Chinni Serial Today October 31st: చిన్ని సీరియల్: మధు-మ్యాడీల మధ్య ప్రేమ చిగురిస్తుందా? లోహిత పెళ్లి రహస్యం బయటపడుతుందా?
Chinni Serial Today Episode October 31st లోహిత మధు, మ్యాడీ అందరూ కాలేజ్‌కి వెళ్లడం సంజు మధుని ఏడిపించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తకిరంగా మారింది.

Chinni Serial Today Episode మధు లోహితతో నేనే మీకు ఇబ్బంది పెడుతున్నా అని మ్యాడీతో చెప్తున్నావ్ ఏంటి అని అడుగుతుంది. దానికి లోహిత అవును నేను ఆ ఇంటికి వెళ్లి రాజభోగాలు అనుభవించేస్తానేమో అని భయంతో నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావ్ అంటుంది. మధు లోహితో నీకు బుద్ధి ఉందా.. నువ్వు వరుణ్ ఎంత బాధ పడుతున్నారో నాకు తెలుసు మీరు ఆ ఇంటికి ఎలా వెళ్తారా అని నేను ప్రయత్నిస్తుంటే నువ్వేంటి ఇలా అంటున్నావ్ అని కోప్పడుతుంది. మొదటి నుంచి నీకు నా మీద చాలా కోపం ఉంది.. అందుకే ఇలా మాట్లాడుతున్నావ్.. ఇప్పటికైనా మనసు మార్చుకో అని మధు చెప్తుంది.
ఆఫ్ టికెట్ పంపిన వ్యక్తి బాలరాజుని చూశానని ఆఫ్ టికెట్‌తో చెప్తాడు. ఆఫ్ టికెట్ చాలా సంతోషపడతాడు. బాలరాజుని దారుణంగా కొడుతున్నారని ఆ దేవా సార్ చాలా దుర్మార్గుడని చెప్తాడు. బాలరాజుని తప్పించాలని ఆఫ్ టికెట్ అంటాడు. మహి, చిన్ని కాలేజ్‌కి బయల్దేరుతారు. లోహిత తన అన్నయ్య ఉంటాడని కాలేజ్‌కి వెళ్లకూడదు అనుకొని తలనొప్పి అని అంటుంది. పరీక్షలు ఉన్నాయి కదారా అని మధు, మ్యాడీ పిలుస్తారు. దాంతో లోహిత వెళ్తుంది. లోహిత మధుతో నేను మ్యాడీ స్కూటీలో వస్తాం నువ్వు వెనక బస్సులో రా అని లోహిత అంటుంది. మధు మనసులో నేను మ్యాడీ వెళ్లడం ఇష్టం లేదని ఇలా చెప్తుంది అనుకొని నేను మ్యాడీ స్కూటీలో వెళ్తాం నీకోసం వేరే ఏర్పాటు చేశా అని మధు ఫ్రెండ్ కారు తెప్పిస్తుంది.
లోహిత మనసులో నువ్వు మ్యాడీతో స్కూటీలో రావడానికి నాకు కారు ఏర్పాటు చేశావా అనుకుంటుంది. లోహి వెళ్లిపోతుంది. మధు, మ్యాడీ స్కూటీలో వెళ్తారు. స్కూటీ పక్కన ఆపి మధు మ్యాడీకి చాక్లెట్ ఇచ్చి తినమని అంటుంది. తర్వాత ఇద్దరూ కలిసి కొబ్బరి బొండాం తాగుతారు. మ్యాడీ తిన్న చాక్లెట్ కవరు దాచుకున్న మధు, కొబ్బరి బొండాం తాగిన స్ట్రా కూడా మ్యాడీ చూడకుండా దాచుకుంటుంది.
నాగవల్లి ఇంట్లో జరిగిన గొడవ తలుచుకొని బాధ పడుతుంది. శ్రేయ కాలేజ్‌కి వెళ్తూ మన ఇంట్లో మన వాడు ఒకడు కాలేజ్‌లో ఉన్నాడు అనే ధైర్యం ఉండేది.. ఇప్పుడు అది లేదు అని వసంతం బాధ పడితే ఇంట్లో లేకపోతే ఏంటి అమ్మా బావ కాలేజ్‌లో ఉంటాడు నన్ను చూసుకుంటాడు అని అంటుంది. వాడు కాలేజ్‌కి వస్తే సరిపోదు ఇంట్లోకి రావాలి. మనతో ఉండాలి అప్పుడుకానీ నాకు తృప్తిగా ఉండదు అని వల్లీ అంటుంది. ప్రమీల, వసంత నాగవల్లిని ఓదార్చుతారు.
మధు మీద కోపంతో ఉన్న నాగవల్లి మధు పరీక్షలు రాయకుండా చేయాలి అనుకుంటుంది. తన పీఏని పిలిచి ప్లాన్ చెప్తుంది. మధు, మ్యాడీ కాలేజ్‌కి వస్తారు. మధు లోహిత దగ్గరకు వెళ్లి పిలుస్తుంది. మ్యాడీ నీతో మాట్లాడాలి అంటున్నాడని చెప్పి తీసుకెళ్తుంది. లోహి, మధు ఉప్పు నిప్పుగా ఉండేవాళ్ల వీళ్లిద్దరూ కలిసి వస్తున్నారు ఏంటా అని శ్రేయ అనుకుంటుంది. మ్యాడీ లోహితతో నీ పెళ్లి గురించి ఎక్కడా తెలీకూడదు అని చెప్తారు. సంజు బ్యాచ్‌కి అస్సలు చెప్పొద్దని అంటారు.
సంజు మధు వెళ్తుంటే అడ్డుకొని పరీక్షలకు బాగా ప్రిపేర్ అయ్యావా లేదంటే చెప్పు నేను సాయం చేస్తాను అంటాడు. నీలాంటి వాళ్లకి వంద మందికి నేనే సాయం చేయగలను అని మధు చెప్పి వెళ్తుంటే సంజు మధుని పట్టుకోవాలని చూస్తాడు. ఇంతలో మ్యాడీ వచ్చి సంజుని పట్టుకొని మధు మీద చేయి వేయనివ్వకుండా చేస్తాడు. చదువు మీద ఫోకస్ పెట్టు అని సీరియస్ అవుతాడు. మధు మ్యాడీతో నన్ను ఇబ్బంది పెడితే ఇంతలా ఫీలయ్యావ్ నీ చిన్నిని చేస్తే అని అడిగితే నరికేస్తా అని మ్యాడీ అంటాడు. శ్రేయ, లోహిత కలుసుకొని హగ్ చేసుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















