Chinni Serial Today October 29th: చిన్ని సీరియల్: మ్యాడీ కోసం మధు అవమానాలు! దేవా ఆగ్రహం, మీడియా ప్రశ్నలు!
Chinni Serial Today Episode October 29th మధు నాగవల్లి, దేవాని బతిమాలడానికి వెళ్లడం మధుని నాగవల్లి గెంటేయడంతో మధు రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మ్యాడీ కోసం మధు మ్యాడీ వాళ్ల ఇంటికి వెళ్తుంది. ఎందుకు వచ్చావే అని నాగవల్లి మధుని అడుగుతుంది. దానికి మధు ఆంటీ గుడిలో కలిసినప్పటి నుంచి నేను అంటే మీకు కోపం ఆరోజు మీరు మా అమ్మని అవమానించారని నేను అలా ప్రవర్తించా.. ఆ రోజు నా తప్పే అలా ప్రవర్తించడం నాదే తప్పు అని అంటుంది.
దేవా దగ్గరకు వెళ్లి ప్రేమించుకున్న లోహి, వరుణ్‌లకు పెళ్లి చేయడం వల్ల మీకు అవమానం జరిగింది అది కూడా నా తప్పే నేను చేసిన తప్పు వల్ల మ్యాడీకి, వరుణ్‌కి శిక్షించొద్దు అని బతిమాలుతుంది. ఇంతలో మ్యాడీ మధుకి కాల్ చేస్తాడు. మధు కట్ చేస్తుంది. దేవాతో మీరు నాకు ఎలాంటి శిక్ష వేసినా భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ వాళ్లని మాత్రం ఇంట్లోకి రానివ్వండి అని బతిమాలుతుంది. మ్యాడీ మళ్లీ కాల్ చేస్తాడు. మధు మళ్లీ కట్ చేస్తుంది. కానీ ఫోన్ కట్ అవ్వకుండా ఆన్ అయిపోతుంది. 
మధు నాగవల్లి వాళ్లని బతిమాలడం మ్యాడీ ఫోన్లో వింటాడు. షట్ అప్ నువ్వు ఎవర్తివే మాకు సలహాలు ఇవ్వడానికి.. చేయాల్సింది అంతా చేసి ఇప్పుడు నంగనాచిలా మాట్లాడుతున్నావ్.. నువ్వు అనేదానివి మ్యాడీకి పరిచయం కాకపోయి ఉంటే మా జీవితాలు బాగుండేవి శనిలా మా జీవితాల్లోకి వచ్చి మమల్ని బాధ పెడుతున్నావ్.. ఇంత మందిని బాధ పెట్టిన నువ్వు ఎలా బాగు పడతావో నేను చూస్తా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపో అని నాగవల్లి చెప్తుంది. ప్రమీల అయితే త్వరగా వెళ్లిపోమ్మా నీ మీద పీకల లోతు వరకు కోపంతో ఉన్న మా చిన్నమ్మాయి ఏం చేస్తుందో తెలీదు వెళ్లిపో అని అంటుంది. 
అందరు ఎంత చెప్పినా మధు వెళ్లకుండా ఇంకా బతిమాలడంతో నాగవల్లి మధుని లాక్కెళ్లి బయటకు తోసేస్తుంది. అప్పుడే మ్యాడీ వచ్చి మధుని పట్టుకుంటాడు. నన్ను ఇంట్లోకి రానివ్వమనడానికి నువ్వు ఇంట్లో నుంచి గెంటించుకుంటావా ఇంత అవమానం నీకు అవసరమా అని మ్యాడీ అంటాడు. మీరు కలవడం కోసం ఎన్ని అవమానాలు అయినా పడతా అని మధు అంటుంది. మధుతో ఇలా ప్రవర్తించడం తప్పు అని మ్యాడీ అంటే అది మనకు చెడు చేసింది అని నాగవల్లి అంటుంది. 
ఇంతలో ఇంటికి మీడియా వచ్చేస్తుంది. నాగవల్లి, దేవా చాలా కంగారు పడతారు. మినిస్టర్ అమ్మాయికి మీ మేనల్లుడికి పెళ్లి చేస్తా అని మాట తప్పారు.. మీ మేనల్లుడు ప్రేమ పెళ్లి చేసుకున్నాడు.. మీ మేనల్లుడితో పాటు మీ అబ్బాయి కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు నిజమేనా అని ప్రశ్నిస్తారు. మహి మీడియా ముందుకు వెళ్లి అన్నీ మా పర్సనల్ మీరు అడగొద్దు అంటే దేవేంద్ర వర్మ గారు రాజకీయనాయకుడు కదా అని అంటారు. 
