అన్వేషించండి

Ennenno Janmalabandham June 2nd: మాళవికని ఆనందంగా ఉంచమని యష్ దగ్గర మాట తీసుకున్న వేద

అభిమన్యు మాళవికని గెంటేసి వేరే పెళ్లి చేసుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే,,

యష్ ఆదిత్య గురించి బాధపడతాడు. నేను మాళవికని వదిలేయకుండా సర్దుకుపోవాల్సింది నా కొడుక్కి ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. చెత్త కుప్ప ముందు కన్నతల్లిని ఓదార్చలేక నా కొడుకు ఎన్ని అవస్థలు పడ్డాడో తలుచుకుంటేనే చాలా బాధగా ఉందని ఎమోషనల్ అవుతాడు. పరిస్థితులు త్వరలోనే చక్కబడతాయని మన కొడుకు ఆదిత్య జీవితం బాగుంటుందని వేద ధైర్యం చెప్తుంది. అటు ఇంట్లో ఆదిత్య గురించి మాలిని కూడా ఆలోచిస్తుంది. ఇప్పుడు మాళవిక బతుకు రోడ్డున పడింది. ఆదిత్య పరిస్థితి ఏంటని రత్నంతో చెప్పి బాధపడుతుంది. దీని గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడుచేసుకోకని రత్నం సర్ది చెప్తాడు.

Also Read: కొడుకు సంగతి తెలిసి కుప్పకూలిన అనసూయ దంపతులు- దివ్యని పుట్టింటికి దూరం చేస్తున్న రాజ్యలక్ష్మి

మాళవికని తిట్టడానికి యష్ ఆవేశంగా వెళ్తుంటే వేద ఆపుతుంది. గుండెకి గుది బండలా మారే కోరికలు కోరవద్దని యష్ చెప్తాడు. మాళవికని మీరు ఏమి అనొద్దు అంటుంది. ఎందుకు అనకూడదని ఆవేశపడతాడు. అసలు ఏమి అనొద్దని ఎలా అంటున్నావ్ తను ఏం చేసిందో చూశావ్ కదా ఎవడో వదిలేశాడని తాగి చెత్త కుప్ప దగ్గర పడిపోయింది. నా కొడుకు అక్కడే ఉన్నాడు అలాంటి మనిషిని క్షమించమని అడుగుతున్నావా అని అరుస్తాడు. మీ ఆవేశాన్ని అర్థం చేసుకుంటాను కానీ మాళవిక గురించి కూడా ఆలోచించండి. ఆదిత్య గురించి మీరు ఆలోచించినంతగా మాళవిక ఆలోచించదు. అయిన ఆడది ఎప్పుడు ప్రేమని ఆశిస్తుంది. ప్రేమలో ఒడిపోతే బాధపడుతుంది. మాళవిక తన విషయంలో కూడా అలాగే బాధపడింది. అభిమన్యు ప్రేమని ఆశించింది. కానీ వాడు మోసం చేశాడు తన మనసు పాడైందని వేద నచ్చ జెప్పడానికి చూస్తుంది.

అవును మరి తను 16 ఏళ్ల పడుచు తనకోక మనసు కొడుకు గురించి ఆలోచించాలి కదా? డబ్బు కోసం ఆలోచించి వాడి దగ్గరకి వెళ్ళిందని యష్ సీరియస్ అవుతాడు. ఇప్పుడు మీరు మాళవికని బాధపెడితే ఆ ఎఫెక్ట్ ఆదిత్య మీద పడుతుంది. తను ఆనందంగా ఉండాలంటే మాళవిక ఆనందంగా ఉండాలని వేద అంటుంది. మాళవికని ఏమి అనొద్దని యష్ దగ్గర వేద మాట తీసుకుంటుంది. ఖైలాష్ ఎంట్రీ ఇస్తాడు. జరిగింది మొత్తం విన్నాను సూపర్ బ్రో అంటూ భజన మొదలుపెడతాడు. ఎవరు అతను అని నీలాంబరి అడుగుతుంది. శత్రువుకి కావాల్సిన వాడని అభి చెప్తాడు. బెయిల్ వచ్చింది మాళవిక పోయింది ఒకే దెబ్బకి రెండు పిట్టలు అందుకే నీలుని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు ఆ మాళవిక యష్ ఇంట్లో ఉంది. నీతో ఉండలేదు కాబట్టి ఇక యష్ కి పెళ్ళాంగా ఉండాలని అనుకుంటుంది. ఇక నారీ నారీ నడుమ మురారీ అయి నలిగిపోతాడని సంబరపడతారు.

Also Read: ఓపెన్ అయిన రేవతి- ఇంకొక పెళ్లి చేసుకోమని ముకుందకి సలహా ఇచ్చిన మురారీ తల్లి

యష్ గదిలో మాళవిక పడుకుని ఉండేసరికి ఇక నేనెక్కడ పడుకోవాలని అంటాడు. వేద సరే అని చెప్పి భర్త కోపం పోగొట్టేందుకు ట్రై చేస్తుంది. ఇద్దరూ కాసేపు రొమాన్స్ లోకి దిగిపోతారు. అప్పుడే ఆదిత్య వచ్చి భయంగా ఉందని మమ్మీ దగ్గర పడుకుంటానని చెప్తాడు. వేద తీసుకెళ్ళి తన దగ్గర పడుకోబెడుతుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
Virat Kohli News: వారం రోజుల్లో తప్పు సరిదిద్దుకో- కోహ్లీకి నోటీసులు
వారం రోజుల్లో తప్పు సరిదిద్దుకో- కోహ్లీకి నోటీసులు
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
UI Movie Leaked Online: రియల్ స్టార్ ఉపేంద్రకు షాక్... విడుదలైన గంటల్లోనే ఆన్‌లైన్‌లో 'యూఐ' మూవీ లీక్
రియల్ స్టార్ ఉపేంద్రకు షాక్... విడుదలైన గంటల్లోనే ఆన్‌లైన్‌లో 'యూఐ' మూవీ లీక్ చేసేశారు
Embed widget