అన్వేషించండి

Gruhalakshmi December 5th Episode - ‘గృహలక్ష్మీ’ సీరియల్‌ : దివ్య ఇంట్లో ఇజ్జత్ తీసుకున్న నంద - మరో కుట్రకు స్కెచ్ వేసిన లాస్య, రాజ్యలక్ష్మీ

Gruhalakshmi Serial Today Episode: నందాకు ఫుల్లుగా మందు తాగించి దివ్య ఇంటికి పంపించడంతో ఇవాళ్టి ఏపిసోడ్ చాలా ఇంట్రస్టింగ్ జరిగింది.

Gruhalakshmi Telugu Serial Today Episode:  నందా గురించి తులసి, అనసూయ, పరంధామయ్యా బాధపడుతుంటారు. ఆయన ఎప్పటికీ మారడని.. మారే మనిషే అయితే ఇలా ఉండే వాడే కాదని తులసి చెప్తుంది. ప్రేమను ప్రేమతోనే గెలుచుకోవాలని.. కోపంతోనో, భయంతోనో ప్రేమను గెలుచుకోలేరని.. మీ అబ్బాయి నిజంగా ప్రేమించి ఉంటే ఇలా తాగుతూ ఇంట్లో హంగామా చేసేవాడే కాదని తులసి చెప్తుంది. మా పిల్లలు మా కడుపున పుట్టడం వాళ్లు చేసుకున్న దౌర్బాగ్యం అంటుంది తులసి.

పరంధామయ్య: అమ్మా తులసి అలా అనకమ్మా..

తులసి: అప్పుడప్పుడైనా గతాన్ని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకోకుంటే గుండె బరువు తగ్గదు మామయ్య.

పరంధామయ్య: నీ పిల్లలు అనాథలుగా బతకలేదు. తల్లిగా గుండెల్లో పెట్టుకుని పెంచావు. ప్రేమను పంచావు.. వాళ్ల జీవితాలను సరైన మార్గంలో పెట్టావు. నువ్వు వాళ్ల అమ్మవు అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం..

తులసి: రేపు దివ్య అడుగుతుంది. వాళ్ల నాన్న రాలేదేంటని.. తప్పు ఎవరిదని చెప్పను. నాది అని ఒప్పుకోనా? మీ నాన్నది అని చెప్పనా?

అని తులసి బాధపడుతుండగానే మరోవైపు నందా మెల్లగా హని రూంలోకి వెళ్లి తులసి ఎక్కడుందని అడుగుతాడు. బయట హాల్లో ఉందని హని చెప్పగానే దివ్య వాళ్ల ఇంటికి తాను కూడా వస్తానని మీ ఆంటీకి చెప్పు అనగానే హని సరేలే అంటూ వెళ్తుంది. హని వచ్చి నంద అంకుల్ దివ్య ఆంటీ వాళ్ల ఇంటికి వస్తాడట.. ఈ మాట మీకు చెప్పమని నాతో అన్నారు అనగానే అందరూ హ్యాపీగా ఫీలవుతారు. దివ్య లాప్‌టాప్‌లో వర్క్‌ చేసుకుంటుంది. ఇంట్లో ఎవరో సాంగ్‌ వేయడంతో దివ్య సాంగ్‌ వినిపిస్తున్న వైపు వెళ్తుంది. తమ బెడ్‌రూంలోంచే ఆ సాంగ్‌ వినిపిస్తుందని రూంలోకి వెళ్తుంది దివ్య. రూం కలర్‌ఫుల్‌గా డెకరేట్‌ చేసి ఉండటాన్ని చూసి సర్‌ప్రైజ్‌ అవుతుంది. బెడ్‌ మీద ఉన్న నెక్లెస్‌ చూస్తూ ఉంటే విక్రమ్‌ వస్తాడు. విక్రమ్‌ను హగ్‌ చేసుకుని దివ్య థాంక్స్‌ చెప్తుంది. హాల్లో రాజ్యలక్ష్మీ, ప్రసూనాంబ, బసవయ్య మాట్లాడుకుంటూ ఉంటారు.

రాజ్యలక్ష్మీ: ఏలినాటి శని అయినా ఏడున్నరేండ్లలో వదులుతుందేమో కానీ ఈ దివ్య పీడ మాత్రం మనకు వదలడం లేదు.

బసవయ్య: ఇంకేంటక్కాయ్‌ వదిలేది. కడుపులో బిడ్డ పడిందిగా..ఇక నీ బిడ్డ మీద నువ్వు ఆశ వదులుకోవచ్చు.

ప్రసునాంబ: నిజమెప్పుడు చేదుగానే ఉంటుంది వదిన. తప్పదు మింగాల్సిందే..

