Nuvvunte Naa Jathaga Serial Today October 31st: నువ్వుంటే నా జతగా: దేవా వర్సెస్ ఎమ్మెల్యే: హరివర్ధన్ కిడ్నాప్, మిథున సంచలన నిర్ణయం!
Nuvvunte Naa Jathaga Serial Today Episode October 31st హరివర్ధన్ కిడ్నాప్ అయిన విషయం రాహుల్, లలిత వాళ్లకి తెలియడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode హరివర్ధన్‌ని దేవుడమ్మ మనుషులు కిడ్నాప్ చేస్తారు. మిథున దేవా బైక్ వెనకే హరివర్ధన్ ఉంటాడు. మిథునని చూసి పిలవాలి అనుకుంటాడు. రౌడీలు దేవాని చూసి కిడ్నాప్ చేశామని దేవాకి తెలిస్తే చంపేస్తాడు అని అనుకుంటారు.
హరివర్ధన్ పిలవడానికి ప్రయత్నిస్తారు కానీ రౌడీలు గట్టిగా పట్టుకుంటారు. ఇక దేవా కంట పడకూడదు అని వెళ్లబోతూ బైక్‌ని ఢీ కొడతారు. దేవా దిగి రౌడీలతో గొడవ పడతారు. వాళ్లు దేవాకి సారీ చెప్తాడు. హరివర్ధన్ పిలవడానికి ప్రయత్నిస్తారు కానీ పిలవలేకపోతాడు. దేవా రౌడీని అనుమానిస్తే మిథున వచ్చి గొడవ వద్దు అని అంటుంది. మిథున దేవాని తీసుకొని వెళ్లిపోతుంది.
ప్రమోదిని వంట చేస్తుంటే ఆనంద్ ఆఫీస్‌కి టైం అయింది త్వరగా టిఫెన్ పెట్టు అంటాడు. రంగం కూడా వచ్చి ఆకలి అంటాడు. ఎవడ్రా ఇంట్లో అడుకుంటున్నాడు ఇంట్లో అని కాంతం వస్తుంది. దాంతో నేనే అని రంగం అంటాడు. ప్రమోదిని తన భర్తకి ఫస్ట్ టిఫెన్ పెడుతుంది. నాభర్తకి ఎందుకు పెట్టలేదు అని కాంతం అడిగితే నా భర్త ఉద్యోగానికి వెళ్తున్నాడు నీ భర్త వెళ్లడం లేదు కదా అని ప్రమోదిని అంటుంది. బిజినెస్ మెన్ రియలస్టేట్ కింగ్ అని కాంతం బిల్డప్ ఇస్తుంది.
హరివర్ధన్‌ని రౌడీలు ఒక చోట కట్టేస్తారు. నేను జడ్జిని నన్ను కిడ్నాప్ చేస్తారా అని హరివర్థన్ అంటే తెలుసు సార్ అంటూ ఎమ్మెల్యే ఎంట్రీ ఇస్తుంది. జడ్జిని కిడ్నాప్ చేస్తే ఏం అవుతుందో మీకు తెలుసా అని హరివర్థన్ అంటే హాయిగా తీర్పు చెప్పుకోకుండా దేవా కోసం మీరు సమస్యల్ని కొని తెచ్చుకున్నారని అంటుంది. దేవా తప్పు చేయలేదు అని నాకు తెలుసు అందుకే అతన్ని బయటకు తీసుకొచ్చా తర్వాత నీ కొడుకుని జైలు పాలు చేస్తా అని హరివర్థన్ అంటాడు. అందుకే మిమల్ని కిడ్నాప్ చేశామని ఎమ్మెల్యేఅంటుంది. ఈ కేసు నుంచి తప్పుకోండి కూల్‌గా ఇంటికి వెళ్తారు. లేదంటే చంపేస్తా అని బెదిరిస్తుంది. నీ కొడుకు ఒక్కడే జైలుకి వెళ్లాలా నువ్వు వెళ్తావా జైలుకి నువ్వు డిసైడ్ అవ్వు అని జడ్జి అనడంతో పొగరుతో మాట్లాడుతున్నారు సార్ తల పొగరు తగ్గించేయండి..అని చెప్పి వెళ్లిపోతుంది.
మిథున ఇంటికి వచ్చి అందరికీ ప్రసాదం పంచుతుంది. పెద్ద బావగారు, అక్క, చిన్నబావగారు అని అందరికీ ప్రసాదం ఇస్తుంది. కాంతానికి మిథున ఇవ్వదు.. నాకు ఇవ్వలేదు నేను నీ కంటికి కనిపించడం లేదా అని కాంతం అంటే లేదు అక్కాయ్ కనిపించడం లేదు నువ్వు దేవతగా ఉన్నావని అంటుంది. అందరి ముందు మిథున సెటైర్లు వేస్తుంది. ఇక మా ఆయనకు టిఫెన్ చేయాలి అని కాంతం చేస్తుంటే తోసేసి మిథున దోసెలేస్తుంది. నేను అక్క దీనికే తన్నుకుంటున్నాం నువ్వు మధ్యలో వచ్చి చేసుకుంటావా అన్ని ఇద్దరూ కొట్టుకుంటారు. ఇద్దరు తోటికోడళ్లు జుట్టులు పట్టుకునేంత పని చేస్తారు.
దేవా మిథునని లాక్కొని తీసుకెళ్లపోతాడు. మిథున గదిలో దేవా మీద పడిపోతుంది. ఇద్దరూ ఒకర్ని ఒకరు చూసుకొని ఉండిపోతారు. దేవా లేచి వెళ్లిపోతాడు. రాహుల్, త్రిపుర, లలిత హరివర్ధన్ కనిపించడం లేదని టెన్షన్ పడతారు. నా మనసు కీడు శంకిస్తుందని లలిత ఏడుస్తుంది. రాహుల్‌కి హరివర్ధన్ కిడ్నాప్ అయ్యారని తెలిసి షాక్ అవుతాడు. విషయం బయటకు చెప్పొద్దని అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















