(Source: Poll of Polls)
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 3rd: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: చూపులేకపోయినా రౌడీలను చితక్కొట్టిన లక్ష్మీ! టెండర్ వేయకుండా ఆపుతుందా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode November 3rd లక్ష్మీ టెండర్ ఆపాలని ప్రయత్నించడం లక్ష్మీని ఆపడానికి అంబిక రౌడీలను పంపడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి రిజెక్ట్ చేసిన ప్రాజెక్ట్ కోసం టెండర్ వేయడానికి వెళ్తున్నాడని లక్ష్మీకి తెలుస్తుంది. వెంటనే పండుతో విహారికి కాల్ చేయమని చెప్తుంది. ఇక అంబిక లక్ష్మీ టెండర్ ఆపడానికి ప్రయత్నిస్తుందని ఆలోచించి విహారిని డైవర్ట్ చేయడానికి డ్రైవర్‌ని పెన్‌తో గుచ్చి విహారి అతనితో మాట్లాడేలా చేస్తుంది.
లక్ష్మీ ఫోన్ రావడం చూసి విహారి చూడకుండా ఫోన్ తీసుకుంటుంది. లక్ష్మీ విహారి ఫోన్ లిఫ్ట్ చేశాడని అనుకొని విషయం చెప్తుంది. తర్వాత అంబిక విహారి ఫోన్ స్విఛ్ ఆపేస్తుంది. అంబికకు ట్రై చేసినా స్విఛ్ ఆఫ్ వస్తుంది. లక్ష్మీ యమునకు చెప్పి భయపడుతుంది. యమున లక్ష్మీతో ఈ కుటుంబానికి ఏం జరిగినా అడ్డుకోవడానికి నువ్వు ఉన్నావ్.. నీకు ఆంజనేయుడిలా బలం ఉంది కానీ నీకు గుర్తు చేయాలి.. కళ్లు లేవని నువ్వు బయపడొద్దు నువ్వేం చేయాలో అది చేయ్ అని అంటుంది.
లక్ష్మీ పండుని తీసుకొని టెండర్ దగ్గరకు బయల్దేరుతుంది. అంబిక తన మనుషులకు లక్ష్మీ వస్తుంది చంపేయండి అని మెసేజ్ చేస్తుంది. రౌడీలు లక్ష్మీని ఆపడానికి వెళ్తారు. యమున దేవుడికి దండం పెట్టుకుంటుంది. దీపాలు గాలికి ఊగిసలాడటం చూసి యమున కంగారు పడుతుంది. మళ్లీ ఏం అవుతుంది స్వామి నువ్వే కాపాడాలి అని కోరుకుంటుంది.
రౌడీలు పండు, లక్ష్మీ వెళ్తున్న స్కూటీని ఢీ కొడతారు. లక్ష్మీ, పండు ఇద్దరూ కింద పడిపోతారు. పండు లేచి రౌడీలను అడ్డుకోవాలని చూస్తే రౌడీలు పండుకి తోసేస్తారు. అడ్డుగా ఓ వ్యక్తి వస్తే అతన్ని తోసేస్తారు. లక్ష్మీ దగ్గర ఆ వ్యక్తి టవల్ పడుతుంది. దాంతో పాటు వాటర్ క్యాన్ పడిపోవడంతో లక్ష్మీకి మెలకువ వస్తుంది. లక్ష్మీ మొత్తం వెతికి నీటితో తడిసిపోయిన టవల్ తీసుకొని వీర వనిలా లేచి రాజాదిగ్రేట్‌లో రవితేజలా చూపు లేకపోయినా రౌడీలను చితక్కొట్టేస్తుంది. సీన్ చూస్తే అచ్చం రవి తేజలానే కనకం ఫైట్ చేస్తుంది. దాంతో రౌడీలు సౌండ్ లేకుండా లక్ష్మీని కనిఫ్యూజ్ చేస్తారు. పండు చెప్దాం అనుకుంటే పండుకి గొంతు రాదు.. పండు అరుపులు విని మిగతా రౌడీలను చితక్కొట్టేస్తుంది.
ఫైట్ తర్వాత పండు విజిల్ వేసి లక్ష్మీని తీసుకెళ్తాడు. అందరూ టెండర్లు వేస్తుంటారు. విహారి, అంబిక కూడా వచ్చేస్తారు. అభిషేక్ అని ఓ వ్యక్తి వచ్చి లక్ష్మీని చంపలేకపోయాం పైగా మేమే దెబ్బలు తిన్నాం అని చెప్తాడు. అంబిక అతన్ని చూపులేని దాని చేత దెబ్బలు తినడానికి సిగ్గు లేదా అని తిడుతుంది. ఈ సారి లక్ష్మీ తప్పించుకోవడానికి వీల్లేదని అంబిక చెప్తుంది. లక్ష్మీ వచ్చేలోపు విహారి టెండర్ వేయాలి అని అంబిక ప్రాజెక్ట్ హెడ్‌కి త్వరగా తమని టెండర్‌కి పిలవమని చెప్తుంది.
లక్ష్మీ పండులు టెండర్ వేసే చోటుకి వస్తారు. పండు లక్ష్మీని తీసుకొని లోపలికి వెళ్తుంటే అభిషేక్ ఓ అమ్మాయిని లక్ష్మీ వాళ్లని ఆపడానికి పంపిస్తాడు. ఆమె కావాలనే పండుని ఢీ కొట్టి పండుతో గొడవకు దిగుతాడు. దాంతో మిగతా వాళ్లు వెళ్లి పండుని పక్కకి తీసుకెళ్లి కొట్టి నోరు నొక్కేస్తారు. ఇంతలో విహారి వాళ్లని టెండర్ వేయడానికి పిలుస్తారు. విహారి లోపలికి వెళ్తుంటే లక్ష్మీ ఆపాలి అని ఫాస్ట్‌గా వెళ్తుంటుంది. అభిషేక్ ఎవరూ చూడకుండా లక్ష్మీ నోరునొక్కేసి పక్కకి తీసుకెళ్లాలి అనుకుంటాడు. దాంతో లక్ష్మీ అభిషేక్ చేయి కొరికేసి విహారి అని పిలుస్తుంది. విహారి అంబికతో లక్ష్మీ వాయిస్ వినిపించింది అని అంటాడు. ఏదో భ్రమ అని అంబిక అనేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















