అన్వేషించండి

Gruhalakshmi July 26th: గృహలక్ష్మి సీరియల్: అమ్మని మళ్ళీ పెళ్లి చేసుకోమని తండ్రికి సలహా ఇచ్చిన దివ్య- నందు బర్త్ డే పార్టీలో లాస్య రచ్చ రచ్చ

నందు బర్త్ డే వేడుకల్లో కల్లోలం సృష్టించేందుకు లాస్య రెడీ అయిపోతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

దివ్య తండ్రి బర్త్ డే గ్రాండ్ గా సెలెబ్రేట్ చేయాలని అనుకుంటుంది. తండ్రి కోసం డ్రెస్ తీసుకొచ్చి అది వేసుకుని పార్టీకి రమ్మని అంటుంది. ఒంటరి వాడికి అసలు పుట్టినరోజు చేసుకోవడమే ఎక్కువ ఇంత గ్రాండ్ గా అవసరమా అని నందు అంటాడు. లాస్య పీడ విరగడ అయ్యిందని పండగ చేసుకోమని దివ్య సలహా ఇస్తుంది. తన జీవితాన్ని తనే నాశనం చేసుకున్నానని నందు బాధపడతాడు.

దివ్య: నువ్వు పాడు చేసుకున్న జీవితం గురించి ఆలోచిస్తున్నావ్. నువ్వు చెల్లాచెదురు చేసిన మరొక జీవితం గురించి ఆలోచించవా? సంబంధం లేదా?

నందు: మీ అమ్మకి చేసిన అన్యాయం తలుచుకుని బాధపడని రోజు లేదు

దివ్య: ఉన్న కొంచెం జీవితం బాధపడుతూ వృధా చేసుకోవడం అవసరమా? నీకు అమ్మతోడు కావాలి. మాకు మీ ఇద్దరూ కలిసి ఉండటం కావాలి. ప్రయత్నించి చూడు దేవుడు మరొక అవకాశం ఇచ్చాడని అనుకో. భారం దేవుడి మీద వెయ్యి. నీలో నిజాయితీ కనిపిస్తే అమ్మ ద్వేషించదు

Also Read: 'సాటి మనిషి' అంటూ రాజ్ తిక్క కుదిర్చిన కావ్య- వైరల్ గా మారిన స్వప్న యాడ్

ఇల్లంతా అందంగా డెకరేట్ చేస్తారు. విక్రమ్ కూడా పనుల్లో సాయం చేస్తూ ఉంటాడు. వద్దని చెప్పినా కూడా వినకుండా అల్లుడు, అమ్మాయి ఈ పార్టీ ఏర్పాటు చేశారని తులసి గొప్పగా చెప్తుంది. ఇక నందు కిందకి వస్తుంటే పూలు జల్లి మరీ తీసుకొస్తారు. బాబోయ్ చండాలంగా అనిపిస్తుంది. ఇక పార్టీకి వచ్చిన ఆడవాళ్ళు నందుకి విషెష్ చెప్పి లాస్య ఎక్కడని అడుగుతారు. లాస్యకి డివోర్స్ ఇచ్చానని కోపంగా చెప్తాడు. లాస్యకి కూడా డివోర్స్ ఇచ్చారా? అని అనేసరికి అందరీ మొహాలు మాడిపోతాయి. దివ్య తండ్రికి నచ్చజెపుతుంది.

రెండో పెళ్ళానికి కూడా డివోర్స్ ఇవ్వడం ఏంటని పార్టీకి వచ్చిన వాళ్ళు గుసగుసలాడుకుంటారు. లాస్య మీద పగ తీర్చుకోవడానికి తులసి మాజీ మొగుడిని దగ్గర చేసుకుంటుందని తప్పుగా మాట్లాడతారు. అవన్నీ నందు విని ఆవేశంగా వెళ్లబోతుంటే తులసి అడ్డుపడుతుంది. ఇక లాస్య గొడవ చేసేందుకు ఇంటికి వస్తుంది. లాస్యని చూడగానే ఒక బేరర్ వచ్చి తనని పలకరిస్తాడు. వచ్చిన గెస్ట్ లకు మామూలు డ్రింక్స్, నందగోపాల్ ఫ్యామిలీకి మత్తు కలిపిన కూల్ డ్రింక్స్ వెళ్తాయని అతడు చెప్తాడు. తులసికి ఎలాగైనా ఈరోజు తన మనసులో మాట చెప్పాలని నందు తెగ ట్రై చేస్తాడు. లాస్య రావడం చూసిన తులసి ఏదో పెంట పెట్టబోతుందని అనుకుని తనని పంపించాలని ఎదురువెళ్తుంది. ఇద్దరూ వాదులాడుకోవడం నందు చూసి తను కూడా వెళతాడు.

నందు: నువ్వు ఎందుకు వచ్చావు

లాస్య: నీ మాజీ భార్య ఇప్పటి వరకు ఇదే పీక్కుని తిన్నది. ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా?

