అన్వేషించండి
Nuvvunte Naa Jathaga Serial Today November 3rd: నువ్వుంటే నా జతగా: జడ్జి కిడ్నాప్‌ని దేవా లైట్ తీసుకోవడానికి కారణమేంటి? మిథున వేడుకోలు! రాహుల్ ఆగ్రహం!
Nuvvunte Naa Jathaga Today Episode Nov 3rd తన తండ్రికి కాపాడమని మిథున దేవాని వేడుకోవడం, రాహుల్ దేవా ఇంటికి వెళ్లి దేవా వల్లే తనతండ్రి కిడ్నాప్ అయ్యాడని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

నువ్వుంటే నా జతగా సీరియల్
Source : https://www.hotstar.com/
Nuvvunte Naa Jathaga Serial Today Episode హరివర్ధన్ కిడ్నాప్ అయ్యాడని మిథున చెప్పడంతో దేవా అంత సీరియస్‌గా తీసుకోడు. మిథున ఒక్కర్తే పుట్టింటికి పరుగులు తీస్తుంది. గ్యారేజ్‌కి దేవా వెళ్లిపోతాడు. ఇక పురుషోత్తం గ్యారేజ్‌కి వస్తే మీరు ఎందుకు వచ్చారు అన్న పిలిస్తే నేను వచ్చేవాడికి కదా అని దేవా అంటాడు.

పురుషోత్తం దేవాతో మేటర్ సీరియస్ దేవా జడ్జి హరివర్ధన్‌ని ఎవరో కిడ్నాప్ చేశారు అని చెప్తాడు. దేవా షాక్ అయిపోతాడు. ఇందాక ఇంట్లో మిథున చెప్పింది అన్న కానీ జడ్జిగారికి కిడ్నాప్ చేసే ధైర్యం ఎవరు చేస్తారు అని నేనే లైట్ తీసుకున్నా అని దేవా చెప్తాడు. కానీ సీరియస్‌గా తీసుకోవాలి దేవా.. నీకు జడ్జిగారికి గొడవలు ఉన్నాయి కాబట్టి పోలీసులు నిన్ను అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది.. ఇదే ఛాన్స్‌గా మన ప్రత్యర్థులు మనల్ని బ్యాడ్ చేస్తారు. పోలీసులు సీక్రెట్‌గా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇది నీ మెడకు చుట్టుకునేలా ఉంది నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాడు. దేవా మనసులో హరివర్థన్ గారికి కిడ్నాప్ చేసే అంత అవసరం ఎవరికి ఉంది.. ఆయనకు ఎవరూ శత్రువులు లేరు కదా అని అనుకుంటాడు.


మిథున గుడికి వెళ్లి తన తండ్రి ఫోటో చూపించి అందరినీ అడుగుతుంది. ఓ పూల కొట్టు ఆమె నలుగురు రౌడీలు తీసుకెళ్లడం చూశానని చెప్తుంది. మిథున ఆలోచిస్తూ వదిన అన్నట్లు దేవా మీద కోపంతో ఆ ఎమ్మెల్యే మనుషులు నాన్నని కిడ్నాప్ చేసుంటారా అని అనుకుంటుంది. అక్కడే ఉన్న కానిస్టేబుల్‌కి విషయం చెప్తుంది. నేను ఆ ఎంక్వైరీ కోసమే వచ్చానని కానిస్టేబుల్ అంటాడు. ఈ కిడ్నాప్ వెనక పెద్ద తలకాయే ఉంది.. దీని వెనక ఏదో పెద్ద తతంగమే ఉందని ఆయన అంటాడు.


ఎమ్మెల్యే హరివర్ధన్‌తో ఏసీ కారులో పంపిస్తాం అంటే మీరు మాత్రం మొండికేసి దెబ్బలు తింటున్నారు. మీకు ఈ పాటికే బతకాలి అన్న ఆశ మొదలై ఉంటుంది. నా కొడుకు విషయంలో జోక్యం చేసుకోకూడదు అన్న ఆలోచన మీకు వచ్చేసుంటుంది. బాగా దెబ్బలు తిని అలిసిపోయినట్లు ఉన్నారు. కడుపు నిండా తినేసి నా కొడుకు కేసులో జోక్యం చేసుకోను అని చెప్పండి అని అన్నం ప్లేట్ ఇస్తుంది.


హరివర్థన్ ప్లేట్ తోసేసి ప్రాణం పోయినా వెనక్కి తగ్గను.. ఆడపిల్ల జీవితం నాశనం చేసిన నీ కొడుకుని జైలుకి వెళ్లేలా చేస్తాను.. నేను చేయాలి అనుకున్న న్యాయాన్ని మీరు ఆపలేరు అని అంటాడు. సార్‌లో ధైర్యం పోలేదు.. చావు చూపించండి అని అంటుంది.


