అన్వేషించండి

Krishna Mukunda Murari July 27th: 'కృష్ణ ముకుంద మురారీ' సీరియల్: మనసుల్ని మెలిపెట్టించేసిన కృష్ణ, మురారీ- అలేఖ్య వాళ్ళకి నిజం చెప్పేసిన ముకుంద

కృష్ణకి మురారీని దూరం చేసేందుకు ముకుంద విశ్వప్రయత్నాలు చేస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

భవానీ ముందు మురారీ, కృష్ణ మధ్య సఖ్యత లేదని ఇరికించేందుకు ముకుంద ట్రై చేస్తుంది. మురారీ సన్మానం నుంచి వెళ్లిపోవడాన్ని పెద్ద సీన్ క్రియేట్ చేస్తుంది. మురారీ సోరి చెప్పి వెళ్లిపోతుంటే భవానీ ఆగమని సీరియస్ అవుతుంది. అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి చెప్పాలని అనుకుంటున్నట్టు ఉందని రేవతి కల్పించుకుంటుంది.

భవానీ: ఏమైంది అసలు మీ ఇద్దరికీ, ఏం జరుగుతుంది మీ మధ్య

మురారీ: కాల్ రావడంతో ఏం చేయాలో అర్థం కాలేదు

భవానీ: నిజం చెప్పడం ఇష్టం లేకపోతే వదిలేయ్ అంతే కానీ అబద్దం చెప్పకు క్షమించను

కృష్ణ: అత్తయ్య ప్లీజ్ నాకోసం ఆయన్ని ఏమి అనొద్దు. నిజంగానే ఎమర్జెన్సీ పని మీద వెళ్ళి ఉంటారు. ఏసీపీ సర్ మీరు వెళ్ళండి తర్వాత మాట్లాడుకుందాం

భవానీ: తర్వాత మాట్లాడుకోవడం ఏంటి? నిజంగానే మీ మధ్య ఏమి లేదా

Also Read: దుగ్గిరాల ఇంటి ముందు మీడియా రచ్చ- సెలెబ్రెటీ అయిపోయానని చంకలు గుద్దుకున్న స్వప్న

ముకుంద: నీ మౌనాన్ని మమ్మల్ని ఎలా అర్థం చేసుకోమని అంటావ్ అవుననా కాదనా

ప్రసాద్: తప్పు చేసినట్టు ఎందుకు మౌనంగా ఉంటావ్

కృష్ణ: అలాంటిది ఏమి లేదు మావయ్య.. ఆయన ఏదో కేసు మీద వెళ్లొచ్చి ఉంటారు. నా వల్ల ఆయన మీ అందరి ముందు దోషిగా నిలబడటం నాకు ఇష్టం లేదు. దయచేసి ఆయన్ని ఏమి అనొద్దు పెద్దత్తయ్య

ఏదో దాస్తున్నారు అదేంటో తెలుసుకోవాలని భవానీ డిసైడ్ అవుతుంది. అలేఖ్య, మధుకర్ కృష్ణ వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. మురారీ భర్త కదా స్టేజ్ ఎక్కితే తప్పు ఏముందని అలేఖ్య అంటే తప్పేనని ముకుంద ఎంట్రీ ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళు నిజమైన భార్యాభర్తలు కాదని చెప్తుంది.

ముకుంద: వాళ్లిద్దరిదీ నిజమైన పెళ్లి కాదు అగ్రిమెంట్ పెళ్లి. అది అయిపోగానే కృష్ణ వెళ్ళిపోతుంది. నేను మురారీని ప్రేమిస్తున్నట్టు మీకు తెలుసని నాకు తెలుసు. అందుకే తన మీద ఒట్టు పెట్టి మరీ చెప్తున్నా

నిప్పు పెట్టినందుకు సంతోషంగా వెళ్ళిపోతుంది. ఇక కృష్ణ బెడ్ మీద కాకుండా చాప వేసుకుని కింద పడుకుంటుంది. మురారీ కృష్ణని పిలిచినా పలకదు. ఎందుకు కృష్ణ మళ్ళీ మొదటికి వచ్చిందని అనుకుంటాడు. ఇక ఇద్దరి అంతరాత్మల మధనం జరుగుతుంది. ఒకరికొకరు ఎదురుపడి ఒకరినొకరు చూసుకుని ఎమోషనల్ అవుతారు.

