Krishna Mukunda Murari August 15th: నిజం చెప్పకుండా నందుని బంధించిన మురారీ- కన్నీళ్ళతో అత్తింటిని వీడిన కృష్ణ
కృష్ణ అత్తింటిని వీడి వెళ్లిపోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
తమకి చీర కట్టుకున్న కృష్ణ నచ్చుతుందని ప్రసాద్ చెప్తాడు. మీ అందరికీ మాది అగ్రిమెంట్ మ్యారేజ్ అని చెప్పలేక వేషం మార్చి పెళ్లి కానీ కృష్ణవేణిలాగా రెడీ అయ్యానని కృష్ణ మనసులో అనుకుంటుంది.
భవానీ: తింగరిపిల్ల నువ్వు క్యాంప్ నుంచి తిరిగి రాగానే నీకోసం ఒక సర్ ప్రైజ్ ప్లాన్ చేశాను
కృష్ణ: ఏంటి అది పెద్దత్తయ్య( క్యాంప్ నుంచి తిరిగి రాలేనని ఎలా చెప్పాలి అత్తయ్య మీకు)
రేవతి: కృష్ణ క్యాంప్ అయిపోగానే తిరిగి వస్తావ్ కదా
కృష్ణ: తిరిగి రావాలంటే వెళ్ళాలి కదా
Also Read: పొట్ట చెక్కలయ్యేలా నవ్వించేసిన రాజ్, కావ్య- కుళ్ళుతో ఉడుక్కుంటున్న స్వప్న
నందు: మురారీని ఒక కంట కనిపెడుతూ ఉండు నేను సమయం చూసి కృష్ణతో అన్నయ్య ప్రేమ సంగతి చెప్తానని గౌతమ్ తో చెప్తుంది.
అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. రోజు రేవతి అత్తయ్య వడ్డించడం ఎందుకని కృష్ణ అంటుంది. అయితే ఏంటి అందరికీ ఈరోజు ఎవరికి వాళ్ళే వడ్డించుకుని బఫె మాదిరిగా తిందామా అని మురారీ అంటాడు. అవును మనసులో మాట భలే చెప్పారని కృష్ణ చెప్తుంది.
నందు: మొగుడు పెళ్ళాలు అంటే అంతే కదా కృష్ణ. ఒకరి మనసు గురించి మరొకరికి తెలిసిపోతుంది
కృష్ణ: మొగుడు పెళ్ళాలు వినడానికి ఎంత బాగుందో కానీ నాకు ఆ అదృష్టం లేదు నందు అని మనసులో బాధపడుతుంది. బ్రేక్ ఫాస్ట్ ని మోచేయి ఫోల్డ్ చేయకుండా తినాలి పెద్దత్తయ్య
మధుకర్: అది చాలా కష్టం కృష్ణ
కృష్ణ: అసలు కష్టమే కాదు అని చెయ్యి వంచకుండా రేవతికి తినిపిస్తుంది. ఇలా ఒకరికొకరు తినిపించుకుంటే ఎవరూ చేతులు ఫోల్డ్ చేయాల్సిన పని లేదు
మురారీ భవానీకి, ముకుంద కృష్ణకి తినిపిస్తుంది. ఆ తర్వాత మురారీ దగ్గరకి ముకుంద వచ్చి తినిపిస్తుంది. ఇక కృష్ణకి భవానీ కూడా తినిపిస్తుంది. మురారీ కూడా ముకుందకి తినిపిస్తాడు. అది చూసి రేవతి భయపడుతుంది. చివరి సారిగా మురారీ కృష్ణకి తినిపిస్తాడు. ఆ సీన్ ఎమోషనల్ గా అనిపిస్తుంది. అలా ఇంట్లో అందరూ ఒకరికొకరు తినిపించుకుంటారు. గదిలో కృష్ణ, మురారీ ఉండగా నందు వచ్చి వెళ్లిపోతున్నావా అని అడుగుతుంది.
కృష్ణ: అవును నందు క్యాంప్ కి వెళ్తున్నా
మురారీ తన ప్రేమ గురించి చెప్పొద్దని సైగ చేసినా కూడా నందు ఆగదు.
నందు: నువ్వు ఎవరినైనా ప్రేమించావా కృష్ణ
Also Read: దిమ్మతిరిగే ట్విస్ట్- హత్య తానే చేశానని యష్ కి చెప్పిన అభిమన్యు- మాళవిక నిజంగా చనిపోలేదా?
కృష్ణ: ఎందుకు ఇలా అడుగుతుంది. ఇప్పుడు ఏం చెప్పాలని మనసులో అనుకుని ఎందుకు నందు సడెన్ గా అలా అడిగావ్
నందు: అసలు నీకు మనసు ఉందో లేదో తెలుసుకుందామని అనిపించింది
మురారీ: ఇంకా ఇక్కడే ఉంటే నిజం చెప్పేసేలా ఉందనుకుని కృష్ణని కిందకి వెళ్ళమని చెప్తాడు
నందు: నేనేం చిన్నపిల్లని కాదు నాకు అన్నీ తెలుసు
మురారీ: కృష్ణ ఇది మా పర్సనల్ అని చెప్పాను కదా కిందకి వెళ్లిపో అని అరుస్తాడు
దీంతో కృష్ణ కోపంగా వెళ్ళిపోతుంది. నందు అరవకుండా తన నోటిని చేత్తో మూసేస్తాడు. ఇప్పుడు తనని వదిలేస్తే నిజం చెప్పేస్తుందని అనుకుని తన నోటికి ప్లాస్టర్ వేసి చేతులు కట్టేసి గదిలో బంధించి ఏమి తెలియనట్టు కిందకి వెళ్ళిపోతాడు. కృష్ణ ఇంట్లో అందరికి వెళ్లొస్తానని చెప్పి ఎమోషనల్ అవుతుంది. భవానీ కృష్ణని ప్రేమగా దగ్గరకి తీసుకుంటుంది. వెక్కి వెక్కి ఏడుస్తుంటే నువ్వు ఏదో శాశ్వతంగా వెళ్లిపోతున్నట్టు అలా బాధపడుతున్నావ్ ఏంటని భవానీ అడుగుతుంది. కృష్ణ వాలకం చూస్తుంటే మళ్ళీ తిరిగి వచ్చేలా లేదని అలేఖ్య అనుకుంటుంది. కృష్ణ చివరి సారిగా ఇంట్లో అందరినీ చూసుకుని బాగా ఏడుస్తుంది. మధుకర్ ని పిలిచి పెన్ డ్రైవ్ ఇచ్చి తను వెళ్ళిన తర్వాత టీవీలో ప్లే చేసి చూపించమని చెప్తుంది.