Gruhalakshmi June 2nd: తులసిని తోసేసి మరీ కేఫ్ కాగితాలు చేజిక్కించుకున్న లాస్య- దివ్య, రాజ్యలక్ష్మి మాటల యుద్దం
నందు జైలుకి వెళ్లడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
దివ్య గదిలో నుంచి బయటకి రాలేదని విక్రమ్ ప్రేమగా ఓదారుస్తున్నాడని బసవయ్య తన అక్కకి ఎక్కించే పనిలో ఉంటాడు. ఎంత సేపు చాటు మాటు వ్యవహారం చేస్తాం, దెబ్బకి దెబ్బ తీయడానికి రెడీ అయింది. ఇలాంతప్పుడే దివ్యకి విక్రమ్ కి మధ్య దూరం పెంచాలి. మనస్పర్థలు క్రియేట్ చేయాలని రాజ్యలక్ష్మి అంటుంది. తన తండ్రి మీద ప్రేమ విక్రమ్ కి తనని దూరం చేస్తుంది. మనం అన్న మాటలకు దివ్య విక్రమ్ ముందు దుమ్ముదులుపేస్తుంది. నేను ఇచ్చిన డోస్ కి తులసి కూడా మన ఇంటి వైపు చూడదు అప్పుడు ఉంటుంది మజా ఆ క్షణం కోసం ఎదురు చూడాలని అంటుంది. అంతగా కష్టపడినా ఒడిపోయినందుకు తులసి బాధపడుతూ ఉంటే మోహన్ వచ్చి ఓదార్చడానికి చూస్తాడు. ఆ తల్లిదండ్రుల కన్నీళ్ళు చూడలేకపోయాను, వాళ్ళ అబ్బాయిని రక్షిస్తానని ధైర్యంగా మాటిచ్చాను ఇంకెప్పుడు వాళ్ళు తన మాట నమ్మరని తులసి ఎమోషనల్ అవుతుంది.
Also Read: మాళవికని ఆనందంగా ఉంచమని యష్ దగ్గర మాట తీసుకున్న వేద
అత్తయ్య మావయ్య వాళ్ళకి ధైర్యం చెప్పమని చెప్తాడు. నాన్న దగ్గర అయ్యాడని మురిసిపోయాను కానీ అంతలోనే దూరమయ్యాడు. ఐదేళ్లు దూరంగా ఉండటం తన వల్ల కావడం లేదని తులసికి ఫోన్ చేసి నాన్న కావాలని అడుగుతుంది. ఎందుకు ఆయన్ని కాపాడలేకపోయారు, లాస్య దౌర్జన్యాన్ని ఎందుకు ఎదిరించలేకపోయారని బాధగా అడుగుతుంది. సమయం వచ్చినప్పుడు కష్టాలన్నీ పారిపోతాయని తులసి ధైర్యం చెప్తుంది. ఇప్పుడే నాన్నని చూడటానికి బయల్దేరుతున్నానని అంటుంది. తులసి వద్దని చెప్పినా కూడా వినిపించుకోదు వెళ్ళి తీరాల్సిందేనని తనని కూడా రమ్మని ఫోన్ కట్ చేస్తుంది. దివ్య హడావుడిగా వెళ్లబోతుంటే బసవయ్య ఎదురుపడతాడు. ఎక్కడికి బయల్దేరావ్ అంటాడు. నాన్న దగ్గరకని చెప్తే ఆపేస్తాడని మనసులో అనుకుని వచ్చాక చెప్తానులే అంటుంది. అప్పుడే రాజ్యలక్ష్మి వస్తుంది. ఎవరి పనులు వాళ్ళకి ఉంటాయి ఇలా గుమ్మం ముందు ఉండి నిలదీయకూడదని చెంప చెల్లుమనేలా సమాధానం చెప్తుంది.
అత్తయ్య నాకు పని ఉంది బయటకి వెళ్ళి ఒక గంటలో వచ్చేస్తానని దివ్య అంటే ఎక్కడికి వెళ్తున్నావాని రాజ్యలక్ష్మి కూడా అడుగుతుంది. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను విక్రమ్ తల్లిని నీ అత్తగారిని నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందే. కాదు కుదరదు అంటే అదే మాట నీ భర్త ముందు చెప్పు నేను పట్టించుకోనని దివ్యని రెచ్చగొడుతుంది. ఇది రాజ్యలక్ష్మి రాజ్యం చచ్చినట్టు రూల్స్ పాటించాల్సిందేనని అంటుంది. జైల్లో ఉన్న నాన్నని కలవడానికి వెళ్తున్నానని చెప్తుంది. కుదరదు నువ్వు జైలు చుట్టు తిరిగితే ఈ ఇంటి పరువు ఏం కావాలని అంటుంది. దివ్య మాత్రం లోపలికి వెళ్ళే ప్రసక్తే లేదని తండ్రిని కలిసి తీరాల్సిందేనని వెళ్ళిపోతుంది. తను ఎదిరించి వెళ్లిపోవడంతో రాజ్యలక్ష్మి నవ్వుతుంది. దివ్య నన్ను కాదని వాళ్ళ నాన్న దగ్గరకి వెళ్లడమే నాకు కావలసింది. నేను ఎంతో ఇప్పుడు చూపిస్తానని చెప్తుంది.
Also Read: రాహుల్ సంగతి తెలిసి షాకైన కనకం కుటుంబం- స్వప్న అడ్డు తొలగించుకోవాలన్న రుద్రాణి
లాస్య తులసి ఇంటికి వస్తుంది. అందరూ దిగులుగా ఉన్నారు ఏంటి జైలుకి వెళ్ళింది నా మొగుడు కదా మీరు అలా బాధపడుతున్నారు ఏంటని దెప్పిపొడుస్తుంది. మీ అబ్బాయి నన్ను గెంటితే గుమ్మం బయట పడ్డాను కానీ నేను గెంటేస్తే వెళ్ళి జైల్లో పడ్డాడు అది తన గొప్ప అని లాస్య రెచ్చగొడుతుంది. తమ బెడ్ రూమ్ లో వెళ్తున్నామని లాస్య వెళ్లబోతుంటే తులసి అడ్డుపడుతుంది. కానీ లాస్య మాత్రం తనని తోసేసుకుని నందు గదిలోకి వెళ్ళి కేఫ్ డాక్యుమెంట్స్ తీసుకుంటుంది. నా భర్తకి సంబంధించిన డాక్యుమెంట్స్ నేను తీసుకెళ్తున్నానని చెప్తుంది.