బసవయ్య: ఆ పిల్ల రాక్షసి దివ్య అబ్రకదబ్ర అంటూ ఏదో మాయ చేసి మమ్మల్ని పనొళ్లని చేసింది. ఏం చేయగలిగాం.. నీ అసలు కొడుకు సంజయ్‌ని దాదాపు జైలుకు పంపించినంత పని చేసింది. ఏం చేయగలిగాం.

ప్రసునాంబ: ప్రియ దయతలచి క్షమించింది కాబట్టి సరిపోయింది. లేకపోతే..

అంటూ రాజ్యలక్ష్మీని  బసవయ్య, ప్రసూనాంబ తమ మాటలతో రెచ్చగొడతారు. దీంతో రాజ్యలక్ష్మీ కోపంగా చూస్తుంటుంది. ఇంతలో తులసి, అనసూయ, పరంధామయ్య, నందగోపాల్ దివ్యను చూడటానికి వస్తారు. వాళ్లను చూసిన దివ్య సంతోషంగా చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో ప్రియ వచ్చి తులసి వాళ్లను బాగున్నారా అని పలకరిస్తుంది.  

తులసి:  బాగున్నాను అమ్మ.. మీ దివ్య అక్క కూడా తల్లి కాబోతుంది. మీరిద్దరూ ఒక నెల అటుఇటుగా బిడ్డల్ని కంటారు.

అని తులసి అనడంతో అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో విక్రమ్‌ వచ్చి అందర్ని పలకరిస్తాడు. తులసి బట్టలు తీసి బొట్టు పెట్టి దివ్యకు ఇస్తుంది. బట్టలు తీసుకున్న దివ్య, తులసి నందాలను పక్కపక్కన నిలబడమని కాళ్లు మొక్కుతానని అడుగుతుంది. తులసి మీ నాన్న కాళ్లు మొక్కు అని చెప్తుంది. ఇద్దరూ కలిసి నిలబడితేనే బాగుంటుందని బసవయ్య చెప్తాడు. దీంతో  నందగోపాల్‌ అయిష్టంగానే తులసి పక్కన వచ్చి నిలబడగానే దివ్య వాళ్ల ఆశీర్వాదం తీసుకుంటుంది. రాజ్యలక్ష్మీ వెటకారంగా తులసి వాళ్లను అవమానిస్తున్నట్లు మాట్లాడుతుంది. అప్పుడంటే మీకు డబ్బులు లేవు.. ఇప్పుడు ఓ కంపెనీకి సీఈవో కదా అయినా ఇలాంటి చీర కట్టావేంటి? అంటుంది రాజ్యలక్ష్మీ.

తులసి: నేను సీఈవోనే కానీ ఆ ఆస్థి, కంపెనీ నావి కాదు. నేను గార్డియన్‌ ని మాత్రమే.

నంద: ఆవిడకు నమ్మకం తక్కువ. పవరాఫ్‌ పట్టాను చూపించాలేమో..

లాస్య, రాజ్యలక్ష్మీకి ఫోన్‌ చేస్తుంది.

రాజ్యలక్ష్మీ: చెప్పు లాస్య ఎంటి కాల్‌ చేశావ్‌. నీ మాజీ మొగుడు వచ్చాడని తెలిసిపోయిందా?

లాస్య: అవును నీచేతికొక ఆయుధాన్ని అందించాలని కాల్‌ చేశాను. మీ వియ్యంకుడు మందు తాగి అక్కడికి వచ్చేలా చేశాను. వాళ్ల పరువు తీసే బాధ్యత నీదే..

అంటూ లాస్య ఫోన్‌ పెట్టేస్తుంది. రాజ్యలక్ష్మీ, బసవయ్యను పిలిచి నందగోపాల్ మందు తాగిన విషయం చెప్పి నందగోపాల్‌ కింద పడేలా చేయాలని సూచిస్తుంది. అందరూ తినడానికి వెళ్తుంటే బసవయ్య, నంద కిందపడేలా చేస్తాడు. నందా కిందపడిపోతాడు. తాగొచ్చి కిందపడ్డాడని బసవయ్య అంటాడు. బుద్ది ఉన్నోడెవడైనా వియ్యాల వారి ఇంటికి తాగి వస్తాడా? అనడంతో అందరూ షాక్‌ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Also Read: ‘బహ్మముడి’ సీరియల్: దుగ్గిరాల ఇంట్లో తిష్టవేసిన కనకం - అరుణ్‌ను పట్టుకోవడానికి కావ్య కొత్త ప్లాన్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్

వీడియోలు

Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
Renu Desai : మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
Embed widget