచ్చారు కదా..
అంటూ తులసి, అనసూయ మాట్లాడుకుంటుంటే నందా కూడా వచ్చి బాధపడతాడు. నేను చేసిన తప్పు నా జీవితాన్ని మాత్రమే కాదు నీ జీవితానికి నిప్పు అంటించింది అంటూ బాధపడతాడు. వందల సార్లు సారీ చెప్పాను.. ఇంకా సారీ చెప్పడం తప్పా నేనేం చేయలేను. నేను పోగొట్టుకున్నదేంటో నాకు అర్థమయ్యేలోపు నాకు దూరం అయ్యింది అంటూ నంద బాధపడతాడు. తులసి బాధపడుతూ పైకి వెళ్లిపోతుంది. ఏదో అలోచిస్తూ కూర్చున్న లాస్య దగ్గరకు పరంధామయ్య వెళ్లి
పరంధామయ్య: అమ్మా లాస్య ఎప్పుడూ రబ్బరు బంతిలా చెంగుచెంగుమంటూ ఎగిరే నువ్వు ఎందుకంత ఇలా డల్‌గా కూర్చున్నావు.
లాస్య: ఎం లేదు మామయ్యగారు.
పరంధామయ్య: ఏదో ఉంది చెప్పమ్మా..
లాస్య: ప్రతి చిన్న విషయం మీకు చెప్పడం బాగుండదేమో
అనగానే పరంధామయ్య ఎందుకు అలా మాట్లాడుతున్నావమ్మా ఏంటో నాకు చెప్పు నేనున్నానుగా నీకు అనడంతో లాస్య తాను మీ ఆరోగ్యం కోసం వ్రతం చేయాలనుకుంటున్నట్లు అందుకు నంద ఒప్పుకోవడం లేదని చెప్తుంది. ఎందుకు ఒప్పుకోడు అంటూ నందాను పిలుస్తాడు పరంధామయ్య. దీంతో అక్కడకు నంద, తులసి, అనసూయ వస్తారు. లాస్యను ఎందుకు బాధపెడుతున్నావంటూ నందాను అడుగుతాడు పరంధామయ్య.
దీంతో లాస్య అమాయకంగా నటిస్తూ ఆయనకు తులసి పర్మిషన్ కావాలేమో అంటుంది. దీంతో పరంధామయ్య తులసిని తిడతాడు. నంద వ్రతం చేయడానికి ఒప్పుకుని వెళ్లిపోతాడు. లాస్య, తులసిని ఆపి దగ్గరుండి మాతో వ్రతం చేయించు అంటూ ఆర్డర్ వేస్తుంది. అలా కాకుండా ఓవర్ యాక్షన్ చేశావంటే మామయ్యగారి ప్రాణాలకే ప్రమాదం అంటూ బెదిరించడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Read Also: సంక్రాంతికి ఐదు, రిపబ్లిక్ డేకు నాలుగు - ఈ నెల అన్నీ క్రేజీ మూవీసే!