Brahmamudi August 15th: 'బ్రహ్మముడి' సీరియల్: పొట్ట చెక్కలయ్యేలా నవ్వించేసిన రాజ్, కావ్య- కుళ్ళుతో ఉడుక్కుంటున్న స్వప్న
కావ్య తన పుట్టింటికి సాయం చేయాలని డిసైడ్ కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
సీతారామయ్య దృష్టిలో పడాలని కావ్య తెగ తిప్పలు పడుతుంది. ఇంకా పుట్టింటికి వెళ్లలేదు ఏంటి అని తనని అడుగుతారని కావ్య ఎదురుచూస్తుంది. తన ప్రవర్తన చూసి రాజ్ ఇది ఏదో కొంప ముంచే పనిలో ఉంది అదేంటో తెలుసుకోవాలని మనసులో అనుకుంటాడు.
కావ్య: తాతయ్య మీకు ఏమైనా కావాలంటే నన్ను పిలవండి నేను కిచెన్ లో అంట్లు తోముకుంటూ బూజు దులుపుకుంటూ ఉంటాను
సీతారామయ్య: అదేంటమ్మా ఈరోజు నుంచి నువ్వు మీ నాన్న దగ్గరకి వెళ్ళి పని చేస్తాను అన్నావ్ కదా
తాతయ్య చుట్టు ఎందుకు తిరుగుతుందా అనుకున్నా ఇది నన్ను ఇరికించిందా అని రాజ్ బిత్తరపోతాడు.
కావ్య: నేను వెళ్లాలని అనుకున్నా కానీ మీ మనవడు వద్దని అన్నాడు
సీతారామయ్య: అదేంటి ఎందుకు వెళ్లొద్దని అన్నావ్
రాజ్: పర్మినెంట్ గా కాదు ఈరోజు మాత్రమే వద్దని అన్నాను. ఈరోజు మంచి రోజు కాదని పంతులు చెప్తే వద్దని చెప్పాను. రేపటి నుంచి వెళ్తుంది
Also Read: దిమ్మతిరిగే ట్విస్ట్- హత్య తానే చేశానని యష్ కి చెప్పిన అభిమన్యు- మాళవిక నిజంగా చనిపోలేదా?
ఇంకా కావ్య ఏం ఇరికిస్తుందోనని రాజ్ కావ్యని గదిలోకి తీసుకొచ్చేస్తాడు. తన చేతిని పట్టుకునే సరికి కావ్య సిగ్గుపడుతూ ఉంటుంది. కావాలనే తాతయ్య దగ్గర ఓవర్ యాక్షన్ చేశావ్ కదా అని అడుగుతాడు. లేదని చెప్తూ మరింత ఓవర్ యాక్షన్ చేస్తుంది. చివరికి రాజ్ కావ్య మాట వింటాడు. వెంటనే రాజ్ శ్రీనివాసరావుకి ఫోన్ చేసి కాంట్రాక్ట్ తిరిగి వాళ్ళకే ఇచ్చేయమని చెప్తాడు. రాజ్ ఫోన్ మాట్లాడటం స్వప్న వింటుంది. రాహుల్ దగ్గరకి కోపంగా వెళ్ళి అరుస్తుంది.
స్వప్న: నా వెంట పడి మరీ ప్రేమించావ్ కానీ ఏం ప్రయోజనం. అక్కడ కావ్య అంటేనే ఇష్టం లేదని చెప్పిన రాజ్ మాత్రం తన భార్యని ఎంతో సంతోషంగా చూసుకుంటున్నాడు. అడిగినవన్నీ ఇస్తున్నాడు. నువ్వు ఉన్నావ్ అడిగినా చేయడం లేదు సిగ్గు ఉండాలి
రాజ్ వాళ్ళ మాటలు వింటూ నేనా కళావతికి అన్నీ చేస్తున్నానా? ఎక్కడ చేశాను అనుకుంటాడు.
రాహుల్: ఇప్పుడు నీకు ఏం తక్కువ అయ్యింది
స్వప్న: ప్రేమ.. రాజ్ కావ్య అవసరాలు అన్నీ చూసుకుంటున్నాడు. తనకి కష్టం వస్తే పక్కనే ఉండి చూసుకుంటున్నాడు. కానీ నువ్వు మాత్రం విగ్రహంలా ఒకేచోట కూర్చున్నావ్. నా చెల్లెలు ఏం మందు పెట్టిందో కానీ తను ఎలా చెప్తే అలా ఆడుతున్నాడు.
