News
News
X

Gruhalakshmi August 27th Update : చేతులు కలిపిన లాస్య, అభి- తులసి మ్యూజిక్ స్కూల్ భూమి పూజ జరగకుండా స్కెచ్

తులసి జీవితం కొత్త మలుపు తీసుకుంది. సామ్రాట్ రావడంతో తన జీవితం బాగుంటుందని చూసి కుళ్ళుకుంటున్న లాస్య అది చెడగొట్టాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది.

FOLLOW US: 

అన్నయ్య అమ్మ మీద కోపంగా ఉన్నాడని తెలుసుగాని ఇంతగా నిలదీసేంత ద్వేషం పెంచుకున్నాడని తెలియలేదు.. నాకైతే వాడి మాటలకి ఒళ్ళు మండిపోయిందని ప్రేమ్ శ్రుతితో అంటాడు. అదేదో కొత్త విషయం లాగా విచిత్రంగా చెప్తావ్ ఏంటి అని శ్రుతి అంటుంది.  ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం అవమానించడం ఈ ఇంట్లో మగవాళ్ళకి అలవాటే కదా అని కౌంటర్ వేస్తుంది. అసలు నీ ఉద్దేశం ఏంటి అని ప్రేమ్ అడుగుతాడు. ఒకప్పుడు మీ నాన్నగారు.. తర్వాత మీ అన్నగారు.. ఇప్పుడు మీరు అందరూ మహామహులే మీరు తప్పు చెయ్యడం అది ఆడవాళ్ళ మీదకి తోసెయ్యడం నోరు వేసుకుని పడిపోవడం మామూలే కదా అని శ్రుతి చెప్తుంది. ఇప్పుడు నోరు వేసుకుని పడుతుందో ఎవరో అని ప్రేమ్ అంటాడు. మళ్ళీ ఇద్దరి మధ్య చిలిపి తగాదా మొదలైపోతుంది.

సామ్రాట్ హనీ దగ్గరకి వచ్చి తన బాబాయ్ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నువ్వు వచ్చి నన్ను గారం చేసి నిద్రలేపుతావని ఎదురు చూస్తున్నా అని హనీ కళ్ళు మూసుకుని ఆటపట్టిస్తుంది. ఇద్దరు కలిసి సరదాగా ఆడుకుంటారు. ఈరోజు పూజ ఉందని సామ్రాట్ చెప్తాడు. తెలుసు తులసి ఆంటీ చెప్పింది ఏ డ్రెస్ వేసుకోవాలో కూడా ఆంటీ చెప్పిందని అంటాడు. అబ్బో మీరిద్దరి మధ్య చాలా నడుస్తుందే అంటాడు. ఇక ఇద్దరు కలిసి రెడీ అవుతారు. తులసి భూమి పూజ బాగా జరగాలని కోరుకుంటూ తులసి కోటకి మొక్కుకుంటుంది. అప్పుడే లాస్య అభికీ ఫోన్ చేస్తుంది. భూమి పూజ జరగకూడదని లాస్య అంటుంది. మీ మామ్ కి సంబంధించి ప్రతి విషయంలో సామ్రాట్ గీత దాటి ప్రవర్తిస్తున్నాడు, భూమి పూజ సవ్యంగా జరిగితే సామ్రాట్ ఆయన ఇంటికే కాదు మీ ఇంటికి కూడా ఆయనే యజమాని అవుతాడని లాస్య అంటుంది.

Also Read: ప్రేమ ఊహల్లో విహరిస్తోన్న రిషిధార- ఏం జరిగిందో తెలుసుకునేందుకు మహేంద్ర, గౌతమ్ తిప్పలు

భూమి పూజ ఎలాగైనా అపమని అభి అంటాడు. లాస్య అభికి ఏదో ప్లాన్ చెప్తుంది. నేను చెప్పినట్టు చేస్తే భూమి పూజ రోజు కొబ్బరి కాయ కొట్టడం కాదు మ్యూజిక్ స్కూల్ ఆలోచనకి స్వస్తి పలికి గుమ్మడి కాయ కొడతారని లాస్య అంటుంది. మామ్ హార్ట్ అవుతుందేమో అని అభి అంటాడు. డాడ్ కి మామ్ కి రిలేషన్ సామ్రాట్ గారికి తెలియకూడదనే కదా డాడ్ ఆలోచన మరి ఎలా అంటే ఆ సీక్రెట్ బయటపడకుండానే పూజ ఆపవచ్చని చెప్తుంది. సరే ఆంటీ మీరు చెప్పినట్టే చేస్తానని అభి అంటాడు. నీ కొడుకు వేలితోనే నీ కన్ను పొడిపిస్తున్నా అని లాస్య సంబరపడుతు ఎగురుతుంది.

