Ennenno Janmalabandham July 28th: 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్: వేద మీదున్న ప్రేమని బయటపెట్టిన యష్- వసంత్ గర్ల్ ఫ్రెండ్ ని చూసేసిన చిత్ర
మాళవిక మళ్ళీ యష్ ఇంటికి తిరిగి రావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
రత్నం 60వ పుట్టినరోజు సందర్భంగా షష్టి పూర్తి చేయడానికి ఒప్పుకోమని వేద అడుగుతుంది. అత్తయ్య, మీ పెళ్లి ఎలా జరిగిందో మేం ఎవరం చూడలేదు కదా అంటుంది. దీంతో వేద మాటకి ఎస్ చెప్పేస్తారు. మరుసటి రోజు వేద కోసం యష్ గది మొత్తం అందంగా డెకరేట్ చేసి పెడతాడు. ఇదంతా నీ పుణ్యమే నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదని యష్ అంటాడు. ఒక్క కౌగిలి, స్పర్శతో అన్నీ కస్సుబుస్సులు పోతాయని వేద చెప్తుంది. భార్యకి ఒక్కొక్క గులాబీ ఇస్తూ వేద మీద ఉన్న ప్రేమని చక్కగా చెప్తాడు. మోకాళ్ళ మీద నిలబడి తన జీవితాన్ని ఇస్తున్నానని అంటాడు. భర్త చూపించిన ప్రేమకి వేద మురిసిపోతుంది. మాలిని నిద్రలేవగానే రత్నం కాఫీ తీసుకొచ్చి ఇస్తాడు. భర్తకి ప్రేమగా బర్త్ డే విసెష్ చెప్పి ముద్దు పెడుతుంది. వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండటం ఆదిత్య, ఖుషి చూస్తారు.
Also Read: మనసుల్ని మెలిపెట్టించేసిన కృష్ణ, మురారీ- అలేఖ్య వాళ్ళకి నిజం చెప్పేసిన ముకుంద
వసంత్ గీతని కలవడానికి వర్షంలోనే వస్తాడు. తను తడిచిపోయాడని గీత తన షర్ట్ విప్పి వసంత్ తల తుడుస్తుంది. అప్పుడే చిత్ర అటుగా వచ్చి వసంత్ కారు ఉండటం చూసి లంచ్ అని చెప్పాడు కదా అనుకుంటుంది. అప్పుడే ఎదురుగా వసంత్, గీత ఉండటం చిత్ర చూస్తుంది. ఈయన లంచ్ ప్రోగ్రామ్ ఇదా? అంటే నాకు తెలియకుండా వసంత్ కి ఇంకొక అమ్మాయితో ఎఫైర్ ఉందా అని కోపంగా వెళ్ళిపోతుంది. మాళవిక జరిగినవన్నీ గుర్తు చేసుకుని రగిలిపోతుంది.
మాళవిక: నన్ను తిట్టి కొట్టి అందరూ నామీద పై చేయి సాధించాలని చూస్తున్నారు
ఆదిత్య: అమ్మా నువ్వు ఇంకా రెడీ అవలేదా.. ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది.
మాళవిక: అందరికీ ఇది హ్యపీ మూమెంట్ మనకి కాదు. ఇది మనకి ఒక పనికిమాలిన దండగ
ఆదిత్య: అలా అంటావ్ ఏంటమ్మా అందరూ హ్యపీగా ఉంటే ఎంత బాగుందో
మాళవిక: అది వాళ్ళకి హ్యాపీనెస్ మనకి సాడ్ నెస్.. మనం వెళ్లొద్దు
ఆదిత్య: ప్లీజ్ మమ్మీ మనం వెళ్దాం ఈసారి నా మాట విను
మాళవిక: రేయ్ వాళ్ళు మనవాళ్ళు కాదు వెళ్లాల్సిన పని లేదు
ఆదిత్య: లేదు అందరితో కలిసి ఉంటే బాగుంది నేను వెళ్తున్నా నువ్వు రెడీ అయి రా అనేసి పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు.
Also Read: దుగ్గిరాల ఇంటి ముందు మీడియా రచ్చ- సెలెబ్రెటీ అయిపోయానని చంకలు గుద్దుకున్న స్వప్న
మాళవిక: అంటే వీడు కూడా నా మాట వినకుండా ఖుషిలాగా మారిపోతున్నాడా? షష్టి పూర్తి వేడుక నా ప్లాన్ కి వేదిక కావాలి. వాళ్ళు ఒడిపోవాలి నేను గెలవాలి
ఇక రత్నం, మాలిని పెళ్లికూతురు, పెళ్లి కొడుకు మాదిరిగా రెడీ అయ్యి వస్తారు. అందరూ వాళ్ళకి విసెష్ చెప్తారు. పెళ్లి కళ వచ్చేసిందని ఆట పట్టిస్తారు. అందరూ నవ్వుతూ సంతోషంగా ఉండటం మాళవిక కుళ్ళుకుంటుంది. నానమ్మ, తాతయ్య పెళ్లి పెద్ద తనేనని ఖుషి అనేసరికి నవ్వుతారు. పంతులు షష్టి పూర్తి విశిష్టత గురించి చాలా చక్కగా చెప్తాడు.