By: ABP Desam | Updated at : 16 Aug 2023 08:34 AM (IST)
Image Credit: Disney Plus Hotstar/ Star Maa
మాళవిక ఫోన్ చేసినప్పుడు నువ్వు హీరోలా వచ్చావు. అప్పుడు నేను అక్కడే ఉన్నాను. నువ్వు వెళ్ళగానే తన దగ్గరకి వచ్చా.. మాటల్లో పెట్టి పూర్తిగా నమ్మించాను. ఆ తర్వాత మాళవికని నేనే చంపాను అని అభి చెప్పేసరికి యష్ ఆవేశంగా తనని కొట్టడానికి కారు నుంచి దిగుతాడు.
దుర్గ: నువ్వు అసలు ఎవరి అండర్ లో ఉన్నావో అర్థం అవుతుందా? ఈ విట్ నెస్ చాలు నువ్వు పర్మినెంట్ గా జైల్లో ఉండటానికి
యష్: మాళవికని చంపింది వీడే మేడమ్. ఇప్పుడే వచ్చి నాతో చెప్పాడు
అభి: నేనా.. నేను చంపినట్టు నీకు చెప్పానా? చూశారా మేడమ్ ఎంత అబద్దం చెప్పి నాటకం ఆడుతున్నాడో. తనని చంపాల్సిన అవసరం నాకు ఎందుకు ఉంటుంది. ఆడవాళ్ళని అభిమానిస్తానే గాని హత్యలు చేయను. అనవసరంగా గొడవలు ఎందుకు కేసు ఒప్పేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పడానికి వచ్చాను. ఇక తనని బాగా ఇరికించానని మనసులో అనుకుని వెళ్ళిపోతాడు
Also Read: నిజం చెప్పకుండా నందుని బంధించిన మురారీ- కన్నీళ్ళతో అత్తింటిని వీడిన కృష్ణ
వేద అమ్మవారి గుడికి వచ్చి యష్ పేరు మీద పూజ చేయిస్తుంది. దణ్ణం పెట్టుకుంటుంటే పక్కనే ఒక బాబు కింద పడిపోతాడు. వేద వెళ్ళి వాడిని పైకి లేపుతుంది. బాబు తల్లి వచ్చి వాడిని తిడుతుంటే వేద ఆపుతుంది. పిల్లల మనసుని బాధపెట్టకూడదు ఆనందపరచాలని అంటుంది. ఆవిడ వేదకి థాంక్స్ చెప్పి వెళ్ళిపొగానే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఒక పెద్దావిడ వచ్చి పరీక్షించి తను గర్భవతి అని తెలుసుకుంటుంది.నీళ్ళు తెచ్చి తన మొహం మీద చల్లి స్పృహ వచ్చేలా చేస్తారు.
పెద్దావిడ: ఎంత అదృష్టవంతురాలివో నువ్వు. గుడిలో నీ కడుపు పండింది. నువ్వు చాలా అదృష్టవంతురాలివి
వేద: మీరు ఏం అంటున్నారో నాకు అర్థం కావడం లేదు
పెద్దావిడ: నువ్వు తల్లివి కాబోతున్నావ్
ఆ మాటకి వేద చాలా సంతోషంగా ఉంటుంది. ఆ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. వెంటనే ఈ విషయం చెప్పడం కోసం యష్ దగ్గరకి వెళ్తుంది.
యష్: వేద నీకు నేనొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇది కేసుకు చాలా కీలకం
వేద: ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని చెప్పినా కూడా వినే పరిస్థితిలో లేడని అనుకుని మౌనంగా ఉంటుంది
యష్: మాళవికని హత్య చేసింది అభిమన్యు. వాడే స్వయంగా కోర్టు దగ్గర నాకు వచ్చి చెప్పాడు. వాడు హత్య చేసి దాన్ని నా మీదకి నెట్టాడు
వేద: వాడిని పట్టుకుని ఎలాగైనా నిజాన్ని బయట పెడతాను
Also Read: పొట్ట చెక్కలయ్యేలా నవ్వించేసిన రాజ్, కావ్య- కుళ్ళుతో ఉడుక్కుంటున్న స్వప్న
యష్: ఏసీపీ కి ఈ విషయం చెప్తాను
వేద: సాక్ష్యాధారాలు కావాలని అంటారు. మీరు ధైర్యంగా ఉండండి నేను మళ్ళీ వస్తాను అని తల్లికాబోతున్న విషయం చెప్పకుండానే వెళ్ళిపోతుంది. ఈ గుడ్ న్యూస్ యష్ కి చెప్పిన తర్వాత ఇంట్లో వాళ్ళకి చెప్పాలని మనసులో అనుకుంటుంది.
మళ్ళీ అమ్మవారి దగ్గరకి వచ్చి చేతిలో హారతి కర్పూరం వెలిగించుకుని తన బాధ వెళ్లబోసుకుంటుంది. అది నీలాంబరి చూసి ఏంటి నువ్వు చేస్తున్న పని మనసులో బాధపడుతుంది. నీ భర్త కోసం ఇంత త్యాగం చేస్తున్నావా? ఇది మన ఆడవాళ్ళకి గర్వకారణం. నీ మంచి కోసం నేను నీకు అండగా ఉంటాను. ఒక మంచి కోసం నా వంతుగా నీకు సాయపడతాను అని నీలాంబరి అనుకుంటుంది. ఇక వేద కారులో వెళ్తూ ఉండగా వెనుక స్కూటీ మీద బుర్ఖా వేసుకున్న ఆమె కూడా ఉంటుంది. ఒక చోట వేద కారు ఆపుతుంది. అప్పుడే వెనుక స్కూటీ మీద ఉన్న ఆమె మొహం మీద బుర్ఖా గాలికి తొలగిపోతుంది. తను ఎవరో కాదు మాళవిక. వేద కారు అద్దంలో మాళవికని చూస్తుంది. వేద మాళవికని పిలిచే సరికి స్కూటీ వేసుకుని వెళ్ళిపోతుంది. కానీ వేద మాత్రం తన వెంట పరిగెడుతూ ఎట్టకేలకు ఒక చోట స్కూటీకి అడ్డం నిలబడి ఆపుతుంది. కానీ తీరా మొహం చూసేసరికి మాళవిక కాదు. వేద చేతి గాయం చూసి సులోచన తల్లడిల్లిపోతుంది.
Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ
బెదరగొట్టిన ‘యానిమల్’, రామ్ ‘స్కంద’.. ‘చంద్రముఖి-2’ ఎలా ఉన్నాయ్? ఇవీ ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలు
Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ గౌతమ్ మెడపై గాయాలు - తేజను తిట్టిపోస్తున్న ప్రేక్షకులు
Bigg Boss Season 7 Latest Promo: ఓరి వీరి వేషాలో, చూస్తుంటునే డోకు వస్తోందిగా - వింత అవతారాల్లో ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్లు, దెయ్యం పిల్లగా ప్రియాంక!
Bigg Boss Updates: ‘బిగ్ బాస్’ హౌస్లో ఫుడ్ లొల్లి - శివాజీ దుమ్ముదులిపిన శోభా శెట్టి, యావర్ హర్ట్!
Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు
Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !
Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం
BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది
/body>