భూమి పోజ జరిగే దగ్గరకి సామ్రాట్ తో పాటు తులసి కుటుంబం అంటా వస్తుంది. హనీ సంతోషంగా వెళ్ళి తులసిని కౌగలించుకుంటుంది. అప్పుడే లాస్య, నందు కూడా వస్తారు. మీ పార్టనర్ తో చేసే భూమి పూజకే ఈ రేంజ్ లో ఏర్పాట్లు చేస్తున్నారంటే ఇక మీ పెళ్ళికి ఏ రేంజ్ లో ఎరేంజమెంట్స్ ఉంటాయో అని లాస్య అనేసరికి అందరూ షాక్ అవుతూ కోపంగా చూస్తూ ఉంటారు. సామ్రాట్ గారికి మీరు సంబంధాలు చూస్తున్నారు కదా మంచి సంబంధం దొరికితే పెళ్లి చేస్తారు కదా అని అంటున్నా అని కవర్ చేస్తుంది.

Also Read: కార్తీక్ కి మోనిత గోరుముద్దలు, నువ్వు నా భార్యని కాదంటూ దీపని గుర్తుచేసుకున్న డాక్టర్ బాబు!

తరువాయి భాగంలో..

తులసి తమ్ముడు భూమి పూజ జరిగే దగ్గరకి వస్తాడు. మా అక్క నా కళ్ళ ముందే నరకయాతన పడుతూ ఉంటే ఏమి చేయలేక చేతులు ముడుచుకుని కూర్చున్నా. ఇలాంటప్పుడు చెడు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకోవడం అవసరమా అని తులసి అంటే అది నువ్వు మర్చిపోయావేమో కానీ నేను కాదక్కా అని అంటాడు.  

Published at : 27 Aug 2022 10:31 AM (IST) Tags: Gruhalakshmi Serial today episode Gruhalakshmi Serial Today Episode Written Update Gruhalakshmi Serial Gruhalakshmi Serial August 27th

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Guppedantha Manasu September 24th Update: రిషిధార దోబూచులాట, రిషి కోపాన్ని డామినేట్ చేసిన వసు ప్రేమ

Guppedantha Manasu September 24th Update:  రిషిధార దోబూచులాట, రిషి కోపాన్ని డామినేట్ చేసిన వసు ప్రేమ

Gruhalakshmi September 24th Update: సామ్రాట్ భార్య గురించి నీచంగా మాట్లాడిన అభి- మీడియా ముందు తులసి పరువుపోయేలా చేసిన లాస్య

Gruhalakshmi September 24th Update: సామ్రాట్ భార్య గురించి నీచంగా మాట్లాడిన అభి- మీడియా ముందు తులసి పరువుపోయేలా చేసిన లాస్య

Devatha September 24th Update: 'అక్క నా సొంత అక్క కాదు కదా తనేమైపోతే నాకేంటి' అనుకున్న సత్య- దేవుడమ్మకి అబద్ధం చెప్పిన ఆదిత్య

Devatha September 24th Update: 'అక్క నా సొంత అక్క కాదు కదా తనేమైపోతే నాకేంటి' అనుకున్న సత్య- దేవుడమ్మకి అబద్ధం చెప్పిన ఆదిత్య

Karthika Deepam September 24 Update: డాక్టర్ బాబుకి గతం గుర్తుచేసేందుకు దీప సరికొత్త సాహసం, కార్తీక్ లో మార్పు చూసి మురిసిపోయిన మోనిత

Karthika Deepam September 24 Update: డాక్టర్ బాబుకి గతం గుర్తుచేసేందుకు దీప సరికొత్త సాహసం, కార్తీక్ లో మార్పు చూసి మురిసిపోయిన మోనిత

టాప్ స్టోరీస్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

For one last time! జులన్‌ను హత్తుకొని ఏడ్చేసిన హర్మన్‌ - లార్డ్స్‌లో ఆంగ్లేయుల గ్రేట్ రెస్పెక్ట్‌!

For one last time! జులన్‌ను హత్తుకొని ఏడ్చేసిన హర్మన్‌ - లార్డ్స్‌లో ఆంగ్లేయుల గ్రేట్ రెస్పెక్ట్‌!

Zodiac Signs: జీవిత భాగస్వామితో గొడవలు రాకుండా ఉండాలంటే మీ రాశి ప్రకారం ఇలా చేయండి

Zodiac Signs:  జీవిత భాగస్వామితో గొడవలు రాకుండా ఉండాలంటే మీ రాశి ప్రకారం ఇలా చేయండి