అన్వేషించండి

Brahmamudi July 27th: 'బ్రహ్మముడి' సీరియల్: దుగ్గిరాల ఇంటి ముందు మీడియా రచ్చ- సెలెబ్రెటీ అయిపోయానని చంకలు గుద్దుకున్న స్వప్న

స్వప్న బొల్డ్ యాడ్ షూట్ చేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

స్వప్న యాడ్ చూసి రాహుల్ మెచ్చుకున్నట్టు నటిస్తాడు. ఇదొక్కటి చాలు దీన్ని ఇంట్లో నుంచి గెంటేయడానికని రుద్రాణి అనుకుంటుంది. ఈ వీడియో వైరల్ అయితే తప్పకుండా తనని ఇంట్లో నుంచి గెంటేస్తారని రాహుల్ అంటాడు.

రుద్రాణి: సెలెబ్రెటీ కావాలని స్వప్న అనుకుంటుంది కదా. నువ్వే ఈ వీడియో గురించి మీడియాకి చెప్పు వాళ్ళే మిగతాది చేస్తారు అనేసరికి వెంటనే రాహుల్ ఆ పనిలో పడతాడు. ఇక కనకం, కృష్ణమూర్తిని తీసుకుని స్వప్న ఇంటికి వెళ్లాలని అనుకుంటారు. కావ్య, స్వప్నతో వరలక్ష్మి వ్రతం చేయించాలని పెద్దాయన్ని ఒప్పించమని కనకం అంటుంది. రాజ్ ఫోన్లో స్వప్న యాడ్ చూసి వెంటనే దాన్ని కావ్యకి చూపిస్తాడు. ఇంత జరుగుతుంటే మీ అక్క మొగుడు ఏం చేస్తున్నాడని రాజ్ ఆవేశంగా కిందకి వెళతాడు. ఇక ప్రెస్ వాళ్ళు ఇంటి ముందు రచ్చ రచ్చ చేస్తుంటే శుభాష్ ఆపుతాడు. రాజ్ వచ్చి ఏం కావాలని అంటే స్వప్నని ఇంటర్వ్యూ చేయాలని అంటారు. స్వప్న ఆత్రంగా బయటకి వెళ్తుంటే అపర్ణ, కావ్య ఆపుతారు. కానీ స్వప్న మాత్రం ఆగకుండా మీడియా ముందుకి వెళ్ళిపోతుంది. సీతారామయ్య వచ్చి ఏం జరుగుతుందని అడుగుతాడు. కళ్యాణ్ స్వప్న నటించిన యాడ్ ఇంట్లో అందరికీ చూపిస్తాడు. మీడియా వాళ్ళతో స్వప్న మాట్లాడుతుంటే కనకం వాళ్ళు వస్తారు.

Also Read: అత్తకి నిజం చెప్పేసిన వేద - మాళవికని ముసుగేసి కుమ్మేసిన మాలిని, అటు అభిమన్యుకి ఇత్తడే

విలేకరి: మీరు యాడ్ లో చాల తక్కువ బట్టలు వేసుకుని హాట్ గా కనిపించారు. ఇదంతా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా?

స్వప్న: మోడల్ గా కనిపించాలని చిన్నప్పటి నుంచి నా కల. అవకాశం దొరికింది ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహంతో నాకు పని లేదు

కావ్య బలవంతంగా స్వప్నని తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఏం జరుగుతుందోనని కనకం దంపతులు కంగారుగా ఇంట్లోకి వస్తారు.

రాజ్: రాహుల్.. స్వప్న బయట నుంచి వచ్చింది తనకి తెలియదు మరి నువ్వేం చేస్తున్నావ్

స్వప్న: ఇందులో రాహుల్ చేసింది ఏమిఈ లేదు మొత్తం నేనే చేశాను. అవకాశం నేనే వెతుక్కున్నా, మీడియాలో వచ్చే వరకు సర్ ప్రైజ్ చేయాలని అనుకున్నాను

అపర్ణ: ఏంటమ్మా ఇది ఏం బట్టలు అవి. ఏం విచ్చలవిడితనం అది. మా అందరికీ తల కొట్టేసినట్టు అయ్యింది. నువ్వు ఏది పడితే అది చేస్తే ఈ ఇంటి పరువు ఏమవుతుందో తెలుసా?

శుభాష్: ఇలాంటి యాడ్ చేయబోతున్నట్టు రాహుల్ తో లేదా మాతో చెప్పి ఉంటే పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదు పరువు పోయేది కాదు

స్వప్న: పరువు పోయేది ఏముంది ఒక సెలెబ్రెటీగా నన్ను పొగిడారు కదా

ఇంద్రాదేవి: రుద్రాణి కోడలు ఇంత చేస్తుంటే నువ్వేం చేస్తున్నావ్. కడుపుతో ఉన్న కోడలు ఏం చేస్తుందో ఎక్కడికి వెళ్లిందో తెలుసుకోవాల్సిన పని లేదా?