ప్రాజానాయకుడు ప్రజల కోసం ఏం చేస్తున్నాడో అది తెలియాలి అంతే కానీ మా పర్సనల్ విషయాలు ఎందుకు తెలియాలి అని మ్యాడీ ఫైర్ అయిపోతాడు. ప్రతీ ఫ్యామిలీలోలానే సెలబ్రిటీ ఫ్యామిలీలో కూడా ఏవో కొన్ని సమస్యలు ఉంటాయి అవి అందరికీ తెలియాల్సిన అవసరం లేదు.. అని మ్యాడీ అంటాడు. దేవా ఊరుకోమని చెప్పినా మ్యాడీ వినడు. దాంతో మధు వెళ్లి మ్యాడీని సైలెంట్‌గా ఉండమని అంటుంది. దాంతో మ్యాడీ సైలెంట్ అయిపోతాడు. 
దేవా మనసులో నేను చెప్పినా నాగవల్లి చెప్పినా ఆగని వాడు ఆ పిల్ల చెప్తే ఆగుతాడా అని అనుకుంటాడు. ఇక దేవా మీడియాతో త్వరలోనే ప్రెస్ మీట్ పెడతా అంటాడు. దేవా కూలబడిపోతాడు. మొదటి సారి మీడియా ముందు ఓడిపోయా అని దేవా అంటే మ్యాడీ డాడీ అని వెళ్లబోతే నన్ను తాకే అర్హత నీకు లేదు రావొద్దు అని దేవా అంటాడు. వరుణ్ వాళ్లని వదిలేసి నువ్వు మా కొడుకుగా వచ్చుంటే నన్ను తాకే అర్హత ఉండేది కానీ నువ్వు చేసింది కరెక్ట్ అనుకొని ఈ అమ్మాయి కోసం వచ్చినందుకు నీకు నన్ను తాకే అర్హత కూడా లేదు అని అంటాడు.
మ్యాడీ తల్లితో ఏంటి అమ్మా డాడీ నన్ను పరాయి వాళ్లతో మాట్లాడినట్లు మాట్లాడుతున్నారు అంటే ఇప్పటికైనా మా ప్రేమ అర్థం చేసుకో.. పరువు తీసిన వరుణ్ వాళ్లని వాళ్లకి పెళ్లి చేసిన ఈ పిల్లని వదిలేసిరా అంటుంది. వసంత మ్యాడీతో నేను కూడా తప్పు చేసిన వరుణ్ వాళ్లకి దూరంగా ఉన్నాను కానీ మా అన్నయ్య వాళ్లకి కాదు నువ్వు ఇక్కడికి వచ్చేయ్‌రా అని అంటుంది. అందరూ మ్యాడీని పిలుస్తారు. మ్యాడీ మాత్రం ఏం మాట్లాడకుండా మధు చేయి పట్టుకొని తీసుకెళ్లిపోతాడు.
అందరూ ఏడుస్తారు. శ్రేయ లోహితకు కాల్ చేసి ఆ మహాతల్లికి ఇంకెప్పుడు ఇక్కడి రావొద్దు గొడవలు పెట్టొద్దు అని చెప్పు అని అంటుంది. లోహిత వరుణ్‌తో మధునే పెద్ద ప్రాబ్లమ్ అని అంటుంది. మధు మనల్ని ఇంటికి పంపాలని చూస్తుంది నెగిటివ్‌గా ఆలోచించకు అని వరుణ్ చెప్తాడు. మధుని మ్యాడీ చెప్పాపెట్టకుండా ఎందుకు వెళ్లావ్ నీకు ఎంత అవమానం జరిగింది అని అంటాడు. మధు మనసులో నేను కూడా అవమానం జరిగినట్లు బాధగా మాట్లాడుతా అప్పుడు మ్యాడీ ఇంటికి వెళ్లిపోతాడు అని అనుకుంటుంది. 
మ్యాడీ నీవల్ల ఎన్ని సార్లు అవమానపడాలి.. ప్రతీసారి మీ వాళ్లు చేసే అవమానం భరించడం నా వల్ల కాదు. ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే మా అమ్మానాన్న ఎంత బాధ పడతారో ఆలోచించావా.. మీ గొడవ ఊరిలో తెలిస్తే మిమల్ని మా ఇంట్లో పెట్టుకున్నందుకు ఎన్ని మాటలు అంటారో తెలీదా.. ముందు నువ్వు ఆ ఇంటికి వెళ్లిపోతే వరుణ్‌లోహిని తర్వాత తీసుకెళ్లొచ్చు కదా అలా ఎందుకు ఆలోచించవు.. అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.






