కృష్ణ: ఎందుకు ఏసీపీ సర్ అంత బాధపడుతున్నారు. కావాలని చేసిన తప్పుకి ఎప్పుడు బాధపడకూడదు

మురారీ: నువ్వు ఎందుకు బాధపడుతున్నావ్. ఎలాగూ రెండు వారాల్లో వెళ్లిపోతావ్? నేను స్టేజ్ మీదకి వస్తే ఎంత రాకపోతే ఎంత. నీ లైఫ్ లో నాకౌ ఏం ఇంపార్టెన్స్ ఉంది

కృష్ణ: మీరు నా దేవుడు

మురారీ: నేను నీ మనసులో దేవుడిగా ఉండాలని అనుకోలేదు. నీ మనసులో చోటు కావాలని అనుకున్నా. స్టేజ్ మీద రుణం తీర్చుకోలేనని చెప్పావ్.. అంత పరాయి వాడిని చేశావ్ ఏంటి? నాకు నీ కృతజ్ఞత అక్కర్లేదు

కృష్ణ: నాకు తెలుసు మీకు నేను అక్కర్లేదని అందుకే వెళ్లిపోతున్నా మీ కంటికి కనిపించనంత దూరంగా వెళ్లిపోతున్నా

Also Read: అత్తకి నిజం చెప్పేసిన వేద - మాళవికని ముసుగేసి కుమ్మేసిన మాలిని, అటు అభిమన్యుకి ఇత్తడే

మురారీ: వెళ్ళు మీ ఆడవాళ్ళు ఇంతే మాకేం కావాలో మీరు ఎప్పుడు అర్థం చేసుకోలేరు. ఇన్నాళ్ల సావాసంలో ఎప్పుడూ నీకు ప్రేమ కనిపించలేదా? డైరెక్ట్ గా ఇన్ డైరెక్ట్ గా నిన్ను ప్రేమిస్తున్నట్టు ఎప్పుడూ అనిపించలేదా? అనేసి కౌగలించుకుంటాడు. మీ నాన్నకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అనుకుంటే నిన్ను మా ఇంటికి తీసుకొచ్చే వాడిని కాదు. నిన్ను ఇంట్లో ఎందుకు పెట్టుకున్నాను. నేను నీ మెడలో తాళి కట్టాను, మెట్టెలు తొడిగి ఏడడుగులు నడిచాను. అంటే నిన్ను నా భార్యగా అంగీకరించాను. ఎవరూ లేని నీకు ఇంత పెద్ద కుటుంబం ఇవ్వాలని అనుకున్నా నీమీద జాలితో కాదు ప్రేమతో.. కానీ అది అర్థం చేసుకోకుండా నాకు కృతజ్ఞత చూపిస్తున్నావ్

కృష్ణ: మీరు నన్ను ప్రేమిస్తున్నారా?

మురారీ: భార్యని ప్రేమించకూడదా?

కృష్ణ: మరి మీకు నా ప్రేమ కనిపించలేదా? మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే నా ప్రేమ మీకు ఎప్పుడో అర్థం అయ్యేది. నా ప్రమేయం లేకుండానే మీరు మెట్టెలు తొడిగారా? మీరు అందరీలాంటి వాళ్ళే.. అర్థం చేసుకోలేదు. మీరు నా దేవుడు అంటే ప్రేమకన్నా గొప్ప ఫీలింగ్. అది మీకు ఎలా చెప్పాలో అర్థం కాక అలా అన్నాను. అది మీరు ఆరాధన భావం అనుకుంటే అందులోనూ ప్రేమ ఉంటుంది. మీరు నా ప్రేమని అర్థం చేసుకోకపోతే అది నా తప్పా.. మీరు ఆలోచించినట్టే నేను ఆలోచించాను. మన పెళ్లి తప్పనిసరి పరిస్థితిలో జరిగినా జరిగింది కదా. అది మా నాన్న చివరి కోరిక అప్పుడే మిమ్మల్ని నా భర్తగా అంగీకరించాను. మనది బంధం అనుకుని మీ ఇంట్లోకి అడుగుపెట్టాను

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Naga Chaitanya: వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Naga Chaitanya: వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Vijay Deverakonda: వినసొంపైన మ్యూజిక్, అద్భుతమైన విజువలైజేషన్ - ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ‘సాహిబా’ సాంగ్!
వినసొంపైన మ్యూజిక్, అద్భుతమైన విజువలైజేషన్ - ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ‘సాహిబా’ సాంగ్!
Tummala Nageswararao: తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - రూ.2 లక్షలకు పైబడిన వారికి రుణమాఫీపై మంత్రి కీలక ప్రకటన
తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - రూ.2 లక్షలకు పైబడిన వారికి రుణమాఫీపై మంత్రి కీలక ప్రకటన
Sai Durga Tej : 'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Embed widget