Gruhalakshmi June 3rd: జైల్లో తండ్రిని చూసి అల్లాడిపోయిన దివ్య- కూతుర్ని తన దగ్గరకి రావద్దని చెప్పిన తులసి
నందు జైలుకి వెళ్లడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
నందు తన భర్త ఆయనకి సంబంధించి డాక్యుమెంట్స్ నా దగ్గరే ఉండాలని లాస్య అంటుంది. తులసి చేతులు ముడుచుకుని కూర్చోదు బోన్ ఎక్కించి నిజాలు కక్కిస్తానని శపథం చేస్తుంది. నువ్వు అనుకున్నది ఏది జరగదు ఈ లాస్యని తక్కువ అంచనా వేయకని లాస్య వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. తులసి నందుని కలవడానికి వెళ్లబోతుంటే రాజ్యలక్ష్మి ఫోన్ చేస్తుంది. దివ్య రాను రాను మొండిగా తయారైందని చెప్తుంది. ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో తెలియక జుట్టు పీక్కుంటున్నాం. తను ఏం చేసిందో మీకు చెప్తాను కానీ నేను చెప్పానని చెప్పకండి. అత్తారింట్లో అడుగు పెట్టి కూడ చిన్న పిల్లలా ప్రవర్తిస్తుంది. ఎంత సేపు పుట్టింటి గోల తప్పితే ఇంకేమీ తప్పదు. నా గురించి పట్టించుకొకపోతే పోయింది కనీసం మొగుడికి అయినా చేసి పెట్టాలి కదా? విక్రమ్ కి దోసలు అంటే ప్రాణమని చెప్తే నాకు వేరే పని లేదా నేను మా నాన్న దగ్గరకి వెళ్లాలని పరిగెత్తిందని అబద్ధం చెప్తుంది.
Also Read: కావ్యని ఆగర్భ శత్రువన్న రాజ్- రుద్రాణిని వాయించేసిన అత్తాకోడళ్ళు
దివ్య అలా చేస్తుందని మా అబ్బాయికి తెలిస్తే అసలు ఊరుకోడు. నేను చెప్పకపోయినా ఎవరో ఒకరు తన దగ్గర ఊదేస్తారు. వాళ్ళ అమ్మా మాట వినలేదు అంటే వీరంగం చేస్తాడు. గొడవ వద్దని నేను చెప్పినా కూడా వినడని చిన్న సైజ్ వార్నింగ్ ఇస్తుంది. తన కూతురు చేసింది తప్పెనని తులసి క్షమించమని అడుగుతుంది. విక్రమ్ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నా పట్టించుకోవడం లేదు. దివ్య జీవితం సరి కావాలంటే ఒకటే మార్గం. పుట్టింటి గురించి ఆలోచించకుండా వార్నింగ్ ఇవ్వాలి. అఆ విషయం ఎలా చెప్తారో మీ ఇష్టం లేదంటే మూ కూతురి జీవితం నాశనం అవుతుందని సుతి మెత్తగా వార్నింగ్ ఇస్తుంది. రాజ్యలక్ష్మి యుద్దం మొదలుపెట్టింది దివ్య జీవితం ఏమైపోతుందోనని తులసి భయపడుతుంది. రాజ్యలక్ష్మి లాయర్ ని పిలిపించి నందు కేసు గురించి మాట్లాడుతుంది. నంద గోపాల్ అసలు బయటకి రాకూడదు అవసరమైతే శిక్ష ఎక్కువ పడాలని లాయర్ కి చెప్తుంది.
Also Read: తులసిని తోసేసి మరీ కేఫ్ కాగితాలు చేజిక్కించుకున్న లాస్య- దివ్య, రాజ్యలక్ష్మి మాటల యుద్దం
దివ్య వాళ్ళ నాన్నకి సాయం చేద్దామని చూస్తున్నానని రాజ్యలక్ష్మి నటిస్తుంది. నీ భార్యని డాక్టర్ కి చూపించు చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరి మీద అరుస్తుంది. మమ్మల్ని ఎలా పడితే అలా మాట్లాడుతుంది పొగరుగా సమాధానం చెప్పేసి వెళ్లిపోయిందని బసవయ్య వాళ్ళు నూరిపోస్తారు. వాళ్ళ మాటలకు విక్రమ్ దివ్య మీద కోపం పెంచుకుంటాడు. లాస్య భాగ్య దగ్గరకి వస్తుంది. నీకు ఐదు లక్షలు ఇద్దామని అనుకున్నా కానీ నువ్వు నిన్న వెళ్ళి తులసి దగ్గర సరెండర్ అవకుండా ఉంటే. నీమీద నేను నిఘా పెట్టకుండా ఎలా ఉంటానని లాస్య అంటుంది. తులసక్క నన్ను హిప్నటైజ్ చేసిందని మళ్ళీ ప్లేట్ ఫిరాయిస్తుంది. ఇక నుంచి నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాను భాగ్య అంటుంది. సరే క్షమించేశానని లాస్య అనేసరికి భాగ్య భజన మొదలుపెడుతుంది. తులసి మీద ఒక కన్నేసి ఉంచాలని అనేసరికి సరే నీ బంటుని నువ్వు చెప్పినట్టే చేస్తానని భాగ్య మాట ఇస్తుంది.