దేవా దగ్గరకు మిథున వస్తుంది. మా నాన్న కిడ్నాప్ అయ్యారని చెప్తే వినలేదు కదా కానీ నిజంగానే మా నాన్న కిడ్నాప్ అయ్యారు. పాపం మా అమ్మ చాలా ఏడుస్తుంది దేవా.. మా నాన్న మా బలం మా ధైర్యం.. దేవుడు కనిపించకపోతే గుడి ఎలా ఉంటుంది మా ఇళ్లు ఇప్పుడు అలాగే ఉంది.. మా నాన్న మాకు కావాలి దేవా.. మా నాన్నని నువ్వు మాత్రమే కాపాడగలవు కాపాడు దేవా అని మిథున ఏడుస్తుంది. మీనాన్నని ఎవరు కిడ్నాప్ చేశారు తెలీడం లేదు.. ఇప్పుడు నేను రంగంలోకి దిగితే మీ నాన్నకి కొత్త సమస్య వస్తుంది.. రిస్క్‌లో పడతారు పోలీసులు చూసుకుంటారు నువ్వు టెన్షన్ పడుకు అని దేవా అంటాడు.

మిథున దేవాతో ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు దేవా.. నువ్వు తప్ప ఎవరు కాపాడలేరు. నా మీద కోపం వద్దు దేవా నేను ఎవరో తెలీదు అనుకొని ఓ ఆడపిల్ల తన తండ్రి కోసం వేడుకుంటుందని చెప్తుంది. నేను అంత దుర్మార్గుడికి కాదు.. నాకు కాస్త టైం ఇవ్వు పోలీసులు కాపాడుతారు. నేను చెప్తున్నా కదా నువ్వు ధైర్యంగా వెళ్లు మీ నాన్న వస్తారు అని అంటాడు. ప్లీజ్ దేవా అని మిథున అంటే నేను చూసుకుంటా నువ్వు వెళ్లు అని దేవా మిథునని పంపేస్తాడు.

సత్యమూర్తి వాళ్లు అంతా చాలా టెన్షన్ పడతారు. జడ్జి కిడ్నాప్ న్యూస్ కూడా ఇంకారాలేదు ఏంటా అని అనుకుంటారు. ఇదంతా చూస్తుంటే ఈ కిడ్నాప్ వెనక ఏదో మతలబు ఉందని సత్యమూర్తి అంటాడు. ఇవన్నీ మనకు ఎందుకు అని కాంతం అంటుంది. ఇంతలో రాహుల్ సత్యమూర్తి ఇంటికి వచ్చి పూల కుండీలు విసిరి కొడతాడు. దేవాని పిలుస్తూ అరుస్తాడు. ఎందుకు బాబు మా ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నావ్ అని సత్యమూర్తి అడిగితే నీ రౌడీ కొడుకుని పిలు అంటాడు. దేవా వల్ల మా ఇళ్లు శూన్యమైంది.. మా నాన్న కిడ్నాప్ అయ్యారు ఇదంతా వాడి వల్లే అని అంటాడు. ఇంతలో దేవా రావడంతో రాహుల్ దేవా కాలర్ పట్టుకుంటాడు.

దేవా కూడా రాహుల్ కాలర్ పట్టుకుంటాడు. నీ కోసం వాదించడం వల్లే మా నాన్న కిడ్నాప్ అయ్యాడురా అని అంటాడు. నేనేమైనా సాయం చేయమన్నానా అని దేవా అంటాడు. అదేరా మా నాన్న తెలుసుకోలేకపోయారు నీలాంటి పాముని విడిపించారు అని రాహుల్ అంటాడు. మాట జారితే చంపేస్తా అనిదేవా అంటే చంపేస్తావ్ రా నువ్వు రౌడీ కద ఎదుటి వాళ్ల జీవితాలు నీకు అవసరం లేదు అందుకే కదా నా చెల్లి జీవితం నాశనం చేశావ్.. అని రాహుల్ అంటాడు. మర్యాదగా నువ్వు వెళ్లకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు అని దేవా అంటాడు. ఇతన్ని కాపాడి మా నాన్న రిస్క్‌లో పడ్డారు.. ఇతనికి కనీసం ఆలోచన లేదు.. ఎలా దౌర్జన్యం చేస్తున్నాడో చూడండి ఇలాంటి వాడా మీ కొడుకు.. ఇలాంటి కిరాతకమైన కొడుకుని మీరు కాబట్టి భరిస్తున్నారు ఇలాంటి వాడు నాకు కొడుకు అయింటే విషం పెట్టి చంపేస్తా అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
ఇంకా చదవండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
క్రికెట్
సినిమా
Advertisement





