అసలు ఎందుకు వచ్చింది, ఎందుకు తిట్టింది ఎందుకు వెళ్లిపోతుందని రాహుల్ బిత్తరపోతాడు. ఇక రాజ్ తన గురించి ఇంట్లో ఇలా అనుకుంటున్నారా? కళావతి చేతిలో పప్పెట్ లా మారిపోయానా? లాభం లేదు ఏదో ఒకటి చేయాలని మళ్ళీ ఆవేశంగా గదిలోకి వెళ్ళిపోతాడు. కళావతిని వెళ్లకుండ ఎలా ఆపాలి జ్వరం వచ్చిందని పడుకుంటే అని అనుకుంటే వెంటనే రాజ్ అంతరాత్మ విచిత్రమైన గెటప్ లో బయటకి వస్తుంది. కళావతిని దారుణంగా ప్రేమిస్తున్నాను అనుకుంటున్నారు. అలా జరగడానికి వీల్లేదు. నాకు జ్వరం వచ్చినట్టు బెడ్ మీద పడుకుంటానని అంటాడు.
అంతరాత్మ: చీ చీ ఐడియా చెత్తగా ఉంది. తనని వయలెన్స్ తో కాదు రొమాంటిక్ గా పడేయ్
Also Read: కట్టుబొట్టు మార్చిన తింగరిపిల్ల- భవానీ నిర్ణయంతో కృష్ణ తిరిగి ఇంటికి వస్తుందా?
రాజ్: అంత లేదు
అంతరాత్మ: సరే నూనె కింద పోయి దాని మీద కాలు వేసి పడిపోతుంది
రాజ్: పడితే ఏమవుతుంది
అంతరాత్మ: అప్పుడు మన పెళ్ళాం కింద పడుతుంది కదా తనని తీసుకెళ్ళాల్సిన పని లేదు కదా అనేసరికి రాజ్ నూనె తీసుకుని వాష్ రూమ్ ముందు పోస్తాడు. దాని మీద కాలు వేసి కావ్య జారీ పడిందని తెగ చప్పట్లు కొట్టుకుంటాడు. కాసేపటికి అంతరాత్మ అక్కడ అసలు ఏం జరగలేదు.. ముందు నూనె పోయి అని తిడతాడు.
ఇక అప్పు కళ్యాణ్ తో కలిసి అనామిక ఇల్లు వెతకడం కోసం తిప్పలు పడతారు. అనామిక ఫోన్ చేసిన నెంబర్ అడ్రస్ పట్టుకుని వెళ్ళి తనకి షాక్ ఇవ్వాలని కళ్యాణ్ అంటాడు. ఇక రాజ్ నిజంగానే వాష్ రూమ్ ముందు నూనె పోస్తాడు. కావ్య బాత్ రూమ్ నుంచి బయటకి వచ్చి కింద ఉన్న నూనె చూస్తుంది. దాన్ని దాటుకుని వచ్చేస్తుంది. మీ పప్పులేమి ఉడకలేదు.. బయటకి రమ్మని అంటుంది. నేనే నూనె పోసాను అనడానికి సాక్ష్యం ఏంటని రాజ్ అడుగుతాడు. కావ్య ఫోన్ తీసుకొచ్చి వీడియో చూపిస్తుంది. ఇంత నూనె చూపు ఎలా వచ్చిందే నీకు అని కావ్యని తిడతాడు. బయటకి తీసుకెళ్లడం మీకు ఇష్టం లేదని అర్థం అయ్యింది అందుకే ఆ పని చేశానని చెప్పేసరికి తిట్టుకుంటాడు.
రేపటి ఎపిసోడ్లో..
కావ్యని రాజ్ స్వయంగా పుట్టింట్లో దింపుతాడు. జీడిపప్పు ఉప్మా చేశానని తినమని రాజ్ వెంట పడుతూ ఉంటుంది. అప్పుడే రాజ్ వెళ్ళి బొమ్మల కోసం పోసిన మట్టిలో కాలు వేస్తాడు. కృష్ణమూర్తి వాళ్ళు బయటకి వచ్చి ఏమైందని అడుగుతారు. ఇలాంటి మంచి పనులు మా ఆయన చేస్తారని ఇరికిస్తుంది. ఇక ఇద్దరూ కలిసి మట్టి తొక్కడాన్ని రాహుల్ మనిషి వీడియో తీసి రుద్రాణికి పంపిస్తాడు. అది కాస్త పోయి అపర్ణకి చూపిస్తుంది. కొడుకు చేసే పని చూసి అపర్ణ షాక్ అవుతుంది.