Also Read: యష్ కి తలస్నానం చేయించిన మాళవిక, వాత పెట్టిన వేద- వసంత్ కాపురంలో చిచ్చుపెట్టబోతున్న గీత

నందు: కోర్టు మనకి విడాకులు ఇచ్చింది నీకు నాకు సంబంధం లేదు

లాస్య: తులసికి నీకు కూడా ఇచ్చింది కదా మరి ఎందుకు తనని పట్టుకుని వేలాడుతున్నావ్. తులసిని తరిమేయ్ నేను నీ జోలికి రాను

నందు: చెప్పడానికి నువ్వు ఎవరు

లాస్య: నేను తులసిలాగే మాజీ భార్యని. నిజం చెప్పాలంటే తాజా మాజీ భార్యని

లాస్య ఇచ్చిన బొకేని నందు తన కాలి కింద వేసి తొక్కేస్తాడు. తనని బలవంతంగా బయటకి గెంటేయబోతుంటే అందరూ ఆపుతారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Telangana Weather Updates: ఏపీ, తెలంగాణకు వర్ష సూచన - ఆ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: IMD అలర్ట్
ఏపీ, తెలంగాణకు వర్ష సూచన - ఆ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: IMD అలర్ట్
Celebrities Voting: మరికొన్ని గంటల్లో పోలింగ్.. చిరంజీవి, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్ సహా - ఎవరెవరు ఎక్కడ ఓటు వినియోగించుకోనున్నారంటే!
మరికొన్ని గంటల్లో పోలింగ్.. చిరంజీవి, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్ సహా - ఎవరెవరు ఎక్కడ ఓటు వినియోగించుకోనున్నారంటే!
IPL 2024: బెంగళూరు పాంచ్‌ పటాకా,  ఢిల్లీపై ఘన విజయం
బెంగళూరు పాంచ్‌ పటాకా, ఢిల్లీపై ఘన విజయం
Relationship Tips : ఆ సామర్థ్యం పెరగాలంటే.. మగవారు, ఆడవాళ్లు తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే
ఆ సామర్థ్యం పెరగాలంటే.. మగవారు, ఆడవాళ్లు తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Telangana Loksabha Election 2024 | తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైన పోలింగ్ | ABP DesamStormy Winds in Pulivendula EVM Distribution Center | పులివెందుల ఈవీఎం పంపిణీ కేంద్రంలో వర్షం | ABP DesamRoyal Challengers Bengaluru vs Delhi Capitals | ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆర్సీబీ విజయం | ABP DesamRavindra Jadeja Obstructing The Field | వివాదంగా మారిన రవీంద్ర జడేజా వికెట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Telangana Weather Updates: ఏపీ, తెలంగాణకు వర్ష సూచన - ఆ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: IMD అలర్ట్
ఏపీ, తెలంగాణకు వర్ష సూచన - ఆ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: IMD అలర్ట్
Celebrities Voting: మరికొన్ని గంటల్లో పోలింగ్.. చిరంజీవి, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్ సహా - ఎవరెవరు ఎక్కడ ఓటు వినియోగించుకోనున్నారంటే!
మరికొన్ని గంటల్లో పోలింగ్.. చిరంజీవి, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్ సహా - ఎవరెవరు ఎక్కడ ఓటు వినియోగించుకోనున్నారంటే!
IPL 2024: బెంగళూరు పాంచ్‌ పటాకా,  ఢిల్లీపై ఘన విజయం
బెంగళూరు పాంచ్‌ పటాకా, ఢిల్లీపై ఘన విజయం
Relationship Tips : ఆ సామర్థ్యం పెరగాలంటే.. మగవారు, ఆడవాళ్లు తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే
ఆ సామర్థ్యం పెరగాలంటే.. మగవారు, ఆడవాళ్లు తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే
Palnadu News: రెంటచింతలలో వైసీపీ, టీడీపీ పరస్పర దాడులు- వాహనాలు ధ్వంసం, ఉద్రిక్తత
రెంటచింతలలో వైసీపీ, టీడీపీ పరస్పర దాడులు- వాహనాలు ధ్వంసం, ఉద్రిక్తత
Arundhati Child Artist: 'అరుంధతి'లోని ఈ చిన్నారి జేజమ్మ ఇప్పుడెలా ఉందో చూశారా? - ప్రస్తుతం ఏం చేస్తుందంటే!
'అరుంధతి'లోని ఈ చిన్నారి జేజమ్మ ఇప్పుడెలా ఉందో చూశారా? - ప్రస్తుతం ఏం చేస్తుందంటే!
Modi Nomination: మే 14న పుష్య నక్షత్రంలో ప్రధాని మోదీ నామినేషన్, గ్రహాలు అనుకూలిస్తాయట
Modi Nomination: మే 14న పుష్య నక్షత్రంలో ప్రధాని మోదీ నామినేషన్, గ్రహాలు అనుకూలిస్తాయట
BRS Complaints to EC: కాంగ్రెస్ పార్టీపై ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు, చర్యలకు రిక్వెస్ట్ - ఎందుకంటే!
కాంగ్రెస్ పార్టీపై ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు, చర్యలకు రిక్వెస్ట్ - ఎందుకంటే!
Embed widget