రుద్రాణి: మీరంతా దీన్ని వదిలేసి నా మీద పడతారని అనుకున్నా. ఆవిడ బజారులో బట్టలు తక్కువ వేసుకుని తైతక్కలాడుతుంది. ఈ క్షణం వరకు మీకు ఎంత తెలుసో నాకు అంతే తెలుసు. సంప్రదాయమైన ఆడవాళ్ళు కూడా తలదించుకునే విధంగా ఉంది. అసలు ఇలాంటి దానికి మన కుటుంబంలో ఉండే అర్హత లేదు. గెంటిపారేయండి దరిద్రం వదిలిపోతుంది.

స్వప్న: నేను ఏదో నేరం చేసినట్టు అలా మాట్లాడుతున్నారు. ఇది కూడా ఒక ప్రొఫెషన్ డైరెక్టర్ చెప్పినట్టు చేయాలి. ది గ్రేట్ దుగ్గిరాల ఫ్యామిలీ ఒక ఆడపిల్ల స్వేచ్చని అణిచివేస్తుందా? ఇంతేనా మీరు ఆలోచించేది? పైకి గొప్ప ఫ్యామిలీ అని అందరినీ సమానంగా చూస్తామని చెప్పి ఇంట్లో మాత్రం వంటింటి కుందేలు చేయాలని చూస్తారా?

Also Read: అమ్మని మళ్ళీ పెళ్లి చేసుకోమని తండ్రికి సలహా ఇచ్చిన దివ్య- నందు బర్త్ డే పార్టీలో లాస్య రచ్చ రచ్చ

కావ్య: చాలు ఆపు.. నీ భర్త, అత్తకి నీ సొంత చెల్లెలికి తెలియదు. ఇంత మందికి తెలియకుండా చెప్పకుండా నీకు నిర్ణయం తీసుకుని ఆ ఘనకార్యం చేసి స్త్రీ స్వేచ్చ గురించి మాట్లాడుతున్నావా? అలాంటివన్నీ ఈ ఇంట్లో కుదరదు. ఇక్కడ కట్టుబాట్లు ఉంటాయి. ఉమ్మడి కుటుంబం ఇది. ఒక్కరు పొరపాటు చేసినా అందరికీ అప్రదిష్ట అవుతుంది. నోరు మూసుకోకపోతే మర్యాదగా ఉండదు

స్వప్న: ఒసేయ్ ఇలాంటివి నీ దగ్గరే ఉంచుకో. ఇప్పటికే నీ హక్కులు కాలరాసి వంటింటి కుందేలు చేశారు అది గుర్తు పెట్టుకో

కావ్య: ఛీ నోర్ముయ్.. ఇది నా ఇల్లు అనే చేస్తున్నా

ఇంద్రాదేవి: కావ్యని మాట అనే హక్కు నీకు లేదు. స్వేచ్చ గురించి మాట్లాడుతున్నావా? స్వేచ్చ అంటే ఏంటి ఇంటి గుట్టు వీధిన పెట్టడమా? కావ్య ఇంటి గుట్టు గడప దాటకుండా చూసుకుంటుంది. ఒకే కుటుంబం నుంచి వచ్చిన అక్కాచెల్లెళ్లలో ఎంత వ్యత్యాసం ఉంది

స్వప్న: అంటే నేను ఎంచుకున్న రంగాన్ని తప్పు అంటారా?

ఇంద్రాదేవి: నువ్వు నటించిన యాడ్ లో దాని వల్ల నీకేమైన విలువ దక్కుతుందా? సంప్రదాయంగా అనిపించేవి చెయ్యి. అయినా అదంతా ఇప్పుడు కాదు డెలివరీ అయ్యేవరకు జాగ్రత్తగా ఉండాలి కదా

స్వప్న: అర్థం అయ్యింది మీరు ఇంత మందిలో నన్ను నిలబెట్టింది ఈ ఇంట్లో నాలుగు గోడల మధ్య బానిసలా బతకడానికి అనేసరికి కనకం గట్టిగా అరుస్తుంది. ఆవేశంగా వచ్చి లాగిపెట్టి కొట్టబోయి ఆగిపోతుంది.

కనకం: ఎవరితో ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు.. ఎక్కడ ఉండాల్సిన దానివి ఎక్కడ ఉన్నావో మర్చిపోయావా? ఇక్కడికి ఎలా వచ్చావో మర్చిపోయావా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Beggars: ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Beggars: ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Gukesh:  గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
Royal Enfield Bikes: త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Perni Nani: ఆజ్ఞాతం నుంచి బయటకు పేర్ని నాని - మచిలీపట్నం ఇంట్లో పార్టీ నేతలతో భేటీ
ఆజ్ఞాతం నుంచి బయటకు పేర్ని నాని - మచిలీపట్నం ఇంట్లో పార్టీ నేతలతో భేటీ
Embed widget