Chinni Serial Today November 4th: చిన్ని సీరియల్: మధు స్కామ్ కేసులో ట్విస్ట్! మ్యాడీతో పాటు దేవా సాయం నిజమేనా?
Chinni Serial Today Episode November 4th మధుని స్కామ్‌లో ఇరికించిన వ్యక్తిని మ్యాడీ పట్టుకొని మధుకి హాల్‌టికెట్ వచ్చేలా చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode దేవేంద్ర వర్మ నాగవల్లితో ఆఫ్ టికెట్ బాలరాజు దగ్గరకు వచ్చాడని.. చిన్ని గురించి చెప్పాడని విషయం చెప్తాడు. చిన్ని గురించి చెప్పాడా అంటే ఇంకా లేదు కానీ చెప్తాడు.. చెప్పకపోతే మనం వదిలిపెట్టం కదా అంటాడు. మన టైం నడుస్తుంది అన్నీ మనం అనుకున్నట్లే జరుగుతున్నాయ్,, జరిగి తీరాలి అని దేవా అంటాడు.
స్కామ్‌లో ఇరుకున్న మధు ఏడుస్తుంటే చందు, మహి మధు దగ్గర కూర్చొంటారు. మ్యాడీ మధుతో నువ్వు బాధ పడకు మధు.. నువ్వే తప్పు చేయలేదు అని నేను నిరూపిస్తా అని అంటాడు. నిరూపించకపోతే నా పరిస్థితి ఏంటి మ్యాడీ అని మధు ఏడుస్తుంది. అందరూ నన్ను ఓ దొంగలా చూస్తారు అని ఏడుస్తుంది. చందు మధుతో నువ్వు ఏ తప్పు చేయలేదు అని మాకు తెలుసు నేను నా వంత ప్రయత్నం చేస్తా అని అంటాడు. రెండు గంటలే టైం ఉంది నేను నిర్దోషిగా నిరూపించుకోకపోతే నాకు హాల్‌టికెట్ ఇవ్వరు అని ఏడుస్తుంది. 
మ్యాడీ మధు ఫోన్ తీసుకొని ఏ అకౌంట్ నుంచి డబ్బు పడ్డాయో ఆ నెంబరుకి కాల్ చేస్తాడు. స్విఛ్ ఆఫ్ వస్తుంది. నీ అకౌంట్ నెంబరు వాళ్లకి ఎలా తెలుసు అని మ్యాడీ అడిగితే ఎవరికో నీ నెంబరు తెలిసి ఇలా చేశారు.. ఎవరికైనా నెంబరు ఇచ్చావా.. ఎవరికైనా ఫోన్ ఇచ్చావా.. హ్యాకర్లు ఈ మధ్య అర్జెంట్‌గా కాల్ చేయాలి అని చెప్పి ఫోన్ తీసుకొని హ్యాక్ చేస్తున్నారు.. అలా ఎవరికైనా ఇచ్చావా అని మ్యాడీ అడుగుతాడు. దాంతో మధు అవును అని విషయం చెప్తుంది. 
మధు ఫోన్ మొత్తం చెక్ చేస్తుంది.. అతను చేయాలి అనుకున్న నెంబరు కూడా ఉండదు.. డిలీట్ చేశాడని అంటుంది. మ్యాడీ బుక్ స్టాల్ దగ్గరకు వెళ్లి సీసీ టీవీ ఫుటేజ్ చూసి వివరాలు తెలుసుకుంటా అని వెళ్తాడు. షాప్ దగ్గరకు వెళ్లి సీసీ టీవీ ఫుటేజ్ తీసుకొని అతను ఫొటో తీసుకొని ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి మా ఫ్రెండ్ మధుని చీట్ చేశాడు అని మాట్లాడుతూ వీడియో రికార్డ్ చేస్తాడు. అన్ని గ్రూప్స్‌లో పెట్టమని ఫ్రెండ్స్‌కి చెప్పి వీడియో వైరల్ చేయమని చెప్తాడు. పోలీస్‌కి విషయం చెప్తాడు.
దేవా, నాగవల్లి కూడా ఆ వీడియో చూస్తారు. వాడు ఆ మధు కోసం ఎంతలా తిపిస్తున్నాడో చూశావా.. ఆ పిల్ల ముఖం చూస్తే అంత ఫ్రాడ్ చేసినట్లు లేదు ఎవరో తనని కచ్చితంగా ఇందులో ఇరికించినట్లున్నారు అని దేవా అంటే.. నాగవల్లి షాక్ అయి ఎవరు ఇరికిస్తే ఏంటిలే చేసిన దానికి అనుభవించాలి కదా అని వెళ్లిపోతుంది. 
దేవా పోలీస్‌లకు కాల్ చేసి విషయం చెప్తే నేను ఆ పనిలోనే ఉన్నాను సార్ ఆ ఫ్రాండ్‌ని పట్టుకుంటా అని అంటాడు. దేవా ఓకే అని చెప్తాడు. మ్యాడీ పోలీసుల్ని వాడుకుంటున్నాడన్న మాట అని అనుకుంటాడు. ఇక నాగవల్లి పీఏతో మాట్లాడి మ్యాడీ వాడి కోసం వెతికిస్తున్నాడు వాడిని ఎక్కడైనా దాక్కోమని చెప్పు అని అంటుంది. 
చందు అందరికీ హాల్ టికెట్స్ ఇస్తాడు. లోహితకి కూడా ఇస్తాడు. మధు అక్కడే బాధగా నిల్చొని ఉంటుంది. మహి ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇంతలో ఓ వ్యక్తి కాల్ చేసి అతన్ని చూశాఅని వివరాలు చెప్తాడు. మ్యాడీ వెంటనే వెళ్తాడు. ఓ గదిలో అతను తాగుతూ ఉంటే మ్యాడీ వెళ్లి చితక్కొడతాడు. అతన్ని తీసుకుంటూ కాలేజ్‌కి వెళ్తాడు.
మధు ప్రిన్సిపాల్‌ని బతిమాలుతుంది. ఇంతలో మ్యాడీ ఆ వ్యక్తిని తీసుకొచ్చి నాలుగు పీకిస్తే అతను ప్రిన్సిపాల్ ముందు నిజం ఒప్పుకుంటాడు. మధుకి ప్రిన్సిపాల్ సారీ చెప్పి చందుతో హాల్ టికెట్ ఇవ్వమని అంటాడు. చందు పోలీస్ స్టేషన్‌కి కాల్ చేస్తాడు. మధుకి హాల్ టికెట్ రావడంతో చాలా హ్యాపీగా ఫీలై మ్యాడీని హగ్ చేసుకొని థ్యాంక్స్ చెప్తుంది. మ్యాడీ పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్తాడు. మీ నాన్న గారు కూడా విషయం చెప్పారు.. అందుకే స్పెషల్ ఫోర్స్ పెట్టించా అని అంటాడు. మధు, మ్యాడీ ఇద్దరూ దేవాకి థ్యాంక్స్ చెప్పాలని వెళ్తారు.
చందు లోహితను చూసి మాట్లాడటానికి వెళ్తాడు. లోహితను పక్కకు తీసుకెళ్లి నీ పాటికి నువ్వు ఇంట్లో నుంచి వచ్చేశావ్ మా పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తాడు. పరీక్ష ఫీజు కూడా నీ ఫ్రెండ్స్ ఇచ్చారు నాకు చెప్పలేదు అంటాడు. నువ్వు పీజీలో ఉండటం ఏంటి.. అమ్మమీద నా మీద ప్రేమ ఉంటే ఇంటికి వచ్చేయ్ అంటాడు. రాను అని లోహి అంటుంది. కుదరదు ఈ రోజు నుంచి నువ్వు ఇంట్లోనే ఉండాలి అని చందు అంటాడు. చందు, లోహిలను శ్రేయ చూస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















